అన్వేషించండి

IRCTC Package: హాట్ సమ్మర్ లో కూల్ టూర్ - సికింద్రాబాద్ నుంచి ఊటీకి ప్రత్యేక ప్యాకేజీ, పూర్తి వివరాలివే!

Summer Tours: హాట్ సమ్మర్ లో కూల్ టూర్ ఎంజాయ్ చేయాలనుకునే ప్రయాణికులకు ఐఆర్ సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి ఊటీ, కూనూర్ కు ప్రత్యేక ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది.

Irctc Special Package For Ooty: వేసవిలో పిల్లలకు పరీక్షలు అయిపోయిన తర్వాత చాలా మంది టూర్ ప్లాన్ చేస్తుంటారు. ఈ వేసవి మరింత చల్లగా ఉండాలనుకునే వాళ్లు మాత్రం ఫస్ట్ ఛాయిస్‌లో ఊటీ ఉంటుంది. ప్రపంచవ్యాప్త పర్యాటక రంగంలోనే ఊటీకి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే టూర్‌ ప్రొవైడర్ల లిస్ట్‌లో కచ్చితంగా ఊటీ ఉంటుంది. అందుకే ఊటి వెళ్లే వారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ ప్లాన్ చేసింది. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని ఊటి ప్రకృతి అందాలకు నెలవుగా ఉండడమే కాకుండా.. వేసవిలో పర్యాటకులకు ఓ చక్కటి అనుభూతిని కలిగిస్తుంది. నీలగిరి కొండల్లో ఉన్న మెయిన్ హిల్ స్టేషన్. దీన్ని క్వీన్‌ ఆఫ్‌ హిల్‌ స్టేషన్ అంటారు. ఇక్కడకు రోడ్డు, రైల్వే, విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ఇక్కడ ఉండే ప్రకృతి సౌందర్యం సందర్శకులను మైమరిపిస్తుంది.

ఐఆర్ సీటీసీ ప్యాకేజీ వివరాలివే

ఊటీకి ఐర్ సీటీసీ Ultimate Ooty Ex-Hyderabad పేరుతో వేసవి కోసం ప్రత్యేక ప్యాకేజీ డిజైన్ చేసింది. ఈ ప్యాకేజీలో ఊటీతోపాటు కూనూర్ కూడా కవర్ చేస్తుంది. ఈ ప్యాకేజీ కేవలం సికింద్రాబాద్ నుంచే ప్రారంభమవుతుంది. ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:20 గంటలకు రైలు  అందుబాటులో ఉంటుంది. పర్యాటకులు స్లీపర్ లేదా థర్డ్ ఏసీలో ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ముగ్గురు లేదా అంతకన్నా తక్కువ ప్రయాణికులకు ఒక ధర, ముగ్గురి నుంచి ఆరుగురి వరకూ ఉంటే మరో ట్యారిఫ్ వసూలు చేయనుంది. పిల్లలకు బెడ్ కావాలనుకుంటే ఒక ధర, లేకుంటే మరో ధర ప్రకటించింది. 5 రాత్రుళ్లు, 6 పగళ్లు ఈ టూర్ ఉంటుంది.

ధరలు ఇవే!

ముగ్గురు ప్రయాణికుల లోపు ఉంటే (ఒకటి నుంచి ముగ్గురు ఉంటే).. స్లీపర్ లో స్టాండర్డ్ ధర ప్రకారం సింగిల్ షేరింగ్ లో ఒక్కొక్కరికీ రూ.30,560 కాగా, ట్విన్ షేరింగ్ రూ.16,020, ట్రిపుల్ షేరింగ్ ధర రూ.12,410గా ఐఆర్ సీటీసీ నిర్ణయించింది. అదే థర్డ్ ఏసీ విభాగంలో సింగిల్ షేరింగ్ లో రూ.33,020, ట్విన్ షేరింగ్ రూ.18,480, ట్రిపుల్ షేరింగ్ లో రూ.14,870 ధరగా ఖరారు చేసింది. అదే 5 నుంచి 11 ఏళ్ల లేపు పిల్లలకు స్లీపర్ స్టాండర్డ్ బెడ్ తో రూ.6,970 కాగా, బెడ్ లేకుండా రూ.6,730గా నిర్ణయించారు. అలాగే, థర్డ్ ఏసీలో బెడ్ లేకుండా రూ.9,180గా ధర నిర్ణయిస్తే, బెడ్ తో రూ.9,430గా నిర్ణయించింది.

నలుగురి నుంచి ఆరుగురు ప్రయాణికుల వరకూ.. స్లీపర్ లో స్టాండర్డ్ ధర ప్రకారం ట్విన్ షేరింగ్ రూ.14,470, ట్రిపుల్ షేరింగ్ లో రూ.12,120 ధరగా ఐఆర్ సీటీసీ నిర్ణయించింది. అదే థర్డ్ ఏసీ విభాగంలో ట్విన్ షేరింగ్ రూ.16,930, ట్రిపుల్ షేరింగ్ లో రూ.14,580 గా ఛార్జీలు ఖరారు చేసింది. ఇదే విభాగంలో పిల్లలకు బెడ్ లేకుండా రూ.9,180గా ధర నిర్ణయిస్తే, బెడ్ తో రూ.9,430గా ధర నిర్ణయించింది. అదే, స్లీపర్ స్టాండర్డ్ లో పిల్లలకు బెడ్ తో రూ.6,970 కాగా, బెడ్ లేకుండా రూ.6,730గా నిర్ణయించారు.

ప్రయాణం వివరాలివే

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తొలి రోజు (మంగళవారం) మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రారంభమైన రైలు మర్నాడు ఉదయం 8 గంటలకు కోయంబత్తూరు చేరుకుంటుంది. అక్కడ స్టేషన్ లో దిగి హోటల్ లో చెకిన్ అవ్వాలి. మధ్యాహ్నం వేళ బొటానికల్ గార్డెన్స్, ఊటీ సరస్సు చూసి రాత్రికి ఊటీలోనే బస చేయాలి. మూడో రోజు దొడబెట్టా పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ సందర్శన అనంతరం రాత్రికి ఊటీలోనే బస. నాలుగో రోజు కూనూర్ లో సైట్ సీయింగ్ ఏర్పాటు ఉంటుంది. ఐదో రోజు హోటల్ లో ఉదయం అల్పాహారం అనంతరం మధ్యాహ్నం చెక్ అవుట్ అయ్యి కోయంబత్తూరు స్టేషన్ కు చేరుకోవాలి. ఆ రోజు సాయంత్రం రైలులో 4:35 గంటలకు ఆరో రోజు రాత్రి 12:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ టూర్ ప్యాకేజీలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. లంచ్, డిన్నర్ ప్రయాణికులే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఏసీ వసతి సదుపాయం, స్టేషన్ నుంచి వెళ్లి రావడానికి ఏసీ వాహన సదుపాయం ఉంటుంది. మరిన్ని వివరాలకు ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ www.irctcrourism.com ను సందర్శకులు చూడగలరు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
Embed widget