అన్వేషించండి

నేడు ప్లైఓవర్లు, ఓఆర్‌ఆర్‌ మూత. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

కొత్త సంవత్సరం సందర్భంగా నగరంలో మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగించారు.. డిసెంబర్ 31 నుంచి జనవరి ఒకటో తేదీ అర్ధ రాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

డీజీపీగా నేడు అంజనీకుమార్‌ బాధ్యతల స్వీకరణ.

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా అంజనీకుమార్‌ ఈ రోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి పదవీకాలం నేటితో ముగియనుంది. దీంతో ప్రభుత్వం అంజనీకుమార్‌ను ఇన్‌చార్జి డీజీపీగా నియమించింది. డీజీపీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు మహేందర్‌రెడ్డి నుంచి అంజనీకుమార్‌ డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తారు. అంజనీకుమార్‌తోపాటు ప్రభుత్వం బదిలీ చేసిన ఇతర అధికారులు ఈ రోజే తమకు అప్పగించిన నూతన బాధ్యతల్లో కొలువుదీరనున్నారు.

మెట్రో రైళ్ల సమయం పొడిగింపు..

కొత్త సంవత్సరం సందర్భంగా నగర ప్రయాణికులకు శుభవార్త అందించింది మెట్రో. శనివారం (డిసెంబర్‌ 31)న మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 31 నుంచి జనవరి ఒకటో తేదీ అర్ధ రాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. మొదటి స్టేషన్‭లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. చివరి స్టేషన్ చేరే వరకు అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు వినియోగించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. డిసెంబర్ 31 న సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్‭లో పట్టుబడకుండా మెట్రో రైల్ సేవలను వినియోగించుకోవాలని హైదరాబాద్ మెట్రో అధికారులు సూచించారు.అదే సమయంలో మద్యం మత్తులో మెట్రోలో ప్రయాణికులను ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు.

నేడు ప్లై ఓవర్లు మూత. 
కొత్త సంవత్సరం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, నిబంధనలు విధించనున్నారు. ఇందులో భాగంగా నగరవ్యాప్తంగా ఉన్న అన్ని ఫ్లై ఓవ‌ర్లను మూసివేయనున్నారు. బేగంపేట్, లంగ‌ర్ హౌజ్ ఫ్లై ఓవ‌ర్లు మాత్రం తెరిచి ఉంటాయి. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్‌ ట్యాంక్‌ వైపు వాహ‌నాల‌ను అనుమ‌తించరు. హుస్సేన్ సాగ‌ర్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కఠినంగా అమలు చేయనున్నారు. నగరవాసులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు.

పట్టుబడితే పదివేలు. మందుబాబులు తస్మాత్ జాగ్రత్త. 

డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడితే పదివేల రూపాయల జరీమాన విధించనున్నట్లు పోలీసులు తెలిపారు. లేదా ఆరునెలల జైలు శిక్ష విధిస్తామని అధికారుులు చెప్పారు. రెండో సారి డ్రంకన్ డ్రైవ్ లో దొరికితే 15వేల రూపాయల జరీమాన, 2సంవత్సరాల జైలు శిక్ష తప్పదని పేర్కొన్నారు. లైసెన్స్ సీజ్ చేసి సస్పెన్షన్ కు రవాణాశాఖకు సిఫార్సు చేస్తామని పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. 

పబ్ నిర్వాహకులకు హైకోర్టు షాక్

హైదరాబాద్‌లోని పలు పబ్ నిర్వాహకులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. నగరంలోని జూబ్లీహిల్స్ పరిధిలోని 10 పబ్‌లో రాత్రి 10 తర్వాత మ్యూజిక్ (సౌండ్) పెట్టొద్దని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలపై పబ్ నిర్వాహకులు వెకెట్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు న్యూఇయర్ వేడుకల్లోను ఆంక్షలు పాటించాల్సిందేనని హెచ్చరించింది. రాత్రి 10 గంటల తరువాత మ్యూజిక్‌ సౌండ్‌ పెట్టరాదని పేర్కొంది. గత ఆదేశాల ప్రకారమే న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశించింది.

నేటి ఉదయం నుంచే రిజర్వేషన్‌కు అవకాశం

సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అధికంగా రద్దీ ఉండే రోజుల్లో ప్రత్యేక రైళ్లు బయలుదేరేలా ఏర్పాట్లు చేశారు. జనవరి 7 నుంచి 18 వరకు తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య నడవనున్నాయి. హైదరాబాద్ నుంచి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. రైళ్ల పూర్తి వివరాలు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. రేపు ఉదయం 8గంటల నుంచి ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం కల్పించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
Best Gun Combinations in BGMI: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
Best Gun Combinations in BGMI: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Thaman: నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
Andhra Pradesh News: 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
AP Assembly: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
Embed widget