News
News
X

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం, దర్యాప్తు సీసీఎస్ కు బదిలీ

TSPSC paper leak case transferred to ccs: తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్ పేపర్ల లీకేజీ కేసులో కీలక పరిమాణం చోటుచేసుకుంది.

FOLLOW US: 
Share:

TSPSC paper leak case transferred to ccs: తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్ పేపర్ల లీకేజీ కేసులో కీలక పరిమాణం చోటుచేసుకుంది. పేపర్ లీకేజీ కేసు దర్యాప్తును సీసీఎస్ కు బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసు దర్యాప్తు జరగనుంది. అంతకుముందు అన్ని నియామక బోర్డులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బీఆర్కే భవన్ లో సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం పేపర్ లీకేజీ కేసు దర్యాప్తును సీసీఎస్ కు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. 

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు నిందితులకు 14 రోజుల రిమాండ్ 
టీఎస్ పీఎస్సీ ఉద్యోగ నియామక పరీక్ష పేపర్ లీకేజీ కేసులో 9 మంది నిందితులని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దాంతో నిందితులను చంచల్ గూడ జైలు కు పోలీసులు తరలిస్తున్నారు. అంతకుముందు 9 మంది నిందితులకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏఈ పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ వ్యవహారంలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. గతంలో జరిగిన గురుకుల ప్రిన్సిపల్‌ పోస్టులకు సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి. ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వని వారికి సైతం రీ కరెక్షన్ పేరుతో పైరవీలు చేసి జాబ్స్ ఇప్పించాడని సరికొత్త ఆరోపణలు వస్తున్నాయి. లెక్చరర్‌గా పని చేయాలన్న నిబంధనలను పక్కనపెట్టి, పలువురు మహిళలకు ఫేక్ ఐడీ కార్డులు క్రియేట్ చేశాడని కొత్త కోణం వెలుగుచూసింది. 

నిందితుడు ప్రవీణ్ వద్ద కాపీలు స్వాధీనం
ఏపీ పేపర్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పేపర్లు, టెక్నికల్ ఆఫీసర్ పరీక్షల పేపర్లు లీక్ ఆరోపణలు వచ్చాయి. విచారణలో భాగంగా ఏఈ పేపర్ నకళ్లు ప్రధాన నిందితుడు ప్రవీణ్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడి వద్ద ఏఈ, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పేపర్లను ఉంచుకున్నాడు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పేపర్ నకళ్లు సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక అడిగినందువల్లే టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్, , పొరుగుసేవల ఉద్యోగి రాజశేఖర్‌ రెడ్డి పేపర్లు లీక్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. 837 అసిస్టెంట్ ఇంజినీరు పోస్టులకు  మార్చి 5న జరిగిన పరీక్ష ప్రశ్నపత్రం లీకైందన్న సమాచారంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తొలుత మార్చి 12న నిర్వహించాల్సిన టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీర్(టీపీబీవో) పరీక్ష ప్రశ్నపత్రాలు లీకయ్యాయని భావించారు. కానీ, ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలు లీకైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు కంప్యూటర్ నుంచి కాపీ చేసిన ఫోల్డర్‌లో ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలతో పాటు భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్లు తెలిసింది.

టీఎస్ పీఎస్సీ ఆఫీసు ముట్టడికి యత్నం
నాంపల్లిలోని టీఎస్ పీఎస్సీ కార్యాలయన్ని అభ్యర్థులు, బీఎస్పీ నేతలు, విద్యార్థి సంఘాలు ముట్టడించే ప్రయత్నం చేశారు టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో బాధ్యులపై కఠిన తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆందోళనకారులను అడ్డుకుని గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. టీఎస్ పీఎస్సీ ఆఫీసు వద్ద అదనపు బలగాలను మోహరించారు. ఓయూలోనూ విద్యార్థులు, అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కమిషన్ చైర్మన్ ను సస్పెండ్ చేయాలని, పేపర్ లీకేజీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. 

Published at : 14 Mar 2023 06:42 PM (IST) Tags: Hyderabad TSPSC Telangana TSPSC AE Exam TSPSC Paper Leak CCS

సంబంధిత కథనాలు

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

TS SSC Exams: తెలంగాణలో రేపట్నుంచి 'టెన్త్ క్లాస్' ఎగ్జామ్స్, విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం!

TS SSC Exams: తెలంగాణలో రేపట్నుంచి 'టెన్త్ క్లాస్' ఎగ్జామ్స్, విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం!

Inter Academic Calender: ఇంటర్ అకడమిక్ ​క్యాలెండర్​ విడుదల, ఈ ఏడాది వచ్చే సెలవులివే!

Inter Academic Calender: ఇంటర్ అకడమిక్ ​క్యాలెండర్​ విడుదల, ఈ ఏడాది వచ్చే సెలవులివే!

నేటి నుంచే ఉప్పల్ లో IPL పోరు, 215 మంది ట్రాఫిక్ పోలీసులతో ట్రాఫిక్ కష్టాలకు చెక్

నేటి నుంచే ఉప్పల్ లో IPL పోరు, 215 మంది ట్రాఫిక్ పోలీసులతో ట్రాఫిక్ కష్టాలకు చెక్

కొత్త విధానంలో ఇంటర్ మూల్యాంకనం, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే? ​

కొత్త విధానంలో ఇంటర్ మూల్యాంకనం, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే? ​

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్

Lok Sabha Election 2024: ఢిల్లీ వేదికగా ఒక్కటవుతున్న విపక్షాలు, స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం

Lok Sabha Election 2024: ఢిల్లీ వేదికగా ఒక్కటవుతున్న విపక్షాలు, స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం