Producer Bunny Vasu: కలెక్షన్స్ 2000 కోట్లు వస్తే నిర్మాత చేతికి వచ్చేది ఎంతో తెల్సా... కలెక్షన్ పోస్టర్లు, ఐటీ రైడ్స్‌పై బన్నీ వాసు కామెంట్స్
Producer Bunny Vasu : కలెక్షన్స్, గీతా ఆర్ట్స్ పై నిర్మాత బన్నీ వాసు తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా ఇకపై సపరేట్ గా సినిమాలు చేయబోతున్నట్టు వెల్లడించారు.

'తండేల్' మూవీతో పాన్ ఇండియా ప్రొడ్యూసర్ గా మారబోతున్నారు నిర్మాత బన్నీ వాసు. పవన్ కళ్యాణ్ అభిమానిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన, ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్రెండ్ గా టాలీవుడ్ ఆడియన్స్ అందరికీ పరిచయమే. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మాతగా ఎదిగిన బన్నీ వాసు ఇప్పుడు నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ తండేల్' మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ వాసు మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.
కలెక్షన్ల పోస్టర్లతో ప్రాబ్లమ్స్
ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో భారీ సంఖ్యలో కలెక్షన్లు రాబట్టాము అంటూ నిర్మాతలు వేస్తున్న పోస్టర్ల హడావిడి ఎక్కువైపోయింది. ఇంటర్వ్యూలో "ఈ కలెక్షన్ల నెంబర్ ఇవ్వడం కాంట్రవర్సీ అవుతోంది కదా?" అని ప్రశ్నించగా... బన్నీ వాసు స్పందిస్తూ "కాంట్రవర్సీ కంటే ఐటి రైడ్స్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఉదాహరణకి ఓ సినిమాకి 2000 కోట్లు వచ్చిందని చెబితే అందులో ప్రొడ్యూసర్ చేతికి వచ్చేది 39% మాత్రమే. అందరూ ఏమనుకుంటారంటే 1800 కోట్లు ప్రొడ్యూసర్ కి వచ్చాయి అనుకుంటారు. ఒకవేళ 2000 కోట్లు కలెక్షన్స్ వస్తే నిర్మాతకు వచ్చేది 39% అంటే 700 కోట్లు మాత్రమే. 2000 కోట్లు అనేది గ్రాస్ మాత్రమే. అందులో మల్టీప్లెక్స్ లకు, థియేటర్లకు, డిస్ట్రిబ్యూషన్ లకు కమిషన్ ఇవ్వాలి. 100 రూపాయలు మీరు టికెట్ కి పెడితే అందులో 35 నుంచి 37 రూపాయలు మాత్రమే ప్రొడ్యూసర్ కి వస్తుంది. బయట మాత్రం ఆ 100 రూపాయలను నిర్మాతకి లేదా హీరోకి ఇచ్చామని అనుకుంటారు.
"మరి ఈ లెక్కలన్ని ఐటీ వాళ్లకు తెలియదంటారా?" అనే ప్రశ్నకి "మిగతా బిజినెస్ కంటే సినిమా డిఫరెంట్ బిజినెస్. ఇప్పటిదాకా వాళ్లకున్న డౌట్ కూడా అదే. మీకు వచ్చింది ఇంత కదా, ఇంతే అని చూపిస్తున్నారు? అంటారు. కానీ ఇప్పుడిప్పుడే వాళ్లకు కూడా దీనిపై నాలెడ్జ్ పెరుగుతోంది. నిజానికి ఇదంతా వాళ్లకు తెలుసు. కానీ ఆఫీసర్ మారినప్పుడల్లా పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది" అంటూ చెప్పుకొచ్చారు.
సెపరేట్ గా సినిమాలు
'తండేల్' ఈవెంట్ బన్నీ గారు వస్తారని అందరమూ వెయిట్ చేసాము.." అన్న ప్రశ్నకి... "6 గంటల వరకు ఆయన వస్తున్నారని చెప్పారు. కానీ తర్వాత అరవింద్ గారు ఆయన హెల్త్ అప్సెట్ అయిందని చెప్పారు. మార్నింగ్ నుంచి నేను ఆయన కలవలేదు కాబట్టి ఏం జరుగుతుందనేది తెలియలేదు" అని క్లారిటీ ఇచ్చారు బన్నీ వాసు. శ్రీ తేజ్ హెల్త్ కండిషన్ గురించి మాట్లాడుతూ "నిన్న అతన్ని పరామర్శించడానికి కారణం ఏంటంటే బన్నీ గారు ఆ అబ్బాయి కోసం పర్టిక్యులర్ గా ఓ మనిషిని పెట్టారు. అతను ప్రతిరోజూ అప్డేట్స్ ని ఈయనకి పంపుతుంటారు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం బాగానే ఉంది" అని అన్నారు. "బన్నీ వాసు గీతా ఆర్ట్స్ నుంచి బయటకు వస్తున్నారా?"... అన్న ప్రశ్నకి బన్నీ వాసు స్పందిస్తూ అలా ఏమీ రావట్లేదని క్లారిటీ ఇచ్చారు. కాకపోతే కొన్నిసార్లు అల్లు అరవింద్ రిజెక్ట్ చేసిన సినిమాలను తనకు నచ్చితే కనుక నిర్మిస్తానని ఓ డీల్ కుదుర్చుకున్నారట. అయితే ప్రొడక్షన్ విషయంలో చాలా పక్కాగా ఉండే అల్లు అరవింద్ ఏనాడు తనను నీ వల్ల నష్టాలు వచ్చాయి అని నిందించలేదని ఈ సందర్భంగా బన్నీ వాసు చెప్పుకొచ్చారు.
Also Read: స్టార్ డైరెక్టర్, హీరో అడిగారు... రిజెక్ట్ చేయడంతో అవకాశాలు రానివ్వలేదు - బాంబు పేల్చిన అనసూయ





















