అన్వేషించండి

Bandi Sanjay: కార్పొరేటర్ టు సెంట్రల్ మినిస్టర్ - కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాజకీయ ప్రస్థానమిదే!

Telangana News: కేంద్ర మంత్రిగా ఎంపికైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఓ సాధారణ కార్పొరేటర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఆ స్థాయికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Central Minister Bandi Sanjay Political History: బీజేపీలో కింది స్థాయి నుంచి వచ్చిన నేతలకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు లభించింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఐదుగురికి మోదీ కేబినెట్ 3.0లో అవకాశం లభించింది. ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ.. అటు తెలంగాణ నుంచి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి చోటు దక్కింది. వీరు ఆదివారం సాయంత్రం ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) ఓ సాధారణ కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఓసారి చూస్తే..

బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం

బండి సంజయ్ (Bandi Sanjay) కరీంనగర్ ఎంపీగా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న ఆయనకు.. ఇప్పుడు కేంద్ర మంత్రిగా మోదీ కేబినెట్‌లో అవకాశం దక్కింది. బండి సంజయ్ 1971, జులై 11న జన్మించారు. బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో స్వయం సేవకుడిగా, ఏబీవీపీలో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పని చేశారు. భారతీయ జనతా యువ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ, తమిళనాడు ఇంఛార్జీగా బాధ్యతలు చేపట్టారు.

  • కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్ట మొదటిగా 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్‌గా, రెండోసారి అదే 48వ డివిజన్ నుంచి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించారు. వరుసగా రెండు పర్యాయాలు నగర బీజేపీ అధ్యక్షునిగా విధులు నిర్వర్తించారు.
  • 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, 52,000 వేల పైచిలుకు ఓట్లు సాధించి రెండో స్థానానికి పరిమితమయ్యారు. 2016లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియామకమయ్యారు.
  • 2019 ఎన్నికల్లో బీజేపీ తరఫున కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి 66,009 ఓట్లను సంపాదించి రెండో స్థానంలో ఉండగా, రాష్ట్రంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో ప్రథమ స్థానంలో నిలిచారు.
  • 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, టీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టి 96 వేల పైచిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు.
  • 2019 ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబెర్‌గా నియామకం (ఇంకా కొనసాగుతున్నారు). 2019 అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంట్ కమిటీ మెంబెర్‌గా నియామకం (ఇంకా కొనసాగుతున్నారు). 2019 టొబాకో బోర్డు మెంబెర్‌గా నియామకమై సేవలందించారు.
  • 2020 మార్చి 11 నుంచి 2023 జూలై 3 వరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేశారు. 2023 జూలై 8న జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియామకం.
  • 29 జూలై 2023న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, 89,016 ఓట్లు సాధించి 3,163 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

2024 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 5,85,116 ఓట్లు సాధించి, 2,25,209 మెజార్టీతో రెండో సారి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ప్రధాని మోదీ కేబినెట్‌లో బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: ఏపీ మారిటైమ్ పాలసీకి ఆమోదం సహా రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
AP Cabinet Decisions: ఏపీ మారిటైమ్ పాలసీకి ఆమోదం సహా రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
Telangana Govt News: పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు-  ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ఏపీ మారిటైమ్ పాలసీకి ఆమోదం సహా రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
AP Cabinet Decisions: ఏపీ మారిటైమ్ పాలసీకి ఆమోదం సహా రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
Telangana Govt News: పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు-  ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు
Harish Rao Phone Tapping Case Latest News: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం-  హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు- ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ మంత్రి
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు- ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ మంత్రి
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Tripura Bangladesh News: హోటల్స్‌లోకి బంగ్లాదేశీయులకు ఎంట్రీ లేదు- హోటల్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
హోటల్స్‌లోకి బంగ్లాదేశీయులకు ఎంట్రీ లేదు- హోటల్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
Lucknow News: పిలవని పెళ్లి భోజనానికి వెళ్లి లక్నో యూనివర్శిటీ విద్యార్థుల రచ్చ- ఎవరి తరపువాళ్లు అని అడిగినందుకు బంధువులపై దాడి
పిలవని పెళ్లి భోజనానికి వెళ్లి లక్నో యూనివర్శిటీ విద్యార్థుల రచ్చ- ఎవరి తరపువాళ్లు అని అడిగినందుకు బంధువులపై దాడి
Embed widget