By: ABP Desam | Updated at : 12 Feb 2023 11:17 PM (IST)
సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ ప్రశ్నల వర్షం
తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలి?... రూ.5 లక్షల కోట్ల అప్పు చేసినందుకా? కేంద్రం 2.4 లక్షల ఇండ్లు ఇచ్చినా కట్టనందుకు ఓటేయాలా? దళిత బంధుతో దళితులను మోసం చేసినందుకా? కేటాయించిన నిధుల్లో సగం కూడా ఖర్చు చేయనందుకు ఓటేయాలా? అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. గిరిజన, బీసీలను మోసం చేసినందుకు ఓటేయాలా? ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు ఓటేయాలా? మైనర్ బాలికలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నందుకు ఓటేయాలా? పోడు భూములను పరిష్కరించకుండా బాలింతలని చూడకుండా జైలుకు పంపినందుకు ఓటేయాలా - ఇంటికో ఉద్యోగం ఇవ్వనందుకు ఓటేయాలా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
పక్క రాష్ట్రం నీళ్లు దోచుకుపోతుంటే వాళ్లతో మిలాఖత్ అయినందుకు ఓటేయాలా? ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వనందుకు ఓటేయాలా? రైతుల, నిరుద్యోగుల, ఇంటర్మీడియట్ విద్యార్థుల, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నందుకు ఓటేయాలా? కరోనా వస్తే పారాసెట్మాల్ వేసుకోమన్నందుకు ఓటేయాలా? నీ ఖేల్ ఖతం దుకాణం బంద్ కాబోతోంది. బీజేపీకి ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. బీజేపీకే ప్రజలు ఎందుకు ఓటేస్తారో తెలుసా? 150 దేశాలకు కరోనా వ్యాక్సిన్ ఎగుమతి చేసింది. 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నం... 3 కోట్ల మందికి ఇండ్లు కట్టించినం... 30 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినం. 11 కోట్ల మందికి టాయిలెట్లు కట్టించినం. లక్ష కోట్లతో తెలంగాణలో రోడ్లు వేసినం.. కేంద్రం ఇస్తున్న నిధులవల్లే పంచాయతీలు నడుస్తున్నయ్... తెలంగాణకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తున్నందుకు ప్రజలు ఓట్లేసేందుకు సిద్ధంగా ఉన్నారు అని చెప్పారు.
కేసీఆర్ మాటలు నమ్మడానికి జనం సిద్ధంగా లేరు. నీ పార్టీ నుండి తెలంగాణ పదాన్నే తీసేసిన నీతో ప్రజలకు బంధం తెగిపోయింది. నువ్వో పెద్ద డిఫాల్టర్ సీఎంవి. అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 80 వేల ఉద్యోగాల భర్తీకి రూ.5 వేల కోట్లు కావాలి. బడ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయిస్తవా? ఉద్యోగులకు నెలకు రూ.10 వేలతో సరిపెడతవా? నీ కొడుకు, కుటుంబం బాగుపడితే రాష్ట్రమంతా బాగుపడ్డట్లేనా? గ్రీన్ కార్డులతో దావత్ చేసుకుంటున్నరా? అంతా ఐటీ వాళ్లే. పోయినోళ్లలో 80 శాతం తెలంగాణవాళ్లే అన్నారు.
నువ్వు నిజంగా ఉపాధి కల్పిస్తే... తెలంగాణ నుండి లక్షలాది మంది పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు ఎందుకు పోతున్నరు? పాలమూరు నుండి బొంబయికి ఎందుకు పెద్ద ఎత్తున వలసలు పోతున్నరు? నీ వేములవాడ ఎమ్మెల్యే జర్మనీకే వలస పోతుండు అని సెటైర్ వేశారు బండి సంజయ్.
2024లో మోదీ ప్రభుత్వం పనైపోతోందంటూ కేసీఆర్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ... ‘‘ఈ ఏడాదే కేసీఆర్ ఖేల్ ఖతం కాబోతోంది. ప్రజలు బీఆర్ఎస్ ను పాతిపెట్టబోతున్నారు’’అని అన్నారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ను ఎందుకు ఓడిస్తారో చెప్పిన బండి సంజయ్ బీజేపీకి ఎందుకు ఓటేస్తారనే విషయాన్ని వివరించారు. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ జి. మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, కోశాధికారి భండారి శాంతికుమార్, అధికార ప్రతినిధి పోరెడ్డి కిశోర్ రెడ్డి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Hyderabad News: కానిస్టేబుల్ ప్రేమ పెళ్లి - వరకట్నం కోసం వేధింపులు, తాళలేక మహిళ బలవన్మరణం
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Ambedkar Statue: 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహ పనులు వేగవంతం, ఏప్రిల్ 10 డెడ్ లైన్
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
1,540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి, వివరాలు ఇలా!
Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా
Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది