2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్

హైదరాబాద్: భవిష్యత్తులో పాకిస్థాన్‌లో హిందూ జెండా రెపరెపలాడిస్తామని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. బేగంబజార్ ఛత్రిలో ఊరేగింపు సందర్భంగా భారీ వాహనంపై భక్తులను ఉద్దేశించి రాజాసింగ్ ప్రసంగిస్తూ అఖండ భారతావనిగా ముందుకు సాగుతామన్నారు. మొఘల్ సామ్రాజ్యం హయాంలో దేశంలో 40 వేల మందిరాలు కూల్చివేశారణి ఆరోపించారు. కానీ చట్ట ప్రకారం 300 మందిరాలు మాత్రమే ఇవ్వాలని అడుగుతున్నారు.. కానీ కొందరు హిందూ తిరుగుబాటుదారులు అడ్డుకుంటున్నారు.
ఇప్పటికే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందని... త్వరలో హిందూ రాష్ట్రం కూడా ఏర్పడుతుందని అన్నారు. అయోధ్య రామమందిర నిర్మాణం, రామ్ లల్ల ప్రాణప్రతిష్ఠ గురించి వారికి చెప్పాలని అన్నారు. 2027 నాటికి భారతదేశాన్ని సంపూర్ణ హిందూ దేశంగా తీర్చిదిద్దుతామని.. అంతే కాకుండా భవిష్యత్తులో పాకిస్థాన్‌లో హిందూ జెండా రెపరెపలాడుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందువుల 500 ఏళ్ల కల అయోధ్య రామమందిర నిర్మాణంతో సాధ్యమైందన్నారు. భారతదేశం ఎప్పటికీ అఖండ హిందూ దేశంగా మారుతుందని హిందూ ద్రోహులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. దుల్‌పేటలోని ఆకాశ్ పురి హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రత్యేక పూజలు చేసి విశాల్ శోభాయాత్రను ప్రారంభించారు. పెద్దఎత్తున యువకుల మధ్య అశేష తన పాటలు పాడుతూ, డీజే హోరుకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ర్యాలీ సాగింది. ఈ శోభాయాత్రలో ప్రత్యేకించి అయోధ్య రామమందిరంలోని బల రాముని విగ్రహం రూపంలో శోభాయాత్ర ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)




















