Traffic Diversions In Hyderabad: అల్లు అర్జున్ వస్తున్నాడు- హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions In Hyderabad Today : ఫుష్ప 2 సినిమాప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ విషయాన్ని గమనించి ఆ ప్రాంతాల్లో వాహనాలు నడపాలని పోలీసులు సూచిస్తున్నారు

Traffic Restrictions In Hyderabad Today Latest News: పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ హైదరాబాద్‌లో జరగనుంది. యూసఫ్‌గూడలో జరిగే కార్యక్రమంలో కోసం భారీగా అభిమానులు తరలిరానున్నారు. అందుకే ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అటుగా వెళ్లాల్సిన వాళ్లంతా ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యాలకు చేరాలని పోలీసులు ముందస్తు అలర్ట్ జారీ చేశారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ముఖ్యంగా నాలుగు మార్గాల్లో ట్రాఫిక్ డైవర్స్‌న్స్ చేస్తున్నారు.
- జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి కోట్ల విజయ భాస్కర్ స్టేడియం వైపు వెళ్లే ట్రాఫిక్‌ను కృష్ణానగర్ జంక్షన్ వద్ద శ్రీనగర్ కాలనీ పంజాగుట్ట వైపు మళ్లిస్తారు.
- మైత్రీవనం జంక్షన్ నుంచి వచ్చే ట్రాఫిక్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, మాదాపూర్ వైపు వెళ్లే ట్రాఫిక్ యూసుఫ్‌గూడ బస్తీ వద్ద RBI క్వార్టర్స్-కృష్ణానగర్ జంక్షన్-జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు మళ్లిస్తారు.
- మైత్రీవనం జంక్షన్ నుంచి బోరబండ బస్ స్టాప్ వైపు వచ్చే ట్రాఫిక్ సవేరా ఫంక్షన్ హాల్- కృష్ణకాంత్ పార్క్- GTS టెంపుల్- కళ్యాణ్ నగర్- మోతీ నగర్- బోరబండ బస్ స్టాప్ వద్ద మళ్లిస్తున్నారు.
- బోరబండ బస్టాప్ నుంచి వచ్చే ట్రాఫిక్, మైత్రీవనం జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు ప్రైమ్ గార్డెన్ కళ్యాణ్ నగర్- మిడ్‌ల్యాండ్ బేకరీ- GTS కాలనీ- కళ్యాణ్ నగర్ జంక్షన్- ఉమేష్ చంద్ర విగ్రహం యూ టర్న్ జంక్షన్ వద్ద మళ్లిస్తున్నారు.
- వీటిని గమనించి వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం వచ్చే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను పోలీసులు సూచించారు. అక్కడే తమ వాహనాలను పార్క్ చేయాలని ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దని రిక్వస్ట్ చేస్తున్నారు. జానకమ్మతోట, సవేరా ఫంక్షన్ హాల్, మహమ్మద్ ఫంక్షన్ హాల్‌లో తమ వాహనాలను పార్క్ చేయాలని పోలీసులు చెబుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

