అన్వేషించండి

KTR News: కన్నెపల్లి పంప్‌హౌస్‌ పర్యటనకు కేటీఆర్‌.. లారీలు అడ్డుపెట్టిన పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదం

Kannepally Pump House | కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనకు వెళ్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • లక్ష్మీ పంప్‌హౌస్ వెళ్లే కేటీఆర్ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
  • కన్నెపల్లి వద్ద లక్ష క్యూసెక్కులు గోదావరి జలాలు వృథాగా పోతున్నాయి.
  • ప్రభుత్వం అడ్డుకోవటం వృథా జలాలను దాచడానికేనని కేటీఆర్ ఆరోపించారు.

జనగామ/వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గల మహదేవ్‌పూర్ మండలం కన్నెపల్లి వద్ద ఉన్న లక్ష్మీ పంప్ హౌస్ పర్యటనకు వెళ్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్ ని జనగామ జిల్లా పెంబర్తి వద్ద బారీకేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. కన్నెపల్లి వద్ద ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా లక్ష క్యూసెక్కుల గోదావరి నీరు కిందకు సముద్రంలోకి వృధాగా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కింద నీరు వృధాగా పోతుంటే, పైన ఉన్న మిడ్ మానేరుతో సహా కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రతి రిజర్వాయర్ నీళ్లు లేక నోరెళ్లబెట్టి చూస్తోందని అన్నారు. నీటి లభ్యత లేక తెలంగాణవ్యాప్తంగా రైతులు కనీసం నాట్లు వేసే పరిస్థితి కూడా లేదని, పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు.

జనగాం జిల్లా కొమల్ల చెక్ పోస్ట్ వద్ద లారీలు అడ్డం పెట్టి మరోసారి కేటీఆర్ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలోకి పోతుందని, నీళ్లను రైతుకు సాగుకోసం అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.  జనగామ టోల్ గేట్ వద్ద అడ్డుకున్న పోలీసులతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. భారీగా మోహరించి పోలీసులు అడ్డంకులు సృష్టించినా... తీవ్ర వాగ్వాదానికి దిగి కేటీఆర్ కాన్వాయ్‌ను ముందుకు పంపించారు. ప్రతిచోటా బీఆర్ఎస్ నేతలు భారీగా తరలివచ్చి కేటీఆర్ కాన్వాయ్ కి దారివ్వాలని పోలీసులతో గొడవకు దిగుతున్నారు. కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన నేపథ్యంలో జనగాం, వరంగల్ జిల్లాల వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.

KTR News: కన్నెపల్లి పంప్‌హౌస్‌ పర్యటనకు కేటీఆర్‌.. లారీలు అడ్డుపెట్టిన పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదం

Also Read: MLC Shambhipur Raju: కేటీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు తీవ్ర గాయాలు.. కిమ్స్ ఆసుపత్రికి తరలింపు!

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల సీనియర్ నేతలతో కూడిన బృందం హైదరాబాద్ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలనకు బయలుదేరింది. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకుని వృధాగా పోతున్న జలాలను పరిశీలించి, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య మీడియా సమావేశం నిర్వహించాలని బీఆర్‌ఎస్ భావించింది. అయితే, ఈ పర్యటనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నించడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ వద్ద తమ వాహనాలను అడ్డుకోవడంపై మండిపడ్డారు.

మేడిగడ్డ బ్యారేజీ గేట్లతో సంబంధం లేకుండా, 93.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే చాలు.. కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేసి తెలంగాణ మొత్తాన్ని సస్యశ్యామలం చేసేలా కేసీఆర్ ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ, ఒకవేళ నీళ్లిస్తే యూరియా ఇవ్వాలని, పంటను మద్దతు ధరతో కొనాలని, బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతో చేతగాని సీఎం రేవంత్ రెడ్డి రైతులను కావాలనే ఎండబెడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న ఈ దొంగతనం బయటపడుతుందనే భయంతోనే రేవంత్ రెడ్డి సూచనల మేరకు పోలీసులు తమను అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకుని తీరుతామని, వృధా జలాలను రైతులకు, రాష్ట్ర ప్రజలకు చూపిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

Frequently Asked Questions

కేటీఆర్ కాన్వాయ్‌ను ఎక్కడ, ఎందుకు అడ్డుకున్నారు?

జనగామ జిల్లా పెంబర్తి వద్ద పోలీసులు బారీకేడ్లు పెట్టి అడ్డుకున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనకు వెళ్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు అడ్డుకున్నారని కేటీఆర్ ఆరోపించారు.

కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ ను ఎందుకు సందర్శించాలనుకున్నారు?

కన్నెపల్లి వద్ద లక్ష క్యూసెక్కుల గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతుండగా, కాళేశ్వరం రిజర్వాయర్లు నీరు లేక ఖాళీగా ఉన్నాయని పరిశీలించేందుకు. రైతులు నీటి లభ్యత లేక పంటలు పండించలేకపోతున్నారని ఆయన అన్నారు.

ప్రస్తుత ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన ప్రధాన ఆరోపణలు ఏమిటి?

పంటలు పండితే యూరియా, మద్దతు ధర, బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతో ముఖ్యమంత్రి కావాలనే రైతులను ఎండబెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న ఈ దొంగతనం బయటపడుతుందనే భయంతోనే తమను అడ్డుకుంటున్నారని అన్నారు.

కన్నెపల్లి పంప్ హౌస్ గురించి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా డిజైన్ చేశారని కేటీఆర్ గుర్తు చేశారు?

మేడిగడ్డ బ్యారేజీ గేట్లతో సంబంధం లేకుండా, 93.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే చాలు కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేసి తెలంగాణ మొత్తాన్ని సస్యశ్యామలం చేసేలా కేసీఆర్ ప్రాజెక్టును డిజైన్ చేశారని కేటీఆర్ గుర్తుచేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget