అన్వేషించండి

Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 

Semaglutide:సరైన వైద్య పర్యవేక్షణ లేని పక్షంలో సెమాగ్లుటైడ్‌ వాడకం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని డీసీఏ హెచ్చరించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బరువు తగ్గడానికి, మధుమేహం నియంత్రణకు సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ హెచ్చరికలు జారీచేసింది.
  • వైద్యుల పర్యవేక్షణ లేకుండా వాడితే ప్రాణాపాయం, తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
  • లైసెన్స్డ్ షాపుల నుంచే కొనుగోలు చేయాలి, ఆన్లైన్ కొనుగోళ్లు వద్దు.
  • తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అక్రమ అమ్మకాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.

Semaglutide:బరువు తగ్గడం కోసం, మధుమేహ నియంత్రణ కోసం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందుతున్న సెమాగ్లుటైడ్‌ మెడిసిన్ వాడకంపై తెలంగాణ రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సరైన వైద్య పర్యవేక్షణ లేకుండా, సొంత నిర్ణయాలతో ఈ మందులను వాడటం వల్ల ప్రాణాపాయం జరిగే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల ఈ ఔషధాలకు సంబంధించిన పేటెంట్‌ గడువు ముగియడంతో మార్కెట్‌లోకి అనేక రకాల కొత్త ఫార్ములేషన్లు అందుబాటులోకి వస్తున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరింది. 

ఏంటీ సెమాగ్లుటైడ్‌? ఎందుకు ఇంత డిమాండ్?

సెమాగ్లుటైడ్‌ అనేది గ్లూకాగాన్-లైక్‌ పెప్టెడ్‌-1 రిసెప్టర్‌ అగోనిస్ట్స్‌ అనే తరగతికి చెందిన ఔషధం. ఇది శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంతోపాటు, ఆకలిని తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా టైప్ -2 డయాబెటిస్‌ బాధితులకు ఇది ఒక వరప్రసాదంగా మారింది.  అయితే ఇటీవల కాలంలో కేవలం బరువు తగ్గడం కోసమే దీనిని వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. 

గత వారమే ఈ ఔషధాల అసలు ఆవిష్కర్త పేటెంట్‌ గడువు ముగిసింది. దీని వల్ల వివిధ కంపెనీలు మల్టీ డోస్‌ వయల్స్‌, ప్రీ- ఫీల్డ్‌ పెన్స్‌ రూపంలో సెమాగ్లుటైడ్‌ ఫార్ములేషన్లు మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. మార్కెట్‌లోకి కొత్తగా వస్తున్న ఈ మందులపై ప్రజలకు అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ విక్రయాలు జరిగే అవకాశం ఉందని DCA గుర్తించింది. 

వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి 

తెలంగాణ డీసీఏ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సెమాగ్లుటైడ్‌ కేవలం రిజిస్టర్‌ మెడికల్ ప్రాక్టీషనర్ల పర్యవేక్షణలో వాడాలి. ఎండోక్రినాలజిస్టులు, ఇంటర్నల్‌ మెడిసిన్ స్పెషలిస్టులు మాత్రమే ఈ మందులను ప్రిస్క్రైబ్ చేయాలి. గుండె సంబంధిత సమస్యలు ఉండి, ఆమోదించే సంకేతాలు ఉన్న సందర్భాల్లో మాత్రమే కార్డియాలజిస్టులు దీనిని సూచించవచ్చు. 

రోగికి ఈ మందును సూచించే ముందు వారి ఆరోగ్య చరిత్ర, ఇప్పటికే ఉన్న ఇతర వ్యాధులు, ఎదురయ్యే ముప్పును వైద్యులు నిశితంగా పరిశీలించారు. సరైన మోతాదు, ఎంత కాలం వాడాలి అనే విషయాలను నిపుణులైన డాక్టర్లు మాత్రమే నిర్ణయించాల్సి ఉంటుంది. 

అజాగ్రత్తా వాడితే పొంచి ఉన్న సమస్యలు 

సరైన వైద్య పర్యవేక్షణ లేని పక్షంలో సెమాగ్లుటైడ్‌ వాడకం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని డీసీఏ హెచ్చరించింది. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్‌ అంటే క్లోమగ్రంథి వాస్తుంది. మూత్రపిండాలు ఒక్కసారిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, ఇతర తీవ్రమైన ప్రతి చర్యలు ఉంటాయి. గాల్‌ బ్లాడర్‌లో రాళ్లు రావడం, ఇతర సమస్యలు రావచ్చు. 

కొనుగోలు విషయంలో జాగ్రత్తలు 

ప్రజలు సెమాగ్లుటైడ్‌ మెడిసిన్‌ను కేవలం లైసెన్స్ ఉన్న మెడికల్ షాపులో నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు, అనధికారక విక్రేతల వద్ద, ఇతర చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా వీటిని ఆర్డర్ చేయొద్దు. ఇలాంటి మార్గాల్లో లభించే మందులు నకిలీవి, నాణ్యత లేనివి, హాని చేసేవి అయ్యి ఉంటాయని హెచ్చరించింది. 

తయారీదారులకు హెచ్చరిక 

మందుల తయారీ కంపెనీలకు కూడా ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. సెమాగ్లుటైడ్‌ వాడకాన్ని ప్రోత్సహించేలా ఎటువంటి పరోక్ష ప్రకటనలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా లేదా అన్‌ అప్ప్రూవ్డ్‌ వాడకాన్ని ప్రోత్సహించేలా ప్రమోషన్లు చేస్తే చర్యలు తప్పవని చెప్పింది. ఒక వేళ ఎక్కడైనా ఈ మందులను అక్రమంగా విక్రయిస్తున్నట్టు తెలిసినా, అనధికారికంగా ప్రచారం చేస్తున్నట్టు గమనించినా వెంటనే తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలను కోరారు. 

Frequently Asked Questions

సెమాగ్లుటైడ్‌ మందును ఎవరు ప్రిస్క్రైబ్ చేయాలి?

సెమాగ్లుటైడ్‌ను రిజిస్టర్‌ మెడికల్ ప్రాక్టీషనర్లు, ఎండోక్రినాలజిస్టులు, ఇంటర్నల్‌ మెడిసిన్ స్పెషలిస్టులు మాత్రమే ప్రిస్క్రైబ్ చేయాలి. గుండె సమస్యలు ఉన్నవారికి కార్డియాలజిస్టులు సూచించవచ్చు.

వైద్య పర్యవేక్షణ లేకుండా సెమాగ్లుటైడ్‌ వాడితే వచ్చే సమస్యలు ఏమిటి?

వైద్య పర్యవేక్షణ లేకుండా వాడితే క్లోమగ్రంథి వాపు (అక్యూట్ ప్యాంక్రియాటైటిస్), మూత్రపిండాలు దెబ్బతినడం, తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి.

సెమాగ్లుటైడ్‌ మందును ఎక్కడ కొనుగోలు చేయాలి?

సెమాగ్లుటైడ్‌ను లైసెన్స్ ఉన్న మెడికల్ షాపుల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. ఆన్‌లైన్‌ లేదా అనధికార విక్రేతల వద్ద కొనవద్దు.

సెమాగ్లుటైడ్‌ మందు ఎందుకు ఇంత డిమాండ్ లో ఉంది?

ఈ మందు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంతో పాటు, ఆకలిని తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా టైప్ -2 డయాబెటిస్‌ బాధితులకు, బరువు తగ్గాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Breaking News:ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు- 16న ఏపీ జేఏసీ అత్యవసర భేటీ 
ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు- 16న ఏపీ జేఏసీ అత్యవసర భేటీ 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Embed widget