GHMC Voters List: గ్రేటర్ హైదరాబాద్ లో తుది ఓటర్ల జాబితా విడుదల, కేటగిరీల వారీగా ఓటర్ల వివరాలిలా
Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్ల జాబితా విడుదల చేశారు.
GHMC Voters List released: హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తుది ఓటర్ల జాబితా (GHMC Voters List) విడుదలైంది. గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉండగా.. ఇక్కడ మొత్తం 45,36,852 మంది (43 లక్షల 36 వేల 8 వందల 52 మంది) ఓటర్లు ఉన్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. తాజా ఓటర్ల జాబితాలో 77,522 మంది (77 వేల 5 వందల 22 మంది) కొత్త ఓటర్లు ఉన్నారని అధికారులు వెల్లడించారు.
ఎన్నికల అధికారులు వెల్లడించిన తుది జాబితా ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఓటర్లలో పురుష ఓటర్లు 23,22,623 మంది ఉండగా, మహిళా ఓటర్లు 22,13,902 మంది ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు 20,207 మంది, ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 883 మంది, సర్వీస్ ఓటర్లు 404, ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 327 మంది, 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 80,037 మంది ఉన్నారు. నవంబర్ 10న నామినేషన్ల దరఖాస్తులకు గడువు ముగియగా, నామినేషన్ ఉపసంహరణకు తుది గడువు 15వ తేదీతో ముగుస్తుంది.
జీహెచ్ఎంసీ తుది ఓటర్ల జాబితా ఇలా..
పురుష ఓటర్లు - 23,22,623 మంది
మహిళా ఓటర్లు - 22,13,902 మంది
80 ఏళ్లు పైబడిన ఓటర్లు - 80,037
దివ్యాంగ ఓటర్లు - 20,207 మంది
ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు - 883 మంది
సర్వీస్ ఓటర్లు - 404 మంది
ట్రాన్స్‌జెండర్ ఓటర్లు - 327 మంది
Also Read: Telangana Elections 2023 : త్వరలో ఎస్సీ వర్గీకరణకు కమిటీ - మాదిగ విశ్వరూప సభలో ప్రధాని హామీ !