Mohammed Siraj: మహ్మద్ సిరాజ్ ఇంటి స్థలానికి ఉత్తర్వులు - ఎక్కడ కేటాయించారో తెలుసా?
Telangana News: గత జూన్ లో క్రికెటర్ మహ్మద్ సిరాజ్ హైదరాబాద్ చేరుకుని మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. అప్పుడే ఆయనకు సీఎం ఇంటి స్థలాన్ని ప్రకటించారు.
Telangana Latest News: భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలాన్ని కేటాయించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. టీ 20 వరల్డ్ కప్ సాధించిన భారత్ క్రికెట్ జట్టులో ఆటగాడిగా ఉన్న మహ్మద్ సిరాజ్‌కు అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి స్థలం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఇంటి స్థలం కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జూబ్లీహిల్స్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని సిరాజ్‌కు కేటాయించింది.
జూన్ నెలలో టీ 20 ప్రపంచకప్ గెల్చిన తర్వాత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ హైదరాబాద్ చేరుకుని మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనకు టీమ్ ఇండియా జెర్సీని కూడా బహూకరించారు. రేవంత్ రెడ్డి సిరాజ్‌ను అభినందించి.. హైదరాబాద్‌లో ఇంటి స్థలం, గవర్నమెంట్ జాబ్ కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా జీవో జారీ అయ్యింది.సిరాజ్‌కు గవర్నమెంట్ జాబ్ ఇచ్చేందుకు కూడా గత కేబినెట్ సమావేశంలో అమోద ముద్ర వేశారు.