News
News
X

Uppal Double Murders: ఉప్పల్ తండ్రీకొడుకుల హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు, నిందితుల ప్లాన్‌ను కనిపెట్టిన పోలీసులు!

పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకొని ముమ్మర విచారణ చేయగా, స్థిరాస్తి విషయం, కుటుంబ గొడవలు, కోర్టు కేసులు ఈ హత్యకు కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు.

FOLLOW US: 

రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని ఉప్పల్‌లో ఉన్నట్టుండి సంచలనం రేపిన బ్రాహ్మణులైన తండ్రీ కొడుకుల జంట హత్య కేసులో విస్తుగొలిపే వాస్తవాలు పోలీసుల విచారణ ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకొని ముమ్మర విచారణ చేయగా, స్థిరాస్తి విషయం, కుటుంబ గొడవలు, కోర్టు కేసులు ఈ హత్యకు కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు. నిందితులను 12 ప్రత్యేక పోలీస్ టీమ్‌లు పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే, కచ్చితమైన కారణం కోసం పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఒకటి లేదా రెండు రోజుల్లో నిందితులను పట్టుకొని తీరతామని పోలీసులు చెబుతున్నారు.

హత్య కోసం పక్కాగా రెక్కీ
నిందితులు హత్య చేసేందుకు ముందు పక్కా ప్రణాళిక రచించికుకున్నట్లుగా తెలుస్తోంది. హత్యకు ఏ సమయం అనుకూలంగా ఉంటుంది. జన సంచారం ఎప్పుడు తక్కువ, అనే విషయంలో పక్కా ప్రణాళిక ప్రకారం నడుచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన నరసింహ శర్మ ఇంటి వద్దే ఉంటూ తెలిసిన వ్యక్తులకు జాతకాలు, పంచాంగం చెబుతుంటారు. ఉదయం 6.30 నుంచి సాయంత్రం వరకూ చాలా మంది వచ్చి వెళ్తుంటారు. ఉదయం 5-6 గంటల సమయంలో ఎవరూ ఉండరని హత్య కోసం ఆ సమయం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 

శుక్రవారం ఉదయం ఘటన జరగడానికి ముందు 5 గంటల ప్రాంతంలో పని మనిషి వచ్చి నరసింహ శర్మ ఇంట్లో పని చేస్తోంది. ఆ వెంటనే పూలమ్మే వ్యక్తి వచ్చాడు. పూలు ఇచ్చి తిరిగివెళ్లాక గేటు తెరిచే ఉంది. ఇదంతా గమనించిన ముగ్గురు దుండగులు వెంటనే ఇంట్లోకి ప్రవేశించి దారుణంగా హత్య చేశారు. 

పోలీసుల అదుపులో హాస్టల్‌ నిర్వాహకులు
పోలీసులు మొత్తం 12 టీమ్‌లతో రంగంలోకి దిగగా, ఇప్పటికి బంధువులు, స్థానికులతోపాటు అనుమానం ఉన్న 40 మందిని ప్రశ్నించారు. తరచూ జాతకాల కోసం వచ్చి వెళ్లే వారి వివరాలు.. హత్య అనంతరం నిందితులు ఎటువైపు ఏ వాహనంలో వెళ్లారో తెలుసుకునేందుకు 10 కి.మీ. పరిధిలోని సుమారు 200 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు చూశారు. హత్యకు ముందు వారంతా ఓ స్థానిక హాస్టల్‌ నుంచి వచ్చినట్లు నిర్ధారించారు. ఆ హాస్టల్‌ నిర్వహకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

News Reels

పని చేయని సీసీటీవీ కెమెరా
వీరు ఇంటి ముందు సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయించుకున్నారు. అయితే, అవి గత 10 రోజుల నుంచి పనిచేయట్లేదు. నిందితులు ఉద్దేశపూర్వకంగానే దాన్ని పనిచేయకుండా చేశారా? లేదంటే పాడైందా అనేది కూడా పోలీసులు గుర్తిస్తున్నారు. కక్ష కట్టిన నిందితులు స్వయంగా హత్య చేశారా? లేక సుపారీ గ్యాంగ్‌ చేసిందా అనే కోణంలో కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Published at : 16 Oct 2022 12:44 PM (IST) Tags: Hyderabad crime news Hyderabad News Uppal murders father son murders

సంబంధిత కథనాలు

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Jeevitha Rajashekar : జీవితా రాజశేఖర్ ను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాడు, ఆఫర్ల పేరుతో టోకరా!

Jeevitha Rajashekar : జీవితా రాజశేఖర్ ను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాడు, ఆఫర్ల పేరుతో టోకరా!

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

Minsiter Harish Rao : సర్కార్ దవాఖానల్లో 56 టిఫా స్కానింగ్ మిషన్లు, ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

Minsiter Harish Rao : సర్కార్ దవాఖానల్లో  56 టిఫా స్కానింగ్ మిషన్లు, ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

టాప్ స్టోరీస్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి