అన్వేషించండి

మరికొన్ని గంటల్లో ముగియనున్న పెండింగ్‌ ట్రాఫిక్‌ చలానాల ఆఫర్ గడువు

తెలంగాణలో పెండింగ్‌ ట్రాఫిక్‌ చలానాల చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో...ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.

 Pending Challans Clearance : తెలంగాణ (Telangana)లో పెండింగ్‌ ట్రాఫిక్‌ చలానాల చెల్లింపు గడువు (Last Date ) నేటితో ముగియనుంది. ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో... ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు (Traffic Police )సూచించారు. దీనికి వాహనదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. డిసెంబరు 25 వరకు ఉన్న పెండింగ్ చలాన్లపై భారీ రాయితీ ఇచ్చింది. ద్విచక్రవాహనాలు, ఆటోలకు 80%, ఆర్టీసీ బస్సులకు 90%, ఇతర వాహనాలకు 60% డిస్కౌంట్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల రికార్డుల ప్రకారం 3.59 కోట్ల పెండింగ్‌ చలానాలు ఉన్నాయి. ఇందులో 80 లక్షల మందికిపైగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను చెల్లించారు. దాదాపు 70 కోట్ల రూపాయలు పెండింగ్ చలాన్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్‌, నెట్‌బ్యాంకింగ్‌ ద్వారానూ చెల్లింపులు చేయవచ్చు. 

గతంలో 300 కోట్ల రూపాయలు వసూలు
గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ చలాన్లపై రాయితీలను ప్రకటించింది. 2022 మార్చి 31 నాటికి 2.4 కోట్ల పెండింగ్‌ చలాన్లు ఉంటే.. రాయితీల ద్వారా అప్పుడు ఏకంగా రూ.300 కోట్ల రూపాయలు వరకు చలాన్లు వసూలు అయ్యాయి. ఈ సారి  3.50 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్‌ ఉండటంతో మరోసారి రాయితీలు ప్రకటించింది. దీంతె మరోసారి ప్రభుత్వానికి చలాన్ల వసూలు ద్వారా  భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. నేటితో చలాన్లు చెల్లించలేకపోతే వందశాతం చలాన్లు చెల్లించాల్సి ఉంటుంది. 

చలాన్ల వసూళ్ల కోసం వినూత్న ప్రచారం
పెండింగ్‌ చలాన్ల వసూలు కోసం పోలీసు యంత్రాంగం వినూత్నంగా ప్రచారం చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జరిమానాలను రాబట్టేందుకు కొత్త పద్ధతులను అవలంబిస్తోంది. ప్రధానకూడళ్లు, జంక్షన్లలో పెండింగ్‌ చలానా చెల్లించాలంటూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. డిస్కౌంట్‌ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలంటూ సూచిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. 

టెక్నాలజీ సాయంతో చలాన్లు విధింపు
హెల్మెట్‌ ధరించకపోవడం, నంబర్‌ప్లేట్‌ లేకుండా వాహనం నడపడం, ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్‌ రైడింగ్‌ చేయడం, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇన్సూరెన్స్‌ లేకపోవడంతో పోలీసులు చలాన్లు వేస్తున్నారు. వీటికి తోడు రాంగ్‌ రూట్‌లో వాహనం నడపడం, ట్రాఫిక్‌ సిగ్నల్‌ జంప్‌ చేయడం వంటి నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా విధించారు. వీరందరికీ రాయితీతో కూడిన బకాయిలు చెల్లించే అవకాశం లభించింది.  సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి చలానాలు విధిస్తున్నారు పోలీసులు. ట్రాఫిక్ చలాన్లను వాహనదారులు సకాలంలో చెల్లించకపోవడంతో భారీగా పేరుకుపోయాయి. దీంతో వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం  ఊరట కల్పించింది. గత నెల 28న భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. దీంతో పెద్ద మొత్తంలో  వాహనదారులు చలాన్లను డిస్కౌంట్‌తో చెల్లింపులు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్ బుధవారం ముగియనుండటంతో చలాన్లు  చెల్లించేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
West Godavari Viral News: పార్శిల్‌లో డెడ్‌బాడీ-షాక్ తిన్న మహిళ- పశ్చిమగోదావరిలో ఘటన 
పార్శిల్‌లో డెడ్‌బాడీ-షాక్ తిన్న మహిళ- పశ్చిమగోదావరిలో ఘటన 
Dinga Dinga: జ్వరం వచ్చినా జలుబు చేసినా డ్యాన్స్ చేస్తారట, ఉగాండాను షేక్ చేస్తున్న డింగ డింగ వైరస్‌
జ్వరం వచ్చినా జలుబు చేసినా డ్యాన్స్ చేస్తారట, ఉగాండాను షేక్ చేస్తున్న డింగ డింగ వైరస్‌
Instant Loan Apps: అర్జంట్‌గా డబ్బులు కావాలా?, నిమిషాల్లో రుణం ఇచ్చే ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్స్‌ ఇవి, కానీ జాగ్రత్త!
అర్జంట్‌గా డబ్బులు కావాలా?, నిమిషాల్లో రుణం ఇచ్చే ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్స్‌ ఇవి, కానీ జాగ్రత్త!
Bangladesh China Frienship: బంగ్లాదేశ్‌కు అత్యాధునిక యుద్ధవిమానాలు అమ్ముతున్న చైనా - ఇండియాపై భారీ కుట్రకు సిద్ధమవుతున్న పొరుగుదేశం !?
బంగ్లాదేశ్‌కు అత్యాధునిక యుద్ధవిమానాలు అమ్ముతున్న చైనా - ఇండియాపై భారీ కుట్రకు సిద్ధమవుతున్న పొరుగుదేశం !?
Embed widget