అన్వేషించండి

KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!

తెలంగాణ ప్రభుత్వానికి చేతకాకపోతే వారం రోజులపాటు కేసీఆర్‌కు బాధ్యతలు అప్పగించాలని, అన్ని జలాశయాలను నీటితో నింపి చూపిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.

జనగామ: కాళేశ్వరం ప్రాజెక్టు నీటి నిర్వహణపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రైతాంగానికి సాగునీరు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే లక్షల క్యూసెక్కుల గోదావరి నీటిని సముద్రంలోకి వృధాగా వదిలేస్తోందని ఆయన మండిపడ్డారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద కేవలం ఒక్క పంప్ ఆన్ చేసినా నీళ్లన్నీ బ్రహ్మాండంగా పైకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆ పని చేయడం లేదని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టులను నడపడం చేతకాకపోతే.. కేవలం వారం రోజుల పాటు ప్రాజెక్టుల బాధ్యతను కేసీఆర్‌కు అప్పగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ రంగంలోకి దిగితే పంపులన్నీ ఆన్ చేసి, అన్ని జలాశయాలను నీటితో నింపి, రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి నీళ్లు అందించి చూపిస్తామని కేటీఆర్ సవాల్ విసిరారు. కన్నెపల్లి వద్ద వృధాగా పోతున్న జలాలను పరిశీలించడానికి వెళ్తున్న తమను పోలీసులు జనగామ వద్దే అక్రమంగా అడ్డుకున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తమను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీస్తే.. ఉన్నతాధికారుల నుండి, పైనుండి ఆదేశాలు ఉన్నాయంటూ పోలీసులు సమాధానం ఇస్తున్నారని కేటీఆర్ చెప్పారు.

ప్రభుత్వం తన వైఫల్యాలు మరియు దొంగతనం బయటపడుతుందనే భయంతోనే పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాళేశ్వరంలో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్తున్న కేటీఆర్ కు స్టేషన్ ఘనపూర్ వద్ద ఘన స్వాగతం లభించింది. పూలు చల్లుతూ, టపాసులు పేలుస్తూ స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు.. సీఎం సీఎం అనే నినాదాలతో హోరెత్తించారు. 


KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్ హౌస్ పర్యటనకు బయలుదేరిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్‌ను పోలీసులు జనగామ జిల్లా పెంబర్తి, కొమల్ల చెక్‌పోస్ట్, టోల్‌గేట్ వద్ద బారికేడ్లు, లారీలు అడ్డుపెట్టి వరుసగా నిలిపివేశారు. ఈ సందర్భంగా పోలీసులతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, బీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్ర వాగ్వాదానికి దిగి కాన్వాయ్‌ను ముందుకు పంపారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో వరంగల్, జనగామ జిల్లాల్లో పలువురు నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.

Also Read: KTR News: కన్నెపల్లి పంప్‌హౌస్‌ పర్యటనకు కేటీఆర్‌.. లారీలు అడ్డుపెట్టిన పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదం

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గోదావరిలో 93.5 మీటర్ల మేర నీరున్నందున మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి మోటర్లు ఆన్ చేసి జలాశయాలు నింపవచ్చని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వృథాగా వదిలేస్తూ రైతులను ఎండబెడుతోందని మండిపడ్డారు. నీళ్లిస్తే యూరియా, బోనస్, మద్దతు ధర ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే రేవంత్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టి తమను నిరోధిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి చేరుకుని వృథా జలాలను రైతులకు చూపిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Medaram Latest News: మేడారం వనదేవతల గద్దెల వద్ద జువ్వి చెట్టు పునఃదర్శనం!
మేడారం వనదేవతల గద్దెల వద్ద జువ్వి చెట్టు పునఃదర్శనం!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Embed widget