Telangana Latest News: కేసీఆర్ విచారణ టైంలోనే మరో సంచలన- కాళేశ్వరం ఎస్‌ఈని అదుపులోకి తీసుకున్న అధికారులు
Telangana Latest News: గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద పని చేసిన ఎస్‌ఈని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏక కాలంలో ఆయన ఇళ్లు, ఆఫీస్‌లపై దాడులు చేస్తున్నారు.

Telangana Latest News: తెలంగాణలోని కాళేశ్వరంపై జరుగుతున్న విచారణ ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూస్తున్నాం. ఈ ప్రాజెక్టు విషయంలో ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ ముందుకు నేడు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఇంతలో మరో సంచలనం సృష్టించే అంశం వెలుగులోకి వచ్చింది. ఇదే ప్రాజెక్టుకు ఎస్‌ఈగా పని చేసిన నూనె శ్రీధర్ అనే వ్యక్తిని ఏసీబీ అదుపులోకి తీసుకొంది. ఆయన ఇళ్లు, బంధువుల ఇళ్లు, ఆఫీస్‌లపై ఏక కాలంలో దాడులు చేసింది.
తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన నూనె శ్రీధర్ అనే అధికారిపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. తెలంగాణ వ్యాప్తంగా ఆయనకు ఉన్న ఇళ్లు, ఆఫీసులు, బంధువుల ఇళ్లు, ఇతరు నివాసాలపై మెరుపుదాడులు చేసింది. ఏక కాలంలో రాష్ట్రంలో 12 ప్రాంతాల్లో ఈ దాడులు చేస్తోంది. ప్రస్తుతానికి అయన్ని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తోంది. ఈ దాడుల్లో ఏం గుర్తించారు, స్వాధీనం చేసుకున్న పత్రాల గురించి సమాచారం లేదు.
కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై వేసిన కమిషన్ ముందు కేసీఆర్ విచారణకు హాజరవుతున్న టైంలో జరుగుతున్న ఈ దాడులు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పుడు అధికారులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఎస్‌ఈగా పని చేశాడు. అందుకే ఇది ఎలాంటి మలుపు తీసుకుంటుందో అన్న చర్చ సాగుతోంది.





















