By: ABP Desam | Updated at : 04 Dec 2022 08:17 PM (IST)
వైఎస్ షర్మిల (Photo Source: Youtube Screenshot)
KCR will be held responsible if anything happened to me, Says Sharmila: తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన గూండాలతో తనకు ప్రాణహాని ఉందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు తన విషయంలో భయం పట్టుకుందని, అందుకే తన ప్రజా ప్రస్థానం పాదయాత్రను సాగనివ్వడం లేదని విమర్శించారు. ఆడవాళ్లు లిక్కర్ స్కాంలో ఉండొచ్చు కానీ.. రాజకీయాలు చేయకూడదా..? అని సీఎం కేసీఆర్‌ను షర్మిల ప్రశ్నించారు. ప్రజల కోసం పాదయాత్ర చేపట్టే తనకు కాదని, సీఎం కేసీఆర్ కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలన్నారు. వైఎస్సార్ లెగసీ చూసి కేసీఆర్ కి భయం పట్టుకుందని, మా పాదయాత్ర కి వస్తున్న ఆదరణ చూస్తే కేసీఆర్ కి వణుకు పుడుతోందన్నారు.
పాదయాత్రని ఆపాలని కేసీఆర్ కంకణం
తన పాదయాత్ర కేసీఆర్ పాలనకు అంతిమ యాత్ర అవుతుందని, ఇది కేసీఆర్ కి స్పష్టంగా అర్థం కావడంతోనే పాదయాత్రని ఆపాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారని షర్మిల మండిపడ్డారు. పోలీస్ ల భుజాన తుపాకీ పెట్టీ మా పాదయాత్రను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ముగ్గురు ఏసిపి లు మా దగ్గరకు వచ్చి పాదయాత్ర ను ఆపాలని మొదట చెప్పారు. రెండో సారి హైదరాబాద్ లో రిమాండ్ కోరారు. మూడోసారి కోర్ట్ ఆదేశాలు ఉన్నా కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు. ఇవన్నీ చూస్తుంటే పోలీస్ శాఖను జీతగాల్లులా, టీఆర్ఎస్ కార్యకర్తల్లా కేసీఆర్ దొర వాడుతున్నారు అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘మీ అవినీతి బయట పెడుతుంటే తినేది జీర్ణం అవ్వడం లేదా..?. ఒక మహిళ పాదయాత్ర చేసి లోపాలు ఎత్తి చుపుతుంటే మింగుడు పడటం లేదు. ఎలాగైనా పాదయాత్ర ఆపాలని కంకణం కట్టుకున్నారు. పాదయాత్ర ఆపడానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న అని చెప్తున్నారు. నా బస్సు తగల బెట్టింది ఎవరు. మా వాళ్ళను కొట్టింది ఎవరు..? మా కార్లను పగలగొట్టింది నేనేనా..?. ఎక్కడ కూడా మేము శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదు. ఏ ఒక్క నియోజక నియోజక వర్గంలో కూడా మేము విఘాతం కలిగించలేదు. మా పరిధి దాటి అసభ్యకరంగా మాట్లాడలేదు. నర్సంపేట లో తప్పు మాది అని సృష్టిస్తున్నారు. మా బస్సులు టీఆర్ఎస్ నేతలు తగలబెట్టారు. మా కార్యకర్తలను కొట్టారు. మమ్మల్ని కొట్టడమే కాకుండా మేమే తప్పు చేశాం అంటున్నారు. నేను వ్యక్తిగత దూషణలుకు దిగాను అంటున్నారు. తప్పులు ఎత్తి చూపిస్తే వ్యక్తి గత దూషణ అంటున్నారు. నా పై మంగళ వారం మరదలు అంటే అది వ్యక్తి గత దూషణ కాదా..? నాకు కనీసం క్షమాపణ చెప్పకుండా నన్నే చిత్ర హింసలకు గురి చేస్తున్నారు’ అని పత్రికా ప్రకటనలో షర్మిల పలు విషయాలు ప్రస్తావించారు.
https://t.co/Ri6k0mvzkd
మా పాదయాత్ర.. KCR పాలనకు అంతిమయాత్ర. అందుకే అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నాడు. ఎనిమిదేండ్లుగా ఏ పార్టీ ప్రశ్నించని అవినీతి, అక్రమాలను YSR తెలంగాణ పార్టీ ప్రశ్నిస్తే.. మా పార్టీని పైకి రాకుండా KCR దాడులు చేయిస్తున్నాడు. నాకు కూడా ప్రాణహాని ఉంది.— YS Sharmila (@realyssharmila) December 4, 2022
నాకు కాదు, కేసీఆర్‌కు ఇవ్వాలి షోకాజ్ నోటీసులు
మహిళ అయి ఉండి 3500 km పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను ఎత్తి చూపిస్తున్నాను. తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నారు. రాష్ట్రంలో ఏ నియోజక వర్గంలో చూసినా అవినీతి ఉంది. అక్కడ ప్రతిపక్షాలను సైతం కొనేశారు. ఆడింది ఆట గా పాడింది పాటగా సాగింది. మీరు అవినీతి పరులు కాకపోతే పబ్లిక్ ఫోరం ఏర్పాటు చేయండి. ప్రజలు వస్తారు.. రిపోర్టర్ లు వస్తారు. మా ఆరోపణలు బయట పెడతాం. మీరు అవినీతి పరులు కాకపోతే చర్చకు రండి. ఈ రోజు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే.. నా మీద షోకాజ్ నోటీస్ ఇచ్చారు. షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సింది కేసీఆర్ కు. తెలంగాణ ప్రజల తరుపున కేసీఆర్ కి షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. ఎందుకు రుణమాఫీ చేయలేదు అని షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. ఎందుకు మహిళలకు సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వలేదు షోకాజ్ ఇవ్వాలి. ఎంత మంది బిడ్డలు చనిపోయినా విలువ ఇవ్వని కేసీఆర్ కి షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. ఒక్క మాట కూడా నిలబెట్టుకోని మీరు నాకు షోకాజ్ నోటీస్ ఇస్తారా..?. ఎన్ని ఇళ్ళులు కట్టారు..ఎంత మందికి రుణమాఫీ చేశారు.. ఎన్ని భూములకు పోడు పట్టాలు ఇచ్చారు..మీరు శ్వేత మాత్రం విడుదల చేయండి’ అని షర్మిల డిమాండ్ చేశారు.
Hyderbad Crime : ఆన్లైన్ లో కాంటాక్ట్ చేసి హైదరాబాద్ కు రప్పించి, వ్యాపారి నుంచి డైమండ్ కొట్టేసిన కేటుగాడు
Adilabad News : కట్టెల కోసం వెళ్లిన ఆదివాసీపై అటవీ అధికారుల దాడి, విషమంగా ఆరోగ్య పరిస్థితి
Puvvada Ajay Kumar :మంత్రి పువ్వాడ అజయ్ కు కోర్టు ధిక్కరణ నోటీసులు
Bandi Sanjay : విజయశాంతి చివరి మజిలీ బీజేపే కావాలి, పార్టీని వీడిన వారంతా తిరిగిరండి- బండి సంజయ్
Revanth Reddy : ఏ ఊర్లో డబుల్ బెడ్రూం ఇవ్వలేదో అక్కడ ఓట్లు అడగొద్దు, కేటీఆర్ సవాల్ కు సిద్ధమా? - రేవంత్ రెడ్డి
IND vs NZ 1st T20: సుందర్ ఒంటరి పోరాటం సరిపోలేదు - మొదటి వన్డేలో టీమిండియా భారీ ఓటమి!
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్కు పేర్ని నాని కౌంటర్ !