నేడు నామినేషన్లు వేయనున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు మహేశ్‌కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నేడు నామినేషన్లు వేయనున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌లను అభ్యర్థులుగా నిర్ణయించింది.
MLC Candidates Nominations : కాంగ్రెస్ (Congress) పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నేడు నామినేషన్లు వేయనున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud ), ఎన్‌ఎస్‌యూఐ (Nsui) రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ (Balmuri Venkat)లను అభ్యర్థులుగా నిర్ణయించింది. దీంతో మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్...ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అతి చిన్న వయస్సులో బల్మూరి వెంకట్ పెద్దల సభలోకి అడుగుపెట్టనున్నారు.
ఎన్నిక లాంఛనమే
ప్రస్తుతం ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ పదవులకు నవంబరు 30 2027 వరకు గడువు ఉంది. రెండింటికి విడివిడిగా ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. శాసనసభలో అత్యధిక బలం ఉన్న కాంగ్రెస్ పార్టీకే రెండు ఎమ్మెల్సీ పదవులు దక్కనున్నాయి. పార్టీ నిర్ణయించిన మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్‌ల ఎన్నిక లాంఛనం కానుంది. ముందుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌ను ఎంపిక చేసినట్టు వార్తలొచ్చాయి. చివరి నిమిషాల్లో అద్దంకి దయాకర్ స్థానంలో మహేశ్‌కుమార్ గౌడ్ పేరును తీసుకొచ్చింది హస్తం పార్టీ. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటించింది.