అన్వేషించండి

TS Cabinet: హైదరాబాద్‌కు వరాలు, భారీ ప్రాజెక్టుల ప్రకటన - కేబినెట్ ఆమోదించినవి ఇవే

హైదరాబాద్ నగరంలో చేపట్టాలని తలపెట్టిన కొత్త ప్రాజెక్టుల వివరాలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వివరించారు.

హైదరాబాద్ భవిష్యత్తు అవసరాల నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రజా రవాణాను మరింత సులువు చేయడానికి నగరంలో చేపట్టాలని తలపెట్టిన కొత్త ప్రాజెక్టుల వివరాలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ మెట్రోను వివిధ ప్రాంతాలకు విస్తరిస్తామని వివరించారు. కొన్ని మార్గాల్లో కింది నుంచి రోడ్డు, పై నుంచి మెట్రో రైలు వెళ్లేలా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లను నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ లో ప్రజా రవాణా దేశంలోనే అత్యంత మెరుగ్గా ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నామని కేటీఆర్ వివరించారు.

మెట్రో విస్తరణ ఇలా..
మెట్రో విస్తరణలో భాగంగా మియాపూర్ - ఎల్బీ నగర్ మార్గంలో ఇటు ఇస్నాపూర్ వరకూ, అటు పెద్ద అంబర్ పేట్ వరకూ (విజయవాడ మార్గంలో) మెట్రో మార్గాన్ని విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.  నిజామాబాద్ మార్గంలో జేబీఎస్ నుంచి కండ్లకోయ (ఓఆర్ఆర్) వరకూ విస్తరిస్తామని వివరించారు. 

ఇప్పటికే రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకూ పనులకు శంకుస్థాపన జరిగిందని, అక్కడి నుంచి కొత్తూరు మీదుగా షాద్ నగర్ వరకూ మెట్రో మార్గాన్ని విస్తరిస్తామని చెప్పారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కందుకూరు వరకూ మెట్రోను పొడిగిస్తామని వివరించారు. ఇటు వరంగల్ మార్గంలో తార్నాక నుంచి యాదాద్రి జిల్లా బీబీ నగర్ వరకూ, ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ వరకూ మెట్రో లైనును పొడిగిస్తామని వివరించారు. 

రూ.60 వేల కోట్లతో
ఈ మొత్తం పొడిగింపులు అన్నీ రూ.60 వేల కోట్లతో చేపడతామని మంత్రి కేటీఆర్ వివరించారు. ఇంతకుముందు నిర్ణయించిన 101 కిలో మీటర్లకు అదనంగా ఈ కొత్త మెట్రో రైలు పొడిగింపులు ఉంటాయని చెప్పారు. రాబోయే మూడు లేదా నాలుగు ఏళ్లలో ఇవి పూర్తి చేయాలని, సమగ్ర ప్రాజెక్టు నివేదికలను తయారు చేయాలని మున్సిపల్ శాఖను కేసీఆర్ ఆదేశించినట్లుగా మంత్రి కేటీఆర్ తెలిపారు. 

డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు
జేబీఎస్ నుంచి తూంకుంట వరకూ ఒక డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ (ఒక లెవెల్ లో వాహనాలు వెళ్లేలా, మరో లెవెల్ లో మెట్రో రైలు వెళ్లేలా) ఏర్పాటు చేయడానికి కేబినెట్ నిర్ణయించింది. పాతబస్తీలో మెట్రో కూడా పూర్తి చేస్తామని వివరించారు. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో వ్యవస్థను కూడా నిర్మిస్తామని వివరించారు.

పాట్నీ నుంచి కండ్లకోయ వరకూ మరో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించినట్లుగా కేటీఆర్ చెప్పారు. ఈ మార్గంలో కంటోన్మెంట్ ఏరియాలో భూములు కూడా సేకరించాల్సి ఉన్నందున ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లుగా వివరించారు.

2024 తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే

ఈ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుందని ఆశిస్తున్నట్లుగా కేటీఆర్ చెప్పారు. అన్ని నగరాల్లో మెట్రో పొడిగింపులకు కేంద్రం సహకరించినట్లుగానే తమకు సాయం చేస్తుందని అనుకుంటున్నట్లుగా చెప్పారు. ఒకవేళ కేంద్రం సాయం చేయకపోయినా తాము ఆ పనులన్నీ పూర్తి చేస్తామని అన్నారు. ‘‘2024 ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎలాగూ సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది కాబట్టి, అందులో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుంది. అప్పుడు రాష్ట్రానికి కావాల్సిన సహకారం అందుతుంది’’ అని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget