అన్వేషించండి

Mallareddy News : ఇదంతా వాళ్ల పనే- భూకబ్జా కేసుపై మాజీ మంత్రి మల్లారెడ్డి రియాక్షన్

Mallareddy Comments On Encroachment Case: భూకబ్జాల ఆరోపణలపై మాజీ మంత్రి,  ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. భూకబ్జాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు.

Chamakura Malla Reddy Land Encroachment Issue : భూకబ్జాల ఆరోపణలపై మాజీ మంత్రి,  ఎమ్మెల్యే మల్లారెడ్డి (Chamakura Malla Reddy) స్పందించారు. భూకబ్జాలు (Land Occupation ) చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. భూకబ్జా చేసినట్లు తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వ కక్ష సాధింపు చర్య ఉన్నట్లు భావించడం లేదన్నారు. గిరిజనుల 47 ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కొంతమంది మధ్యవర్తులు కొనుగోలు, అమ్మకాల్లో ఉన్నారని తెలిపారు. గిరిజనుల భూమిని వారే కబ్జా చేసి ఉంటారని ఆరోపించారు. 

మల్లారెడ్డి, అనుచరులపై భూకబ్జా కేసులు
మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై బుధవారం కేసు నమోదు అయ్యింది. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు మేరకు శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరులు తొమ్మిది మందిపై కేసులు పెట్టారు. మేడ్చల్ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలో లంబాడీలకు చెందిన సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుంటల ఉంది. వారి  వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి, కుట్రతో మోసగించి భూమిని కాజేశారు. దీనికి సంబంధించి శామీర్‌పేట పోలీస్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది.  మొత్తం 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు తెలిపారు. లంబాడీల వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి కాజేశారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు మాజీ మంత్రి, అతని అనుచరులు, మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ శామీర్‌పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ 420 చీటీంగ్ కేసు నమోదు చేశారు. 

250 కోట్ల భూమి లాక్కున్నారు
మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుంటల భూమి, తమ పెద్దల నుంచి వారసత్వ హక్కుగా వచ్చిందన్నారు కేతావత్ బిక్షపతి నాయక్. తమ కుటుంబ సభ్యులైన ఆరుగురి పేరు మీద మొత్తం భూమి ఉందని తెలిపాడు. ఈ భూమిపై కన్నేసిన స్థానిక ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ భూమిని ఎలాగైనా కాజేయాలని కుట్రతో తన అనుచరులతో కలిసి కుట్రకు పాల్పడ్డారని వాపోయారు. తమకు మాయ మాటలు చెప్పి నమ్మించి ఏడుగురితో 250 కోట్ల విలువ చేసే భూమిని పిటి సరెండర్ చేయించారని ఫిర్యాదులో తెలిపారు. తమ భూమిపై మేము హక్కులు కోల్పోయేలా చేసి...ఏడుగురికి ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున డబ్బు ఇచ్చి భూమి లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

రిజిస్ట్రేషన్ చేయలేదన్న తహసీల్దార్
కేశవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌లు 33,34,35లలో 40 ఎకరాల భూమిలో పిటి దారులమంటూ...పది మంది హైకోర్టు ఉత్తర్వులతో దరఖాస్తు చేసుకున్నారని తహసీల్దార్ వాణిరెడ్డితెలిపారు. వారికి నోటీసులు ఇచ్చి పిలిపించి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నామని, ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. ఈ సర్వే నెంబర్లలో గత 2019లో 7 ఎకరాల 18 గుంటల భూమిని పిటి సరెండర్ చేసి ప్రొసీడింగ్ ఇచ్చారని వెల్లడించారు. 

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy America Tour Cancelled: తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 
తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Embed widget