అన్వేషించండి

Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Kaleshwaram Project: కమీషన్ల కోసమే బీఆర్‌ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. నీరు నిల్వ చేస్తే భద్రాచలం మునిగిపోతుందని ఇంజినీర్లు హెచ్చరించారని తెలిపారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి: బీఆర్ఎస్ ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి చేసింది.
  • మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు తీవ్ర లోపాలతో పనికిరావు.
  • నీటి నిల్వ ప్రమాదకరం, భద్రాచలం పరిసర గ్రామాలు మునిగిపోతాయని హెచ్చరిక.
  • ప్రాజెక్టులు అధిక కమీషన్ల కోసం మార్చి లక్షల కోట్లు వృధా.

Uttam On Kaleshwaram Project | హైదరాబాద్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేసిందని తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులను రైతుల ప్రయోజనాల కోసం కాకుండా కేవలం కమీషన్ల కోసమే నిర్మించిందని ఆరోపించారు. బ్యారేజీలలో నీళ్లు నిల్వ చేస్తే మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకుపోయి భద్రాచలం సహా చుట్టుపక్కల పలు గ్రామాలు మునిగిపోతాయని ఇంజనీర్లు చెప్పారని గుర్తుచేశారు. కేవలం మీదనే కాదు, మన పిల్లలపై సైతం అధిక వడ్డీల బారం మోపిన పాపం బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు.

ప్రాజెక్టులపై బీఆర్ఎస్ 1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా లాభం లేదు

సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో కలిసి ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల పేరిట రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్‌ చేసింది, కట్టింది, అది కూలింది కూడా బీఆర్‌ఎస్‌ హయాంలోనేనని.. లక్ష కోట్ల ప్రజాధనాన్ని నాశనం చేసి ఇప్పుడు ఆ పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ కక్కుర్తి, ప్రాజెక్టు నిర్మాణంలో చారిత్రక తప్పిదాల వల్లే నేడు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు పూర్తిగా పనికిరాకుండా పోయాయని ఆరోపించారు.

నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికల ప్రకారం ఈ 3 బ్యారేజీల్లో నీటిని అస్సలు నిల్వ చేయవద్దని నిపుణులు స్పష్టం చేశారని మంత్రి తెలిపారు. బ్యారేజీల ఫౌండేషన్‌లో తీవ్రమైన సాంకేతిక లోపాలు ఉన్నాయని, ఒకవేళ మొండిగా నీరు నిల్వ చేస్తే మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోవడమే కాకుండా, భద్రాచలం పట్టణంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలోని పలు గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయని ఇంజినీర్లు హెచ్చరించినట్లు వెల్లడించారు. ఎక్కువ ఖర్చు చూపిస్తే ఎక్కువ కమీషన్లు వస్తాయనే దురాశతోనే ఆనాడు ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చారని ఆరోపించారు.


Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Also Read: KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!

సరిగ్గా నిర్మించింటే కాళేశ్వరం వాడుకునేవాళ్లం..

ఆనాడు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై రూ.11వేల కోట్లు ఖర్చు చేశాక రీడిజైనింగ్ పేరిట మార్చారని, అలా రీడిజైన్‌ చేసిన కొత్త ప్రాజెక్టుకు రూ.1.20 లక్షల కోట్లు అవసరమని కాగ్ (CAG) ఆనాడే హెచ్చరించిన విషయాన్ని మంత్రి ఉత్తమ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. గత BRS ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును గనుక సరిగ్గా నిర్మించి ఉంటే, దానిని వినియోగించుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ ప్రస్తుతం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లు కిందకు దించే పరిస్థితి లేదని.. గేట్లు కిందకు దింపి నీరు నిల్వ చేయకుండా మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోయడం సైతం అసాధ్యమని వివరించారు.

Frequently Asked Questions

బీఆర్ఎస్ ప్రభుత్వంపై సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ప్రధాన విమర్శ ఏమిటి?

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేసిందని, ప్రాజెక్టులను కమీషన్ల కోసమే నిర్మించారని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. ప్రాజెక్టుల పేరిట రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు.

మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల ప్రస్తుత పరిస్థితి ఏమిటి?

గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ఈ మూడు బ్యారేజీలు పూర్తిగా పనికిరాకుండా పోయాయి. వాటిలో నీటిని నిల్వ చేయవద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు స్పష్టం చేశారు.

మేడిగడ్డ బ్యారేజీలో నీరు నిల్వ చేస్తే ఎదురయ్యే ప్రమాదం ఏమిటి?

బ్యారేజీ ఫౌండేషన్‌లో లోపాలు ఉండటంతో, నీరు నిల్వ చేస్తే మేడిగడ్డ కొట్టుకుపోయి భద్రాచలం సహా పలు గ్రామాలు మునిగిపోతాయని ఇంజినీర్లు హెచ్చరించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lafoot Gang Producer : 2 కోట్ల గోల్డ్ స్కామ్ - టాలీవుడ్ నిర్మాత అరెస్ట్... 14 రోజుల రిమాండ్
2 కోట్ల గోల్డ్ స్కామ్ - టాలీవుడ్ నిర్మాత అరెస్ట్... 14 రోజుల రిమాండ్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Hyderabad Crime News: మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Bhuma Akhila Priya: అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
Amaravati Mega Metropolitan Region: అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
Shubman Gill Reclaims No1 ODI Rank: వన్డేల్లో నంబర్ వన్ ను తిరిగి దక్కించుకున్న‌ గిల్.. భారీగా జంప్ చేసిన‌ వైభవ్ సూర్యవంశీ 
వన్డేల్లో నంబర్ వన్ ను తిరిగి దక్కించుకున్న‌ గిల్.. Rankingsలో భారీగా జంప్ చేసిన‌ వైభవ్ సూర్యవంశీ 
Srinivasa Mangapuram Twitter Review - శ్రీనివాస మంగాపురం ట్విట్టర్ రివ్యూ: మహేష్ అన్న కొడుక్కి మొదటి సినిమాతో ఫ్లాప్ తప్పదా?
శ్రీనివాస మంగాపురం ట్విట్టర్ రివ్యూ: మహేష్ అన్న కొడుక్కి మొదటి సినిమాతో ఫ్లాప్ తప్పదా?
Embed widget