Brahma Kamalam: ముక్కోటి ఏకాదశి రోజు వికసించిన బ్రహ్మ కమలాలు, సాక్షాత్తూ బ్రహ్మ స్వరూపమే ఇంటికి!
Brahma kamalam: ఐదు బ్రహ్మ కమలం పువ్వులు ముక్కోటి ఏకాదశి రోజున వికసించాయి. సాక్షాత్ ఆ బ్రహ్మ స్వరూపం మా ఇంటికి వచ్చినట్టుగా వారు భావిస్తున్నారు.
Brahma kamalam News In Telugu: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల : షాపూర్ నగర్ ప్రాంతంలో నివాసముండే సురేష్ గౌడ్ ఇంట్లో మూడు సంవత్సరాల కిందట బ్రహ్మ కమలం (Brahma kamalam) ఆకును ఏర్పాటు చేశాడు. డిసెంబర్ నెలలో మొదటిసారి ఒక బ్రహ్మ కమలం పువ్వు కార్తీక పౌర్ణమి రోజున వికసించింది. రెండవసారి ఐదు బ్రహ్మ కమలం పువ్వులు ముక్కోటి ఏకాదశి రోజున వికసించాయి. ఇలా ప్రత్యేకమైన రోజు బ్రహ్మ కమలం పూయడం అనేది సాక్షాత్ ఆ బ్రహ్మ స్వరూపం మా ఇంటికి వచ్చినట్టుగా మేము భావిస్తున్నామని వారు తెలిపారు.
హిమాలయాల్లో ఎక్కువగా వికసించే బ్రహ్మ కమలం..
ఈ బ్రహ్మ కమలం అనేది హిమాలయాల్లో మాత్రమే ఉండే పువ్వు అని ప్రజల నమ్మకం, అలాంటిది బ్రహ్మ కమలం పువ్వు పూయడం అనేది, ఎన్నో జన్మల పుణ్య పలమణి ప్రజల నమ్మకం. ఈ పువ్వు ఆకునుండి మాత్రమే పూస్తుంది వీటికి ఎలాంటి వేర్లు కాండం అనేది ఉండవు. ఇది రాత్రి సమయంలో మాత్రమే పువ్వు వికసిస్తుంది. రెండు, మూడు గంటల సమయంలో మళ్లీ ముడుచుక పోతుంది. ఈ పువ్వు శివునికి అతి ఇష్టమైన పువ్వుగా ప్రజలు నమ్ముతారు.
బ్రహ్మ కమలం విశిష్టతలు..
Brahma kamalam Importance: బ్రహ్మ కమలం ఎక్కువగా హిమాలయ ప్రాంతంలో కనిపిస్తుంది. బ్రహ్మ కమలం శాస్త్రీయ నామం సస్సూరియా ఓబ్‌వల్లట అని చెబుతారు. ఈ పవిత్ర పుష్పం సంవత్సరానికి ఒకసారి అదీ ఒక రాత్రి మాత్రమే వికసిస్తుంది. హిమాలయాల్లో వికసించిన ఈ బ్రహ్మ కమలాన్ని చూస్తే శుభం కలుగుతుందని విశ్వసిస్తారు. ఈ పువ్వు ఆధ్యాత్మికతకు, స్వచ్ఛతకు ప్రతీక. పురాణ రహస్యాలతో కూడిన ఈ సొగసైన పుష్పం శతాబ్దాలుగా మానవుల ఊహల్లో కొనసాగింది. కొంత మంది తమ ఇళ్లలోనూ బ్రహ్మ కమలం మొక్కలను పెంచుతున్నారు.
హిందూ పురాణాల ప్రకారం, బ్రహ్మకమలం ఒక ఖగోళ పుష్పం, ఇది సంవత్సరంలో ఒక రాత్రి మాత్రమే వికసిస్తుంది. హిందూ గ్రంధాల ప్రకారం, బ్రహ్మ విష్ణువు నాభి నుంచి ఉద్భవించిన కమలం నుండి జన్మించాడు. అందుకే ఈ కమలాన్ని బ్రహ్మ కమలం అని పిలుస్తారు. హిందూ సంస్కృతిలో త్రిమూర్తులుగా పూజలందుకునే ముగ్గురిలో ఒకరైన బ్రహ్మ ఈ బ్రహ్మ కమలం మొక్కను సృష్టించాడని భావిస్తారు. బ్రహ్మ కమలం ఏడాదికి ఒకసారి మాత్రమే వికసించే పుష్పం. దీనిని బ్రహ్మదేవుడు అనుగ్రహించిన పుష్పం అని చాలామంది అంటారు. ఈ పువ్వు వికసించే రోజు కోసం అందరూ ఎదురు చూస్తుంటారు.
Also Read: ఈ రాశులవారికి 2024 లో వివాహయోగం, ప్రేమికులకు గుడ్ టైమ్!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
Also Read : పూజలో కలువ పూలను ఎందుకు వినియోగిస్తారో తెలుసా?