News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

TSRTC News: 27 బస్సులు, 166 మంది స్టాఫ్‌తో మొదలైన టీఎస్ఆర్టీసీ చరిత్ర తెలుసా?

TSRTC News: 9 దశాబ్దాల చరిత్ర కల్గిన టీఎస్ ఆర్టీసీలో తెలంగాణ సర్కారు సరికొత్త జోష్ నింపింది. నిజాం కాలంలో ప్రారంభమైన ఈ ప్రస్థానం అనేక అద్భుతమైన రికార్డులు సాధిస్తూ దూసుకెళ్తోంది.

FOLLOW US: 
Share:

TSRTC News: తొమ్మిది దశాబ్దాల చరిత్ర కల్గిన తెలంగాణ ఆర్టీసీ మరింత ప్రగతి చక్రంపై దూసుకెళ్తోంది. నిజాం కాలంలో అంటే 1932వ సంవత్సరంలో ప్రారంభం అయిన ఆర్టీసీ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతోంది. అనేక అద్భుతమైన రికార్డులతో దూసుకెళ్తున్న ఆర్టీసీని అప్పట్లో నిజాం రాష్ట్ర రైల్వే - రోడ్డు రవాణా శాఖ అని పిలిచేవారు. 27 బస్సులు, 166 మంది సిబ్బంది ఉండేవారు. స్వాతంత్ర్యం తర్వాత 1951 నవంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం అయింది. ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 1958 జనవరి 11వ తేదీన ఏపీఎస్ ఆర్టీసీగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో 22 వేల 628 బస్సులతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ రవాణా వ్యవస్థగా చరిత్ర సృష్టించింది. 1999లో గిన్నిస్ రికార్డు కూడా సాధించింది.  

2014వ సంవత్సరంలో రాష్ట్ర విభజన అనంతరం 2015 జూన్ 3వ తేదీన తెలగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా రూపాంతరం చెందింది. అప్పటికీ సంస్థకు 98 డిపోలు ఉన్నాయి. టీఎస్ ఆర్టీసీకి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్ 7వ తేదీన ఆర్టీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్ గఢ్ కు సర్వీసులు నడుస్తున్నాయి. రోజుకు సుమారు 90 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 9 వేల 384 బస్సులు ఉన్నాయి. ఇందులో 68 శాతం అంటే సుమారు 6 వేల 300 బస్సులు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 364 బస్ స్టేషన్లు ఉన్నాయి. 

అయితే గత కొన్నేళ్ల క్రితం ఆర్టీసీ చాలా గొప్పగా ఉండేది. పల్లెల్లోని చాలా మంది ప్రజలు ప్రయాణానికి ఆర్టీసీ బస్సులనే వాడేవాళ్లు. అలాగే ఆఫీసులకు వెళ్లాలన్నా ఎక్కువ మంది దీన్నే నమ్ముకునే వారు. కానీ కాలానుగుణంగా ప్రజలు అందరూ వ్యక్తిగత వాహనాలు, ప్రైవేటు వాహనాలు, క్యాబ్ లు, ఆటోలు ఇలా అన్నింటి వల్ల ఆర్టీసీ చాలా నష్టాలను చివచూసింది. నాటి ప్రభుత్వ నిర్లక్ష్యంతో అప్పుల్లో కూరుకుపోయింది. జీతాలకు కూడా అప్పులు తేవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా సంస్థకున్న వేల కోట్ల ఆస్తులను తనఖా పెట్టాల్సి దుస్థితికి చేరుకుంది. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ తొలి నుంచి ఆర్టీసీకి అండగా నిలుస్తున్నారు. ప్రజా జీవితంలో భాగమైన ఆర్టీసీకి ఏటా బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయిస్తూ వచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వారు చేసిన సేవలకు గుర్తింపుగా మొదట 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించారు. నిర్వహణకు డబ్బుల కోసం ప్రభుత్వం గ్యారంటీగా ఉంటూ అనేక రుణాలు ఇప్పంచింది. అయినా నష్టాలు, కష్టాల బాటలోనే ప్రయాణించడంతో తమను ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని సీఎం కేసీఆర్ కు కార్మికులు విజ్ఞప్తి చేశారు. తాజాగా ప్రభుత్వం వారికి శుభవార్త చెబుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. 

అయితే దీనిపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర కేబినేట్‌ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం అని ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. సంస్థలోని దాదాపు 43 వేల మంది సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవం ఇదంటూ వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్లుగా నిబద్దతతో పని చేస్తున్న సిబ్బంది శ్రమను గుర్తించి.. వారిని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నరాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్‌ఆర్టీసీ కుటుంబం తరపున కృతజ్ఞతలు చెప్పారు. సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ నిర్ణయంతో సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి.. ప్రజా రవాణా వ్యవస్థను తెలంగాణలో మరింతగా ప్రజలకు చేరువ చేస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. 

Published at : 01 Aug 2023 12:38 PM (IST) Tags: Telangana Govt telangana rtc TSRTC News Telangana News Latest News of RTC

ఇవి కూడా చూడండి

TSSPDCL Jobs: విద్యుత్‌ సంస్థల్లో 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌, మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడి

TSSPDCL Jobs: విద్యుత్‌ సంస్థల్లో 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌, మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడి

Anganwadi Teachers: అంగన్వాడీ టీచర్లకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్, పీఆర్సీ అమలుకు నిర్ణయం

Anganwadi Teachers: అంగన్వాడీ టీచర్లకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్, పీఆర్సీ అమలుకు నిర్ణయం

KNRUHS: బీఎస్సీ నర్సింగ్‌ సీట్ల భర్తీకి వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం, ఎంఎస్సీ నర్సింగ్ రిజిస్ట్రేషన్ షురూ

KNRUHS: బీఎస్సీ నర్సింగ్‌ సీట్ల భర్తీకి వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం, ఎంఎస్సీ నర్సింగ్ రిజిస్ట్రేషన్ షురూ

PM SHRI: తెలంగాణలో 279 హైస్కూళ్లలో సైన్స్ ల్యాబ్‌లు, ఒక్కో పాఠశాలకు రూ.16 లక్షలు మంజూరు

PM SHRI: తెలంగాణలో 279 హైస్కూళ్లలో సైన్స్ ల్యాబ్‌లు, ఒక్కో పాఠశాలకు రూ.16 లక్షలు మంజూరు

DASARA Holidays: తెలంగాణలో దసరా, బతుకమ్మ సెలవులు, మొత్తం ఎన్ని రోజులంటే? ఏపీలో సెలవులు ఇలా!

DASARA Holidays: తెలంగాణలో దసరా, బతుకమ్మ సెలవులు, మొత్తం ఎన్ని రోజులంటే? ఏపీలో సెలవులు ఇలా!

టాప్ స్టోరీస్

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా  ?