Niranjan Reddy: నాకు రూ. 12 కోట్ల ఇల్లు ఉంటే, నీకు 4 కోట్లకే అమ్ముతా, వెంటనే డీడీ తీసుకురా!
ఒక్క మచ్చలేకుండా 25 ఏళ్ల పాటు న్యాయవాదిగా పనిచేశానుఒక పథకం ప్రకారమే అసత్యాలు, నిరాధారమైన ఆరోపణలు
BJP MLA Raghu Nandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు మంత్రి నిరంజన్ రెడ్డికి మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది! ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ హీటెక్కింది! నిరంజన్ రెడ్డి అక్రమంగా భూములు కూడగట్టారంటూ రఘునందన్ రావు చేసిన ఆరోపణలపై మంత్రి స్పందించారు. రఘునందన్ రావు కనీస సమాచారం తెలుసుకోకుండా ఎవరో నాలుగు కాగితాలు ఇస్తే ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నిజంగా తనకి 12కోట్ల విలువైన ఇళ్లున్నాయని రఘునందన్ రావు చేసిన ఆరోపణలు నిజమే అని నిరూపిస్తే, వాటికి అంత రేటేగనుక ఉంటే ,అన్నీ ఆయనకే రాసిస్తానని సవాల్ విసిరారు. నిజంగా అంత ధర ఉంటే, డీడీ తీసుకుని రఘునందన్ రావు వస్తే రూ. 4 కోట్లకే అమ్ముతా అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.
చేసిన ఆరోపణలు రుజువు చేస్తే తక్షణమే రాజీనామా చేస్తా
‘’ఎవరి మెప్పుకోసమో, సంచలనాల కోసమో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. నాపై ఆరోపణలు చేసిన రఘునందన్ రావు నాకు ఉద్యమ సహచరుడు. ఒక్కప్పుడు కలిసి ఉద్యమంలో పాల్గొన్నాం. రఘునందన్ రావుపై నేను ఎప్పుడూ వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు. రఘునందన్ రావు తన జిల్లాను వదిలేసి సంబంధం లేని జిల్లాలో నాపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారు. 39ఏళ్ల నుంచి నేను ప్రజలతోనే కలిసి ఉంటున్నాను. రఘునందన్ రావు కనీస సమాచారం తెలుసుకోకుండా ఎవరో నాలుగు కాగితాలు ఇస్తే ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేశారు. ఆర్డీఎస్ కాలువ అనేది ఆరోపణలు వచ్చిన భూముల పరిధిలో లేనే లేదు. రఘునందన్ చెప్పిన సర్వే నెంబర్ 60 భూమి మా పరిధిలో లేదు అది శుద్ధ అబద్ధం. పశువులు వస్తున్నాయని కొంత ప్రహారి గొడ కట్టాం. నా భూమిలోకి వెళ్లే దారిలో ఉన్న రోడ్డు ప్రభుత్వం వేసింది కాదు. మేము రైతులందరూ కలిసి వేసిన CC రోడ్డు. ఈ నెల 27 తరువాత రాష్ట్ర మీడియాను జిల్లాకు తీసుకెళ్తా. అదే సమయంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా రావాలి. చేసిన ఆరోపణలు రుజువు చేయాలి. చేయకపోతే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఆయన చేసిన అన్ని సవాళ్లకు నేను సిద్ధం. నాపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే తక్షణమే రాజీనామా చేస్తా. రఘునందన్ రావు టైంపాస్‌కి మాట్లాడారు అని నేను అనుకోవడం లేదు. ఒక పథకం ప్రకారమే అసత్యాలు, నిరాధారమైన ఆరోపణలు చేశారు. గత ఏడాది నుంచి పొలిటికల్ డిస్ట్రబెన్స్‌కు ప్రయత్నిస్తున్నారు’’ అని నిరంజన్ రెడ్డి అన్నారు.
రఘునందన్ రావుకు ఆసక్తి ఉంటే, రూ. 4 కోట్లకే అమ్ముతా
ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలు థర్డ్ క్లాస్ ఆరోపణలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. సర్వే నెంబర్ 60లో సర్వే చేయాలని సవాల్ విసిరారు. రఘునందన్ రావు తన భూముల దగ్గరకు ఎప్పుడు వస్తారో చెప్తే నేనే దగ్గర ఉండి చూపిస్తా అన్నారు. రఘునందన్ రావు ముందు తన నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సూచించారు. 80 ఎకరాలు అని అంటున్నారు కానీ అవి 90 ఎకరాలు. ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలు నిరూపించకపోతే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఒక్క మచ్చలేకుండా 25 ఏళ్ల పాటు న్యాయవాదిగా పనిచేశాను. మేం భూములు కొంటే, ఆ కాగితాలు దగ్ధం అయ్యాయని ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డులు 2008లోనే ఆన్లైన్ చేశారు. నాకు మూడు ఫామ్ హౌస్ లు ఉన్నాయనడం అబద్ధం అన్నారు. నిజంగా ఫామ్ హౌజ్‌లు, ప్యాలెస్‌లు ఉంటే రాత్రికి రాత్రి మాయం చేశానా? రఘునందన్ రావు మా జిల్లాకు ఎప్పుడూ రాలేదు...మరి దొంగతనంగా వచ్చి చేశారో నాకు తెలియదు. నాకు అంత విలువైన ఇల్లుంటే ఆయనకే రాసిస్తా అన్నారు. 12కోట్ల విలువైన ఇల్లు ఉందని రఘునందన్ రావు ఆరోపించారు- అంతా రేటు ఉంటే ఆయనకే రాసి ఇస్తా అన్నారు. నిజంగా అంత ఉంది అనుకుంటే డిడి తీసుకుని రఘునందన్ రావు వస్తే 4 కోట్లకే అమ్ముతా! అని సవాల్ విసిరారు.