రేసర్‌తో ఉపాసన చెల్లెలి ఎంగేజ్‌మెంట్.. హాజరైన మెగాస్టార్ చిరు.. రామ్ చరణ్ రాలేదేంటి
మెగా కోడలు, రామ్‌చరణ్ భార్య ఉపాసన.. చెల్లెలు అనుష్పాల త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతుంది. చెన్నైలో ఆమె ఎంగేజ్‌మెంట్ జరిగింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరదలు .. ఉపాసన కొణిదెల చెల్లెలు అనుష్పాల త్వరలో పెళ్లి కూతురు కానుంది. చెన్నైకి చెందిన కార్ రేసర్ అర్మాన్ ఇబ్రహీంని ఆమె పెళ్లాడుతున్నారు. ఇవాళ వాళ్ల నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే మరదలి నిశ్చితార్థానికి రామ్ చరణ్ హాజరు కాలేదని తెలుస్తోంది.
రేసర్ అర్మన్ ఇబ్రహీం-అనుష్పాల కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇందులో భాగంగానే వారి నిశ్చితార్థం జరిగింది. అతడితో త్వరలోనే ఏడడుగులు వేయనుంది అనుష్పాల. గతంలోనే వారిద్దరికి శుభాకాంక్షలు చెబుతూ.. ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. 'నా డార్లింగ్స్‌కు అభినందనలు' అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌పై ఆమె అభిమానులతో పాటు కాజల్, తమన్నా వంటి పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉపాసన సోదరికి శుభాకాంక్షలు తెలియజేశారు.
మాజీ ఇండియన్ ఎఫ్ 3 ఛాంపియన్ అక్బర్ ఇబ్రహీం తనయుడే అర్మన్ ఇబ్రహీం. కార్ రేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అర్మాన్ ఇబ్రహీం తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని కార్ రేసర్ గా ప్రతిభను నిరూపించుకుని పాపులారిటీ సంపాదించాడు. అనుష్పాల అపోలో సంస్థల కార్యకలాపాల్లో ఉపాసనతో పాటు బిజీబిజీగా ఉంటారు. అపోలో గ్రూప్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి.. దోమకొండ కోటకు చెందిన ఉమాపతి రావులకు అనుష్పాల మనవరాలు. శోభన- అనిల్ కామినేనిల కూతురు.
View this post on Instagram