అన్వేషించండి

Harish Rao: బీజేపీ ఆ విషయాల్లో డబుల్ సక్సెస్ - అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు సెటైర్లు

అంతా ధోఖాల కేంద్ర ప్రభుత్వం అంటూ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ సాక్షిగా మంత్రి హరీష్ రావు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

అంతా ధోఖాల కేంద్ర ప్రభుత్వం అంటూ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ సాక్షిగా మంత్రి హరీష్ రావు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు – ధోఖా, అర్హులైన వారందరికీ ఇండ్లు – ధోఖా, రైతుల ఆదాయం రెట్టింపు – ధోఖా, పటిష్టమైన లోక్ పాల్ బిల్లు – ధోఖా, నదుల అనుసంధానం – ధోఖాలు తప్ప బీజేపీ చేసిందేమీ లేదంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. నల్ల చట్టాలను వ్యతిరేకించినందున దేశ వ్యాప్తంగా రైతులపై కేంద్ర ప్రభుత్వం కక్ష గట్టిందన్నారు. అలాంటి మీరా మాకు నీతులు చెప్పేది అంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

రైతులకు సంబంధించిన పథకాలు తెలంగాణ తీసుకొచ్చి సక్సెస్ అవుతుంటే, కేంద్రం మాత్రం అన్నదాతలను అడుగడుగున అడ్డుకుని, వారికి రావాల్సిన నిధుల్లో కోత పెడుతున్నారని హరీష్ రావు విమర్శించారు.  నల్ల చట్టాలతో 750 మంది రైతుల ఉసురు పోసుకున్న ప్రభుత్వం కేంద్రంలోని మోదీ సర్కార్ అన్నారు.

బీజేపీ కొన్ని విషయాల్లో సక్సెస్ సాధించిందని, ఎందులో సక్సెస్ అంటే.. జీడీపీని మంటగలపడంలో – సక్సెస్, ఫుడ్ సెక్యూరిటీని నాశనం చేయడంలో – సక్సెస్, 160 లక్షల కోట్ల అప్పులు చేయడంలో – బీజేపీ సక్సెస్, సెస్సుల రూపంలో అడ్డగోలుగా పన్నులు వేయడంలో – సక్సెస్, ఆకాశాన్ని తాకేట్టు సిలిండర్ ధర పెంచడంలో – సక్సెస్, పసిపిల్లలు తాగే పాల మీద కూడా జీఎస్టీ విధించడంలో – సక్సెస్ అయిందంటూ కేంద్ర ప్రభుత్వంపై వంగ్యాస్త్రాలు సంధించారు మంత్రి హరీష్ రావు. 

వాటితో పాటు ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టడంలో – బీజేపీ సక్సెస్, ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ దాడులు చేయించడంలో – సక్సెస్, రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను కాలరాయడంలో – సక్సెస్, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడంలో – సక్సెస్, ఆదానీ ఆస్తులు పెంచడంలో – సక్సెస్, రొటేషన్ లో వచ్చే G-20 ప్రెసిడెంట్ షిప్ ను తమ ఘనతగా చెప్పుకోవడంలో - సక్సెస్, మతపిచ్చి మంటలు రేపడంలో బీజేపీ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డబుల్ సక్సెస్ అయిందని అసెంబ్లీలో హరీష్ రావు సెటైర్లు వేశారు.

బీజేపీది అంత్యోతయ సిద్ధాంతం కాదు, అదానీ సిద్ధాంతం..
బీజేపీ సాధించిన ప్రమాణాలలో కొన్ని లో గ్రేడ్ ఉంటే కొన్ని హై గ్రేడ్ ఉంటాయన్నారు. రూపాయి విలువ లో, ఆర్థికాభివృద్ధి లో, మానవాభివృద్ధి సూచికలో లో, ఉద్యోగాల కల్పనలో లో, శాంతిసామరస్యాలు లో అన్నారు. హై గ్రేడ్ ఏంటంటే.. పెట్రోల్ డీజిల్ ధరలు హై, అవినీతి హై, పేదరికం హై, ద్రవ్యోల్భణం హై, నిత్యావసర వస్తువుల ధరలు హై, ఆకలి సూచీ హై, నిరుద్యోగ సూచీ హై, అశాంతి అలజడలు హై.. ఇదీ బీజేపీ సాధించిన విజయాలు అని విమర్శలు గుప్పించారు. బీజేపీ నేడు అంత్యోదయ సిద్ధాంతానికి నీళ్లొదిలి అదానీ సిద్ధాంతాన్ని అమలు చేస్తుందన్నారు. అంత్యోదయ సిద్ధాంతం అంటే చిట్ట చివరి వ్యక్తికి సైతం సంక్షేమ ఫలాలు అందించడం. కానీ బీజేపీ పాలన చూస్తే కార్పొరేట్ వాళ్లకే సంక్షేమం, అన్ని అందిస్తున్నారు. ఆఖరికి పారాసిటమల్ టాబ్లెట్ పై కూడా ధరలు పెంచిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదన్నారు. చర్మ వ్యాధికో, చిన్న చిన్న మెడిసిన్, కామన్ మ్యాన్ వాడే మెడిసిన్లపై ధరలు దారుణంగా పెంచారని హరీష్ రావు విమర్శించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Embed widget