అన్వేషించండి

Tarun Chugh: కొత్త మిత్రులతో కలిసిన కేసీఆర్, మోదీ టూర్‌కు వచ్చి సమస్యలు సృష్టించే ఛాన్స్: తరుణ్ ఛుగ్

Tarun Chugh Comments: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో సీఎం కేసీఆర్ పీఎం, సీపీఐలతో కలిసి సమస్యలు సృష్టించాలని చూస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు.

Tarun Chugh Comments: గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల మూత పడిన ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి జాతికి అంకితమిచ్చేందుకు నవంబర్ 12వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. అయితే మోడీ రామగుండం పర్యటనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, తన కొత్త మిత్రులు సీపీఐ, సీపీఎంలతో కలిసి సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎరువుల ఫ్యాక్టరీ తెరవడాన్ని కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కర్మాగారం వల్ల తెలంగాణ రైతులకే కాకుండా యావత్ దేశానికి విశేష ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. 

ఫ్యాక్టరీని తెరిపించేందుకు కేసీఆర్ ఏం చేశారు..?

ఎరువుల ఫ్యాక్టరీపై కేసీఆర్ మరోసారి అసత్య ప్రచారం చేస్తున్నారని తరుణ్ చుగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎన్ని అబద్ధాలు చెప్పినా విజ్ఞత గల తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఈ ఫ్యాక్టరీ మూతపడిన విషయం ఆయన గుర్తించాలని చెప్పారు. ఫ్యాక్టరీని తెరిపించేందుకు ఆయన కానీ, ఆయన మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన ప్రభుత్వం కానీ ఏమీ చేయలేదని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ చొరవ తీసుకుని రూ. 6,500 కోట్లతో ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తున్నారని వివరించారు. తెలంగాణకు కేంద్రప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని కేసీఆర్ అంటున్నారని... 2014లో తెలంగాణ ఏర్పడే సమయానికి, రాష్ట్రంలో జాతీయ రహదారుల మొత్తం నిడివి 2,511 కి.మీ.లు అని చెప్పారు. కానీ ఇప్పుడు 4,996 కి.మీ.లకు పెరిగిందని వెల్లడించారు.

రాష్ట్రం వాటాగా ఇవ్వాల్సిన 699 కోట్లు రూపాయలు చెల్లించట్లే!

2014-2022 కాలంలో కొత్తగా 2,485 కి.మీ.లు జాతీయ రహదారులు నిర్మించారని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిడివిలో 99 శాతం వృద్ధి నమోదైందని అన్నారు. ఇంకా హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తూ అంబర్‌పేట్ వద్ద రూ.186.71 కోట్లతో 4-లేన్ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తోందని వివరించారు. ఉప్పల్ నుండి నారపల్లి వరకు రూ.628.8 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మిస్తోందన్నారు. రైల్వేల్లోనూ తెలంగాణకు కేంద్రం కేటాయింపులు భారీగా పెరిగాయన్నారు. 2014-19లో ప్రతి సంవత్సరం సగటున రూ.1,110 కోట్ల కేటాయింపులు జరిగేవని గుర్తు చేశారు. రూ.4,200 కోట్లతో కేంద్రం పలు అభివృద్ధి పనులు చేపట్టినా రాష్ట్రం తన వాటాగా ఇవ్వాల్సిన రూ.699 కోట్లు చెల్లించడం లేదని ఆరోపించారు. 2014-21 కాలంలో రాష్ట్రంలో 177 కిలో మీటర్ల పొడవు మేర రైల్వే లైన్లు నిర్మాణం అయ్యాయన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో రూ.31,281 కోట్ల విలువ గల పలు ప్రాజెక్టులను రైల్వేశాఖ చేపట్టిందని చెప్పుకొచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమంలోనూ కేంద్రం భాగస్వామ్యం ఉందన్నారు. తెలంగాణలో రోజురోజుకు ప్రాబల్యాన్ని కోల్పోతున్న కేసీఆర్ నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. మునుగోడులో ఆశించిన భారీ మెజారిటీ దక్కకపోవడంతో, రానున్న ఎన్నికల్లో ఓటమి ఖాయమవడంతో, కేసీఆర్ ఆందోళనలో కూరుకుపోయారని అన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే ఆయన కేంద్రమంత్రిగా ఉన్న కాలంలో రాష్టానికి వచ్చిన నిధులు, 2014 తర్వాత వచ్చిన నిధులపై బహిరంగ చర్చకు రావాలని తరుణ్ చుగ్ సవాలు చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Waqf Amendment Bill: నేడు పార్లమెంట్‌ ముందుకు వక్ఫ్ సవరణ బిల్,  ప్రభుత్వం పాస్ చేయగలదా ? సంఖ్యాబలం ఎలా ఉంది?
నేడు పార్లమెంట్‌ ముందుకు వక్ఫ్ సవరణ బిల్, ప్రభుత్వం పాస్ చేయగలదా ? సంఖ్యాబలం ఎలా ఉంది?
Renu Desai Video: హెచ్‌సీయూ భూ వివాదంపై రేణు దేశాయ్ సంచలన పోస్ట్, సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిక్వెస్ట్
హెచ్‌సీయూ భూ వివాదంపై రేణు దేశాయ్ సంచలన పోస్ట్, సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిక్వెస్ట్
Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లును ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు రెడీ, కేంద్ర విభజన అజెండాను అడ్డుకుంటామన్న కాంగ్రెస్
వక్ఫ్ సవరణ బిల్లును ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు రెడీ, కేంద్ర విభజన అజెండాను అడ్డుకుంటామన్న కాంగ్రెస్
Divyabharathi: తమిళ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ జీవీతో డేటింగ్... మరోసారి బాంబు పేల్చిన దివ్యభారతి
తమిళ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ జీవీతో డేటింగ్... మరోసారి బాంబు పేల్చిన దివ్యభారతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG vs PBKS Match Highlights IPL 2025 | లక్నో పై 8 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం | ABP DesamAnant Ambani Dwarka Padyatra | హెలికాఫ్టర్లు వద్దంటూ కాలినడకన కృష్ణుడి గుడికి అంబానీ వారసుడు | ABP DesamAnant Ambani Rescue Hens From Cages | అత్తారింటి దారేదిలో పవన్ లా..మొత్తం కొనేసిన అనంత్ అంబానీ | ABP DesamAmeer Rinku Singh Trending | IPL 2025 లోనూ తన పూర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్న రింకూ సింగ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Waqf Amendment Bill: నేడు పార్లమెంట్‌ ముందుకు వక్ఫ్ సవరణ బిల్,  ప్రభుత్వం పాస్ చేయగలదా ? సంఖ్యాబలం ఎలా ఉంది?
నేడు పార్లమెంట్‌ ముందుకు వక్ఫ్ సవరణ బిల్, ప్రభుత్వం పాస్ చేయగలదా ? సంఖ్యాబలం ఎలా ఉంది?
Renu Desai Video: హెచ్‌సీయూ భూ వివాదంపై రేణు దేశాయ్ సంచలన పోస్ట్, సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిక్వెస్ట్
హెచ్‌సీయూ భూ వివాదంపై రేణు దేశాయ్ సంచలన పోస్ట్, సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిక్వెస్ట్
Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లును ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు రెడీ, కేంద్ర విభజన అజెండాను అడ్డుకుంటామన్న కాంగ్రెస్
వక్ఫ్ సవరణ బిల్లును ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు రెడీ, కేంద్ర విభజన అజెండాను అడ్డుకుంటామన్న కాంగ్రెస్
Divyabharathi: తమిళ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ జీవీతో డేటింగ్... మరోసారి బాంబు పేల్చిన దివ్యభారతి
తమిళ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ జీవీతో డేటింగ్... మరోసారి బాంబు పేల్చిన దివ్యభారతి
HCU Land Dispute: 400 ఎకరాలు హెచ్సీయూవి కావు- ఎలాంటి వెంచర్లు వేయడం లేదు: మంత్రుల బృందం
400 ఎకరాలు హెచ్సీయూవి కావు- ఎలాంటి వెంచర్లు వేయడం లేదు: మంత్రుల బృందం
Bird Flu Death In AP: బర్డ్ ఫ్లూ వైరస్ H5N1 సోకడంతో రెండేళ్ల చిన్నారి మృతి, ఏపీలో తొలి ఘటనతో ప్రభుత్వం అలర్ట్
బర్డ్ ఫ్లూ వైరస్ సోకడంతో రెండేళ్ల చిన్నారి మృతి, ఏపీలో తొలి ఘటనతో ప్రభుత్వం అలర్ట్
Waqf Amendment Bill:వక్ఫ్ సవరణ బిల్‌కు చంద్రబాబు, పవన్ ఎందుకు మద్దతు ఇచ్చారు? వైసీపీ స్టాండ్‌ ఏంటీ?
వక్ఫ్ సవరణ బిల్‌కు చంద్రబాబు, పవన్ ఎందుకు మద్దతు ఇచ్చారు? వైసీపీ స్టాండ్‌ ఏంటీ?
Madhushala Movie Review - మధుశాల రివ్యూ: ETV Winలో పొలిటికల్ క్రైమ్ డ్రామా... వరలక్ష్మి సినిమా బావుందా? లేదా?
మధుశాల రివ్యూ: ETV Winలో పొలిటికల్ క్రైమ్ డ్రామా... వరలక్ష్మి సినిమా బావుందా? లేదా?
Embed widget