TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ముగ్గురు నిందితులు
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నం కేసులో నిందితులైన రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీలు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నం జరగడం సంచలనం రేపింది. ప్రస్తుతం నిందితులు జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసులో నిందితులైన రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, నంద కుమార్, సింహయాజీలు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే యత్నం చేసిన కేసులో తమ అరెస్టును సవాలు చేస్తూ ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిందితులను అరెస్టు చేయడానికి అనుమతినిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం ముందు నిందితుల తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. శుక్రవారం నాడు విచారణ కేసుల జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీకి సీజేఐ ధర్మాసనం ఆదేశించింది.
TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుయత్నం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు జైలుకు తరలించారు. 26వ తేదీన ఈ కేసు వెలుగులోకి రాగా.. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 41-ఏ సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం తగదంటూ రిమాండ్ ను మొదట ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోవాలని న్యామూర్తి ఆదేశాలు జారీ చేశారు. లేదా ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపాలని న్యాయమూర్తి ఆదేశారు ఇచ్చారు. మరోవైపు బీజేపీ నేతలు.. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు తమకు నమ్మకం లేదని సీబీఐకి కేసు అప్పగించాంటూ దాఖలు చేసిన పిటిషన్ పై మరో న్యాయమూర్తి విచారణ జరిపారు. దర్యాప్తును వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నిందితులకు 14 రోజుల రిమాండ్
హైకోర్టు ఆదేశాలతో నిందితులైన రామచంద్ర భారతి, సింహయాజి, నంద కుమార్ ను పోలీసులు శనివారం రెండోసారి అరెస్ట్ చేశారు. అనంతరం ఏసీబీ కోర్టులో హాజరు పరచగా.. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. 41-ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం తగదటూ ఏసీబీ కోర్టు రిమాండ్ ను తిరస్కరించడంతో... హైకోర్టును ఆశ్రయించి పోలీసులు అనుమతి పొందారు. ఈ క్రమంలోనే నిందితులు ఫిల్మ్ గనర్ షేక్ పేట దారిలో ఉన్న నందకుమార్ నివాసమైన ఆదిత్య హిల్ టాప్ లో ఉన్నట్లు పోలీసులు సమాచారం సేకరించారు. అక్కడకు వెళ్లిన బంజారాహిల్స్ పోలీసులు, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు వెళ్లగా.. గమనించిన నందకుమార్ లిఫ్టును నిలిపివేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఎనిమిదో అంతస్తు వరకు మెట్లు ఎక్కుతూ వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. నందకుమార్ తో పాటు సింహయాజి, రామ చంద్ర భారతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరచగా నిందితులకు రిమాండ్ విధించారు. విచారణలో భాగంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపార వేత్తలతో వీరికి ఉన్న సన్నిహిత సంబందాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.