News
News
X

TS Secretariat : తుది దశకు తెలంగాణ కొత్త సచివాలయం పనులు - ఫిబ్రవరి 17న ఓపెనింగ్‌కు ముస్తాబు !

తెలంగాణ కొత్త సచివాలయాన్ని శరవేగంగా రెడీ చేస్తున్నారు. మూడు షిఫ్టుల్లో కార్మికులు పని చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

TS Secretariat :   తెలంగాణా రాష్ట్ర కొత్త సచివాలయం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.మరో పదిహేను రోజుల్లో సచివాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు సర్వం సిద్దమైయ్యింది. అనుకున్న సమయానికే నూతన రాష్ట్రానికి చారిత్రాత్మక హంగులతో  హుస్సేన్ సాగర్ తీరాన కొత్త సచివాలయంలోకి అడుపెట్టనుంది తెలంగాణా ప్రభుత్వం. సిఎం కేసిఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17న నూతన సచివాలయం ప్రారంభోత్సవాన్ని నిర్ణయించారు.  ఆ సమయానికి దాదాపు అన్ని పనులు పూర్తి చేసేలా అధికారులు పనులను పరుగులు పెట్టిస్తున్నారు.ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో ఆకర్షణలతో నూతన సచివాలయం నిర్మాణం జరుగుతోంది. జూన్ 27వ తేది 2019న నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు.నాలుగేళ్ల వ్యవధిలోపే ప్రస్తుతం నిర్మాణం పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే ఈ సచివాలయం రూ. 610 కోట్ల రూపాయల వ్యవయంతో రూపుదిద్దుకుంటోంది.

నూతన  సచివాలయం చూడగానే నిజాం కాలం నాటి కట్టడాలు కళ్లముందు కదలాడుతాయి.డిజైన్ రూపొందిచడంలో ఇందు కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. దశాబ్దాల కాలంపాటు నిజాం నవాబుల పాలనలో హైదరాబాద్ స్టేట్ ఉంది.  ఇప్పుడున్న ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక కట్టడాలు ఆనాడు నిజాం ప్రభువులు నిర్మించినవే. అందుకే అలనాటి వైభవానికి ఏమాత్రం తీసిపోకుండా అత్యాధునిక హంగులతో కొత్త సచివాలయం రూపుదిద్దుకుంటోంది. మొత్తం 11.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన సచివాలయం నిర్మిస్తున్నారు. ఎత్తు 278 అడుగులు ఉండగా గ్రౌండ్ ఫ్లోర్ తో కలిసి మొత్తం ఏడు ఫ్లోర్లతో మొత్తం నిర్మాణం జరుగుతోంది. రూఫ్ టాప్ లో ఏర్పాటు చేయబోతున్న స్కై లాంజ్ సచివాలయానికి ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ఆహ్లదకరమైన పార్కులతో సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు పటిష్టమైన భద్రత మధ్య సచివాలయం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

నూతన సచివాలయంలో 6వ అంతస్తులో అత్యాధునిక హంగులతో సీఎం చాంబర్ ఉంటుంది. సీఎం కోసం ప్రత్యేక ద్వారం, స్పెషల్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. సచివాలయం నిర్మాణంలో మూడు  సింహాల జాతీయ చిహ్నం ప్రధాన ఆకర్షన కానుంది. భవనం పై మొత్తం 34 గుమ్మటాలు ఏర్పాటు చేసారు. భవనం ముందు,వెనుక వైపున అమర్చిన ప్రధాన గమ్మటాలపై ఈ మూడు సింహాల జాతీయ చిహ్నం ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుండి ప్రత్యేకంగా తెప్పించిన ఈ చిహ్నాలు ఒక్కొక్కటి ఐదు టన్నుల కాంస్య లోహంతో తయారు చేయించారు.అంతే కాదు సందర్శకుల కోసం ప్రత్యేక వెయిటింగ్ హాల్ ఉంటుంది. సచివాలయం ఆవరణలో మందిరం, మసీదు, చర్చిలను కూడా నిర్మిస్తున్నారు.సచివాలయ భవనంముందు విశాలంగా ఉండేలా పచ్చికబయళ్లు, ల్యాండ్‌ స్కేపింగ్‌ పనులు సమాంతరంగా జరుగుతున్నాయి. మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు  పనులు చేస్తున్నారు.

ఇప్పటికే అనుకున్న సమయంలోపు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. వాస్తవానికి ఈఏడాది జనవరి 18వ తేదిన ఈ నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని భావించినప్పటికీ ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉండటంతో సచివాలయ రంభాన్ని ఫిబ్రవరి 17కు వాయిదా వేశారు. కొత్త సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరును ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయం మరి కొద్ది రోజుల్లోనే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించేలా వైభవంగా ప్రారంభం కానుంది.

Published at : 30 Jan 2023 01:37 PM (IST) Tags: Telangana New Secretariat BRS Telangana CM KCR TS New Secretariat Secretariat worksx KCR's birthday

సంబంధిత కథనాలు

మోదీ మిత్రుల ఖజానా నింపేందుకు పెట్రోల్ ధరల పెంపు-  మంత్రి కేటీఆర్

మోదీ మిత్రుల ఖజానా నింపేందుకు పెట్రోల్ ధరల పెంపు- మంత్రి కేటీఆర్

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Sriram Shobha Yatra : హైదరాబాద్ లో ప్రారంభమైన శ్రీరామనవమి శోభయాత్ర, భారీగా బందోబస్తు

Sriram Shobha Yatra : హైదరాబాద్ లో ప్రారంభమైన శ్రీరామనవమి శోభయాత్ర, భారీగా బందోబస్తు

TSPSC Paper Leak: గ్రూప్-1 పేపర్ లీక్ వ్యవహారం - వాళ్ల పాపం, ఆమెకు శాపంగా మారింది!

TSPSC Paper Leak: గ్రూప్-1 పేపర్ లీక్ వ్యవహారం - వాళ్ల పాపం, ఆమెకు శాపంగా మారింది!

టాప్ స్టోరీస్

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?

తమిళనాడులో ‘పెరుగు’ రచ్చ - తమిళం స్థానంలో హిందీ, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ

తమిళనాడులో ‘పెరుగు’ రచ్చ - తమిళం స్థానంలో హిందీ, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు