అన్వేషించండి

Telangana Rising Global Summit: నేడు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ ప్రారంభం.. ఫ్యూచర్ సిటీలో అద్భుతమైన ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

Telangana Rising Global Summit 2025 | భారత్ ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Bharat Future City | హైదరాబాద్: తెలంగాణలో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి వివరించి, పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రెండు రోజుల పాటు నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అద్భుతమైన ఏర్పాట్లను పూర్తి చేసింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 44కు పైగా దేశాల నుంచి ఏకంగా 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవ్యాప్తంగా పేరెన్నికగల కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్‌లో పాల్గొంటుండగా, ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నారు.

సమ్మిట్ ప్రారంభించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ లాంఛనంగా ఈ సమ్మిట్‌ను ప్రారంభిస్తారు. సుమారు రెండు వేల మంది దేశ, విదేశీ అతిథులు ఈ ప్రారంభ వేడుకకు హాజరవుతున్నారు. ఈ సమ్మిట్‌లో వివిధ కీలక అంశాలపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈఓ జెరెమీ జుర్గెన్స్, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా వంటి ప్రముఖులు ప్రసంగించనున్నారు.


Telangana Rising Global Summit: నేడు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ ప్రారంభం.. ఫ్యూచర్ సిటీలో అద్భుతమైన ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఆయన తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రత్యేకతలను ఆహుతులకు వివరించనున్నారు. ఈ రెండు రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్లు జరుగుతాయి, ఇందుకు వీలుగా సెమినార్ హాళ్లను అధికారులు సిద్ధం చేశారు.

సాంస్కృతిక ప్రదర్శనలు, టూరిజం ప్రచారం
సదస్సుకు వచ్చిన అంతర్జాతీయ, దేశీయ అతిథులు, పెట్టుబడిదారులకు తెలంగాణతో పాటు హైదరాబాద్ ప్రత్యేకతలు తెలిసేలా ప్రభుత్వం విస్తృత ప్రచార సామాగ్రిని సిద్ధం చేసింది. ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వేదిక వరకు వివిధ రూపాల్లో ప్రదర్శనలు ఉంటాయి. అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీతో ప్రత్యేకంగా ప్రచార ఏర్పాట్లు చేశారు. లైటింగ్ ప్రొజెక్షన్, 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్, ఎయిర్‌పోర్ట్ అప్రోచ్ రోడ్డులో ఎల్‌ఈడీ స్క్రీన్ల ద్వారా విభిన్న ప్రదర్శనలు ఉంటాయి. చర్చలు పూర్తయిన తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీత కచేరి అతిథులను అలరించనుంది. అలాగే తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గు డొల్లు, పేరిణి నాట్యం, బోనాల ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. మరోవైపు, దౌత్య బృందం నాగార్జున సాగర్ సమీపంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్కు అయిన బుద్ధవనం పర్యటనకు వెళ్లేలా టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ప్రత్యేక ఆతిథ్యం, హైదరాబాద్ బిర్యానీ
సదస్సు జరిగే రెండు రోజులూ హాజరైన అందరికీ పసందైన హైదరాబాదీ బిర్యానీతో పాటు, తెలంగాణ ప్రసిద్ధ వంటకాలతో భోజనాలను అందించేందుకు వంటశాలలు సిద్ధమయ్యాయి. అంతేకాకుండా, అతిథులకు తెలంగాణ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా, ప్రభుత్వం తరపున గ్లోబల్ సమ్మిట్ డెలిగేట్‌లకు ప్రత్యేక సావనీర్లతో కూడిన బహుమతిని అందించనున్నారు. ఈ సావనీర్లలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగో, పోచంపల్లి ఇక్కత్ శాలువా, చేర్యాల కళాకృతులు, హైదరాబాదీ అత్తర్, మరియు ముత్యాలతో కూడిన నగలను పొందుపరుస్తారు. దీంతో పాటు, తెలంగాణకే ప్రత్యేకమైన వంటలైన ఇప్ప పువ్వు లడ్డు, సకినాలు, చెక్కలు, బాదం కీ జాలి, నువ్వుల ఉండలు, మక్క పేలాలతో కూడిన మరో ప్రత్యేక బాస్కెట్‌ను కూడా అతిథులకు మంచి ఆతిథ్యాన్ని అందించనున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:అన్నం పెట్టిన వాడిని మర్చిపోతమా? మరోసారి హాట్ కామెంట్స్ చేసిన పోచారం! 
అన్నం పెట్టిన వాడిని మర్చిపోతమా? మరోసారి హాట్ కామెంట్స్ చేసిన పోచారం! 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
Embed widget