అన్వేషించండి

TRS Leaders On Modi: తెలంగాణ నేలపై కమలం వికసించే ఛాన్స్ లేదు- మోదీ కామెంట్స్‌కు టీఆర్‌ఎస్ కౌంటర్

ప్రధానమంత్రి మోదీ పగటి కలలు కంటున్నారని విమర్శించారు టీఆర్‌ఎస్ లీడర్లు. తెలంగాణ నేల, నీటిపై కమలం వికసించే ఛాన్స్ లేదంటున్నారు.

కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై ప్రధానమంత్రి మోదీ చేసిన కామెంట్స్‌పై ఘాటుగా స్పందించారు టీఆర్‌ఎస్‌ లీడర్లు. తల్లిని చంపి పిల్లను బతికించారని గతంలో కామెంట్ చేసిన మోదీకి.. తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. మాటలు తప్ప మోదీ ప్రభుత్వంలో చేతలు కరువయ్యాయని విమర్శించారు. స్వచ్చభారత్, భేటీ బచావో - భేటీ పడావో, జన్ ధన్, నోట్ల రద్దు, జీఎస్టీ, మేకిన్ ఇండియా ఇలా అన్ని పథకాలు, నినాదాలు, విధానాలు విఫలమైనవేనన్నారు. 

ఆగస్టు కల్లా మరో 8 లక్షల కోట్లు అప్పు

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి చోటు లేదన్న నిరంజన్‌ రెడ్డి.. నరేంద్రమోదీది అత్యాశ అవుతుందన్నారు. మోదీ, షా దేశాన్ని అమ్ముతుంటే ఆదానీ, అంబానీలు కొనుక్కుంటున్నారన్నారు. కరోనా విపత్తులో దేశం అల్లాడుతుంటే చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి అని దేశ ప్రజలను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని కామెంట్స్ చేశారు. ఎనిమిదేళ్ల పాలనలో 100 లక్షల కోట్ల అప్పు చేసిన మోదీ రేపు ఆగస్టు వరకు మరో 8 లక్షల కోట్ల ప్రతిపాదనలు తయారుచేసి పెట్టారన్నారు. 

కార్పొరేట్ల రుణాలు మోదీ మాఫీ 

నాలుగు వేల కోట్లు పెట్టి తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనమంటే మొహం చాటేసిన మోదీ రూ.11 లక్షల కోట్ల కార్పోరేట్ అప్పులను మాఫీ చేశారని ఆరోపించారు నిరంజన్ రెడ్డి. మోదీ హయాంలో దేశంలో ఎక్కడైనా పది లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే  ప్రాజెక్టు కట్టారా అని ప్రశ్నించారు. దేశ రైతుల ఉసురు పోసుకుని క్షమాపణలు చెప్పిన విఫల ప్రధాని మోదీ అంటూ విరుచుకుపడ్డారాయన. 

గుజరాత్‌లో కరెంటు సంగతేంటి?

మూడుసార్లు ముఖ్యమంత్రిగా, రెండు సార్లు దేశ ప్రధానిగా ఉండి గుజరాత్‌లో కనీసం 24 గంటల కరంటు ఇవ్వలేకపోయిన ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు ఏం చేస్తారని ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి. కేంద్రంలో 15 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే నింపడం చేతగాని మోదీ యువకుల గురించి మాట్లాడడం హస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నిరంకుశత్వం, కుటుంబపాలన అనే మాటలు మోదీ నోటి నుంచి వింటే నవ్వొస్తుందన్నారు. 

మేకిన్ ఇండియా కాదు సేల్‌ ఇండియా

ఎదగాల్సిన భారత ఆర్థిక వ్యవస్థను కుంటుపడేలా చేసింది మోదీ ఎనిమిదేళ్ల పాలన అని విమర్శలు చేశారు నిరంజన్ రెడ్డి. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మి దేశాన్ని అధోగతి పాలు చేశారని ధ్వజమెత్తారు. మేకిన్ ఇండియాను నినాదానికి పరిమితం చేసి సేల్ ఇండియాను పరిచయం చేశారన్నారు. భారతదేశ చరిత్రలో అత్యంత విఫల ప్రధాని మోదీ ప్రపంచదేశాల ముందు భారత్‌ను నవ్వులపాలు చేశారని విమర్శించారు. 

వాట్సాప్‌ యూనివర్శిటీ కట్టుకథలు

అంధవిశ్వాసాలను నమ్మనంటున్న మోదీ అంధ భక్తులను తయారుచేసి పబ్బం గడుపుకుంటున్నారన్నారు నిరంజన్ రెడ్డి. వాట్సప్ యూనివర్శిటీలో కట్టుకథలు తయారు చేసి ప్రచారం చేస్తూ దేశంలో వివిధ రాష్ట్రాల్లో హింసను రెచ్చగొడుతున్నారని విమర్శలు చేశారు. కర్ణాటకలో హిజాబ్, హలాల్, మహారాష్ట్రలో హనుమాన్ ఛాలీసా, యూపీలో జ్ఞానవాపి, మసీదుల శివలింగాలు అంటూ బీజేపీ నేతలు చిల్లర పంచాయతీలు లేపుతున్నారన్నారు. భారతీయ ముస్లింలు దేశం కోసం ప్రాణమిస్తారు, భాషల మీద రాజకీయం చేయవద్దు అని మోదీ అంటుంటే.. తెలంగాణ బీజేపీ నేతలు ఉర్దూ పేరుతో రాజ్యాంగ విరుద్ద వ్యాఖ్యలు చేశారని... ముస్లింల మీద విషం చిమ్ముతారన్నారు. 

స్థాయి మరచి విమర్శలు 

నరేంద్ర మోదీ తాను అత్యున్నత స్థాయి పదవిలో ఉన్నానన్న మాట మర్చి మాట్లాడారని మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశం వచ్చినప్పుడల్లా, అది పార్లమెంటు లోపల, బయట విషం చిమ్ముతున్నారన్నారు. కాకినాడలో 1997లో బిజెపి జాతీయ నాయకత్వం ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానించి మాట తప్పినందునే తెలంగాణ యువత ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారని కొప్పుల ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహోద్యమాన్ని నడిపించి, రాజకీయ పార్టీలన్నింటి మద్దతు కూడా గట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం...అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేస్తుండడం ప్రపంచమంతా చూస్తున్నదన్నదన్నారు. దేశకాల పరిస్థితుల పట్ల కేసీఆర్ కు ఉన్న సంపూర్ణ అవగాహన, లోతైన ఆలోచనలు, వ్యూహరచన, దార్శనికత తెలిసి..వివిధ పార్టీల అధ్యక్షులు, దేశ ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందనలు చూసి మోదీ వణికిపోతున్నారని కొప్పుల పేర్కొన్నారు. 

కమలం ఇక్కడ వికసించే ఛాన్స్ లేదు

మోదీ పట్టపగలే కలలు కన్నారని, అవి ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా నిజం కాబోవన్నారు కొప్పుల. తెలంగాణలోనే కాదు వచ్చే లోకసభ ఎన్నికలలో బిజెపికి ఘోర పరాజయం తప్పదని ఈశ్వర్ సుస్పష్టం చేశారు. బిజెపి గత ఎన్నికలలో 107 అసెంబ్లీ స్థానాలలో డిపాజిట్లు కోల్పోయిన విషయం బహుశా మోదీ తెలిసి ఉండకపోవచ్చని చెప్పారు. ఆ పార్టీకి వచ్చే ఎన్నికలలో ఇప్పుడున్న 4 లోకసభ, 3అసెంబ్లీ సీట్లు కూడా రావని, ఈ నేలపై, ఈ నీళ్లలో ఆ పువ్వు వికసించే అవకాశం ఏ మాత్రం లేదని కొప్పుల ఈశ్వర్ చెప్పారు.

పార్లమెంట్ భవనం ఎందుకు కడుతున్నారు?

ప్రధాని మోడీ తెలంగాణపై విషంకక్కారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ప్రధాని హోదాలో ఉండి అబద్దాలు చెప్పారన్నారు. తెలంగాణకు ఒక్క సంస్థను ఇవ్వకుండా అన్యాయం చేశారని... మెడికల్ కాలేజీ, నవోదయ స్కూల్స్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఐటీఐఆర్‌ను రద్దు చేసిన చరిత్ర మోదీదన్నారు. ఏడు మండలాలను ఏపీలో కలిపి ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ను తెలంగాణ సాకుతోంది. పార్లమెంట్ భవనం మూడ నమ్మకంతోనే కూల కొడుతున్నారో లేదో మోదీ సమాధానం చెప్పాలన్నారు. 

తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ తీరును త‌ప్పుబ‌ట్టారు గంగుల కమలాకర్. ఆయ‌న మ‌సీదుల‌పై చేసిన వ్యాఖ్యల‌ను ఖండించారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో మతకలహాలు లేకుండా... లా అండ్ ఆర్డర్ అదుపులో ఉందని తెలిపారు. బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విధ్వంసాన్ని సృష్టించేందుకు యత్నిస్తున్నార‌ని ఆరోపించారు. మతకలహాలు ఉన్న ప్రాంతం అభివృద్ధికి నోచుకోదు... ఇందుకు గుజరాత్ నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్న మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌.. ప్రధాని స్వరాష్ట్రం అయిన‌ప్పటికీ అందుకే అక్కడికి ప్రపంచ స్థాయి కంపెనీలు రావడం లేదని తెలిపారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sankranti 2025: సంక్రాంతి బండెక్కిన హైదరాబాద్‌- ఊరెళ్లే రహదారులన్నీ జామ్‌
సంక్రాంతి బండెక్కిన హైదరాబాద్‌- ఊరెళ్లే రహదారులన్నీ జామ్‌
CM Revanth Reddy: 'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
CM Chandrababu: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
Pawan Kalyan: 'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sobhan Babu House Vlog | చిన నందిగామ లో నటభూషణ్  కట్టిన లంకంత ఇల్లు | ABP DesamKondapochamma Sagar Tragedy | కొండపోచమ్మసాగర్ లో పెను విషాదం | ABP DesamNagoba Jathara Padayathra | ప్రారంభమైన మెస్రం వంశీయుల గంగాజల పాదయాత్ర | ABP DesamPawan Kalyan vs BR Naidu | టీటీడీ ఛైర్మన్ క్షమాపణలు కోరేలా చేసిన డిప్యూటీ సీఎం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sankranti 2025: సంక్రాంతి బండెక్కిన హైదరాబాద్‌- ఊరెళ్లే రహదారులన్నీ జామ్‌
సంక్రాంతి బండెక్కిన హైదరాబాద్‌- ఊరెళ్లే రహదారులన్నీ జామ్‌
CM Revanth Reddy: 'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
CM Chandrababu: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
Pawan Kalyan: 'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
Telangana News: భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక   
భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక  
Sankranti Traffic Jam: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
CM Chandrababu: సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Kondapochamma Sagar Dam: సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం - సాగర్ డ్యామ్‌లో పడి ఐదుగురు యువకుల దుర్మరణం, సెల్ఫీ కోసం ఒకరినొకరు పట్టుకుంటూ..
సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం - సాగర్ డ్యామ్‌లో పడి ఐదుగురు యువకుల దుర్మరణం, సెల్ఫీ కోసం ఒకరినొకరు పట్టుకుంటూ..
Embed widget