Revanth Reddy: బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం- గవర్నర్‌గా కేసీఆర్- కవితకు బెయిల్- రేవంత్ హాట్ కామెంట్స్
Telangana: కేటీఆర్ కేంద్రమంత్రి అవుతారని, కేసీఆర్ గవర్నర్ కాబోతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు చూస్తారని చెప్పారు.
BJP BRS Merger News: రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతాయని అన్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుకూ కీలక వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అవుతుందని నొక్కి మరీ చెప్పారు. అనంతరం జరిగే పరిణామాలను వివరించారు.
బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం తర్వాత కేసీఆర్‌ను గవర్నర్‌గా పంపిస్తారని రేవంత్ చెప్పుకొచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న కవిత అప్పుడు బెయిల్ వస్తుందని తెలిపారు. కేటీఆర్‌కు కేంద్రమంత్రి పదవి వస్తుందని, తెలంగాణలో హరీష్‌రావు ప్రతిపక్ష నేతగా ఉంటారని అన్నారు. ఉన్న నలుగురు రాజ్యసభల ఎంపీలు కూడా బీజేపీలో చేరిపోతారని అన్నారు. అనంతరం కవితకు బెయిల్ వస్తుందని ఆమెను కూడా రాజ్యసభకు పంపిస్తారని చెప్పుకొచ్చారు.
తప్పుడు ప్రచారం చేయొద్దని కేటీఆర్ సూచన
బీఆర్‌ఎస్, బీజేపీ విలీనం వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో దీనిపై తెగ చర్చించుకుంటున్నారు. అందుకే పది రోజుల క్రితం ఇలాంటి వాటిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. మొదటి నుంచి తెలంగాణ కోసం, ప్రజల కోసం కొట్లాడిన ఏకైక పార్టీ బీఆర్‌ఎస్ మాత్రమే నని అన్నారు. భవిష్యత్‌లో కూడా బీఆర్‌ఎస్ అలానే కొట్లాడుతుందన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని్ చెప్పుకొచ్చారు. దీనిపై తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంటాని హెచ్చారించారు.
ముఖ్యమంత్రి నోటి వెంట విలీనం మాట
కేటీఆర్ ఇచ్చిన క్లారిటీతో విలీనం చర్చకు పుల్‌స్టాఫ్ పడింది. అయితే ఇప్పుడు మరోసారి రేవంత్ రెడ్డి బిగ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో మరోసారి చర్చకు తెరలేచింది. ఇంత వరకు చిన్నాచితకా నేతలో ఇతర వ్యక్తులో కామెంట్స్ చేస్తూ వచ్చారు.అయితే ఇప్పుడు ఏకంగా సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ చర్చ మొదలైంది. దీనిపై బీఆర్‌ఎస్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి