అన్వేషించండి

YS Sharmila: డబ్బా కొట్టడం కాదు! దమ్ముంటే ఆ సీట్లు మహిళలకు కేటాయించండి: మంత్రి కేటీఆర్ కు షర్మిల సవాల్

YS Sharmila Challenges Minister KTR: బీఆర్ఎస్ ప్రకటించిన సీట్లలో మహిళలకు 33 శాతం తక్షణమే అమలు చేసి చూపించాలని, బిల్లు కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదన్నారు షర్మిల.

YS Sharmila Challenges Minister KTR: 

హైదరాబాద్: తన సీటు పోయినా పర్వాలేదని, కానీ మహిళా రిజర్వేషన్ అమలులోకి రావాలని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చే వరకు ఎందుకు ఎదురుచూస్తున్నారు, మీకు నిజంగా ఇవ్వాలని ఉంటే ఇప్పుడు కూడా సిరిసిల్ల సీటును మహిళలకు కేటాయించవచ్చునని సూచించారు. 

గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో మహిళల ఓట్లే అధికం కాబట్టి  దమ్ముంటే మీ సీట్లను ఇప్పుడే త్యాగం చేయండి అని మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు షర్మిల. అలా చేసినప్పుడే మీకు నిజంగా మహిళల పట్ల చిత్తుశుద్ధి ఉందని నమ్ముతామన్నారు. మహిళల పట్ల మీకు ఎంతో చిత్తశుద్ధి ఉందని, మీవి అవకాశవాద రాజకీయాలు కాదని ప్రజలు విశ్వసించాలంటే దమ్ముంటే కేటీఆర్ ఈ సవాల్ స్వీకరించాలని షర్మిల డిమాండ్ చేశారు.

తన సీటు కోల్పోయినా సిద్ధమే అని చెబుతున్న కేటీఆర్.. నిజంగా మహిళల రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ ఎన్నికల్లోనే మీ సీటు త్యాగం చేసి ఒక మహిళకు ఇవ్వండి. మిమ్మల్ని అడ్డుకునేదెవరు అని ప్రశ్నించారు. మీరు డబ్బాలు కొట్టుకుంటున్నట్టు మహిళా బిల్లు నిజంగా మీ పోరాట ఫలితమే అయితే బిల్లు అమల్లోకి రాకముందే ఈ ఎన్నికల్లోనే మహిళలకు పెద్దపీట వేయాలని, మీ సీటు మహిళకు ఇవ్వండి అని కోరారు. 

మాటలతో చిత్తశుద్ధి నిరూపించలేమని, చేతలతోనే అవుతుందన్నారు. 119 నియోజకవర్గాల్లో 63 స్థానాల్లో మహిళా ఓటర్లే ఎక్కువని ఎన్నికల సంఘం చెబుతుందని, 33 శాతం లెక్కన ఈ ఎన్నికల్లో మీరిచ్చిన 7 సీట్లతో పాటు మరో 32 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీ పార్టీ ప్రకటించిన సీట్లలో మహిళలకు 33 శాతం తక్షణమే అమలు చేసి చూపించాలని, బిల్లు కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించిన రాష్ట్రంగా తెలంగాణను ఆదర్శంగా నిలపాలన్నారు. 

మహిళలను దారుణంగా అవమానించిన మీరే ఈరోజు మహిళల గురించి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు అంటూ షర్మిల ఫైర్ అయ్యారు. నిరుద్యోగుల కోసం మేం దీక్షలు చేస్తే వ్రతాలంటూ ఎద్దేవా చేసింది, మహిళా మంత్రులు లేకుండా చేసింది మీరే అంటూ విమర్శించారు. రాష్ట్రంలో మహిళా కమీషన్ ఉందన్న సంగతే మర్చిపోయారు. ఉద్యమం కోసం బలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లి ఓడిపోతే ఆమెకు ఏ పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మీ చెల్లి కవిత ఓడిపోతే కేసీఆర్ బిడ్డ కాబట్టి ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నారు.. అంటే మీకు మీకున్నది మహిళల మీద ప్రేమ కాదు.. కేవలం మీ కుటుంబం మీద ప్రేమ అని ప్రజల్ని మీరెప్పుడు ప్రేమించలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget