Traffic Restrictions: నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు- ఈ దారిలో వెళ్లే వారికి అలర్ట్
హైదరాబాద్ ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఎల్బీస్టేడియంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్న సందర్భంగా.. పలు రోడ్లు మూసివేతతోపాటు దారి మళ్లింపులు కూడా ఉన్నాయి.
Traffic Alert in Hyderabad: హైదరాబాద్(Hyderabad)లో ఎల్బీస్టేడియం(LB Stadium) వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ అలర్ట్(Traffic Alert) వచ్చింది. నేడు ఆ మార్గంలో వెళ్లే వారు... కాస్త దారి మార్చుకుంటే ఇబ్బందులు తప్పించుకోవచ్చు. లేదంటే ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఎందుకు అంటారా...? ఇవాళ ఎల్బీస్టేడియం మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5గంటల తర్వాత అటువైపు వెళ్లాలంటే...ఆ రూల్స్ పాటించాల్సిందే. రోజు వెళ్లే దారిలో కాకుండా.... చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. కనుక.. అత్యవసర పనులు ఉంటే తప్ప... ఎల్బీనగర్ మార్గంలో ఇవాళ వెళ్లకపోవడం ఉత్తమం.
న్యూ గైడ్‌లైన్స్
ఎల్బీస్టేడియం వైపు.. ఇవాళే ఎందుకు ట్రాఫిక్ రూల్స్ పెట్టారో తెలుసా..? హైదరాబాద్ (HYDERABAD)లోని ఎల్బీ స్టేడియం (LB STADIUM)లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. మరో మూడు రోజుల్లో క్రిస్మస్ రానుంది. ఈ సందర్భంగా... ఇవాళ... ఎల్బీస్టేడియంలో క్రిస్మస్ సెమీ వేడుకలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 నుంచి జరుగనున్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు హాజరుకాబోతున్నారు. దీంతో... ఎల్బీస్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) విధించారు.
ఐదు నుంచి 9 వరకు ఆంక్షలు
సాయంత్రం 5 గంటల నుంచి 9గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని... హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ సమయంలో పలు మార్గాలు మూసివేయనున్నారు. కొన్ని రోడ్ల వైపు ట్రాఫిక్‌ను అనుమతించకుండా... దారిమళ్లింపులు ఉంటాయని తెలిపారు. కనుక... వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.
ఎల్బీస్టేడియం వైపు ఏయే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయంటే...
హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో సమీపంలోని... ఏఆర్ పెట్రోల్‌బంక్ చౌరస్తా నుంచి బషీర్‌బాగ్ బీజేఆర్ విగ్రహం జెంక్షన్ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ఆ మార్గంలో వెళ్లాల్సిన వాహనాలను... నాంపల్లి లేదా రవీంద్రభారతి వైపు పంపిస్తారు. ఇక... అబిడ్స్, గన్‌ఫౌండ్రి వైపు నుంచి వెళ్లే ట్రాఫిక్‌ను.... బషీర్‌బాగ్ బీజేఆర్ విగ్రహం కూడలి వైపు అనుమతించరు. ఆ మార్గంలో వెళ్లే వాహనాలను గన్‌ఫౌండ్రిలోని ఎస్‌బీఐ నుంచి సుజాతా స్కూల్, చాపెల్ రోడ్డు వైపు మళ్లిస్తారు. చివరిగా... ట్యాంక్‌బండ్ నుంచి బషీర్‌బాగ్ కూడలి వైపు వెళ్లే వాహనాలను.... లిబర్టీ జంక్షన్ నుంచి హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు. ఇవాళ సాయంత్రం 5గంటల నుంచి 9గంటల మధ్యలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండాలి. 9గంటల తర్వాత ఆంక్షలు ఎత్తివేసే అవకాశం ఉంది. కనుక... ఆయా మార్గాల్లో ఇవాళ ప్రయాణం చేయకపోవడం ఉత్తమం. లేదంటే... చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. పైగా ట్రాఫిక్ జామ్‌లు కూడా ఉండే అవకాశం ఉంది. కనుక... ట్రాఫిక్ అలర్ట్‌ను గమనించి.. అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవడమే బెటర్.