News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Telangana Assembly Sessions: ఆ మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం, ఈ 12వ తేదీకి తెలంగాణ అసెంబ్లీ వాయిదా

ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది. మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, జనార్ధన్ రెడ్డిల మృతికి  తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది.

FOLLOW US: 
Share:

Telangana Assembly Session: నేడు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ కాసేపట్లోనే వాయిదా పడింది. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది. మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, జనార్ధన్ రెడ్డిల మృతికి  తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. అనంతరం తమ శాఖల సంబంధించిన నివేదికను తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ నెల 12వ తేదీకి అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ అసెంబ్లీ సమావేశాలలో పురపాలక చట్ట సవరణ సహా 6 బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

కాంగ్రెస్‌కు తగ్గిన ఓ ఎమ్మెల్యే.. 
తెలంగాణ అసెంబ్లీ ప్రారంభానికి ముందే సీఎల్పీ సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎల్పీ భేటీలో చర్చించారు. బీఎసీ సమావేశం తర్వాత మరోసారి సమావేశం కావాలని సీఎల్పీ నిర్ణయించింది. గత అసెంబ్లీ సమావేశాలతో పోల్చితే ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే తగ్గారు. మునుగోడు నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి సమర్పించగా, కొంత సమాయానికే రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖను ఆయను ఆమోదించారు. 

ఉదయం 11:30 గంటలకు ప్రారంభం, అంతలోనే సభ వాయిదా 
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. అనంతరం ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, జనార్ధన్ రెడ్డిల మృతికి తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. అసెంబ్లీని 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ సమావేశాలలో భాగంగా తెలంగాణ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజన్సీస్ రూల్స్ 2022 బిల్లును రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ సభలో ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు ఈ సమావేశాల్లో ప్యానెల్ స్పీకర్లుగా  రెడ్యా నాయక్, మోజం ఖాన్, హనుమంత్ షిండేల పేర్లను స్పీకర్ పోచారం ప్రకటించారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఎసీ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకొంటారు.

గోదావరి వరదలపై శాసనమండలిలో చర్చ..
ఇటీవల కురిసిన వర్షాలు, గోదావరి వరదలతో జరిగిన నష్టంపై శాసనమండలిలో చర్చ మొదలైంది. వరదల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి వివరించారు. సీఎం కేసీఆర్ సైతం ఈ ప్రాంతానికి వచ్చి స్వయంగా పరిశీలించారని గుర్తుచేశారు. భద్రాచలం ప్రాంతాల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయాలు కేటాయించినట్లు చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా సాయం అందలేదని మండలిలో వెల్లడించారు.

Also Read: ట్యాంక్ బండ్‌పై ఉద్రిక్తత, తోపులాటలు - భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకుల అరెస్టు

Also Read: Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు - ఒకేసారి దేశవ్యాప్తంగా 30 చోట్ల

Published at : 06 Sep 2022 12:07 PM (IST) Tags: Hyderabad Pocharam Srinivas reddy Telangana Assembly Telangana assembly session Telangana

ఇవి కూడా చూడండి

Deeksha Diwas : దీక్షాదివాస్‌ వేడుకలకు అనుమతి- కానీ కండిషన్స్‌ అప్లై

Deeksha Diwas : దీక్షాదివాస్‌ వేడుకలకు అనుమతి- కానీ కండిషన్స్‌ అప్లై

Telangana Elections 2023 Live News Updates: కౌశిక్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్‌- విచారణకు ఆదేశం

Telangana Elections 2023 Live  News Updates: కౌశిక్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్‌- విచారణకు ఆదేశం

EC Arrangements: పోలింగ్‌ డే కోసం ఈసీ భారీ ఏర్పాట్లు- ఎన్నికల సిబ్బందికి కీలక సూచనలు

EC Arrangements: పోలింగ్‌ డే కోసం ఈసీ భారీ ఏర్పాట్లు- ఎన్నికల సిబ్బందికి కీలక సూచనలు

Telangana Elections 2023 Live News Updates: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు

Telangana Elections 2023 Live  News Updates: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు

TS Elections: తెలంగాణ ఎన్నికలు, విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు, ఉత్తర్వులు జారీ

TS Elections: తెలంగాణ ఎన్నికలు, విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు, ఉత్తర్వులు జారీ

టాప్ స్టోరీస్

Telangana Elections 2023 : దేవుడి మీదే భారం - ఆలయాలకు క్యూ కట్టిన అన్ని పార్టీల నేతలు !

Telangana Elections 2023 :  దేవుడి మీదే భారం  - ఆలయాలకు క్యూ కట్టిన అన్ని పార్టీల నేతలు  !

Janasena Meeting: డిసెంబర్‌ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?

Janasena Meeting: డిసెంబర్‌ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?

సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం

సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం

Uttarkashi Tunnel Rescue Operation: రూ.18 వేల జీతం కోసం సొంతూరు వదిలి, కన్నీళ్లు పెట్టిస్తున్న కార్మికుల కథలు

Uttarkashi Tunnel Rescue Operation: రూ.18 వేల జీతం కోసం సొంతూరు వదిలి, కన్నీళ్లు పెట్టిస్తున్న కార్మికుల కథలు