By: ABP Desam | Updated at : 21 Aug 2023 09:20 PM (IST)
ప్రతీకాత్మకచిత్రం
South Central Railway: దక్షిణ మధ్య రైల్వేశాఖ మరోసారి పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేసింది. తూర్పుకోస్తా రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్‌లో మూడోలైన్‌కు నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భువనేశ్వర్, మంచేశ్వర్, హరిదాస్‌పుర్-ధన్‌మండల్ సెక్షన్‌లో ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని పాక్షింగా రద్దు చేసింది. ఈ మేరకు రద్దయిన రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్లే శాఖ ప్రకటించింది.
Due to non-interlocking work in Gunadala – Vijayawada section, the following trains are cancelled, partially cancelled as follows:
— South Central Railway (@SCRailwayIndia) August 21, 2023
#1 pic.twitter.com/umNmQnw1ut
ఈ నెల 21 నుంచి 29 వరకు 75 రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. మరో వైపు భువనేశ్వర్ – ముంబయి, హౌరా – సికింద్రాబాద్, భువనేశ్వర్ – సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగించే ఆరు సర్వీసులను ఈ నెల 24 నుంచి 30 వరకు పలు తేదీల్లో భువనేశ్వర్‌కు బదులుగా ఖుర్దా రోడ్ నుంచి అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వేశాఖ వివరించింది. అలాగే విజయవాడ సెక్షన్‌లో గుండాల వద్ద ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా 18 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు పేర్కొంది.
గత వారం సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల పరిధిలో పలు రైల్లు రద్దయ్యాయి. నిర్వహణ పనుల కారణంగా రెండు డివిజన్లలో పలు ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్ల రాకపోకలను పాక్షికంగా నిలిపివేసింది. రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా.. మొత్తం 20 ప్యాసింజర్ రైళ్లతో పాటు, 22 ఎంఎంటీఎస్ రైళ్లను వారం రోజుల పాటు క్యాన్సిల్ చేస్తున్నట్లుగా తెలిపింది. తాజాగా తూర్పుకోస్తా రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్‌లో మూడోలైన్‌కు నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల నేపథ్యంలో 75 రైళ్లు, విజయవాడ సెక్షన్‌లో గుండాల వద్ద ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా 18 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. ప్రయాణికులు రైళ్ల రద్దు విషయాన్ని గుర్తించాలని, తదనుగుణంగా ప్రయాణాలను మార్చుకోవాలని కోరింది.
Due to non-interlocking work in Gunadala – Vijayawada section, the following trains are cancelled, partially cancelled as follows:
— South Central Railway (@SCRailwayIndia) August 21, 2023
#2 pic.twitter.com/MnyFagV7Gx
Rainbow Hospitals: గుండె లోపాలు జయించిన చిన్నారులతో రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ వరల్డ్ హార్ట్ డే వేడుకలు
Telangana Investments : తెలంగాణలో అడ్వెంట్ ఇంటర్నేషనల్ భారీ పెట్టుబడులు - కేటీఆర్‌తో సమావేశమైన కంపెనీ ప్రతినిధులు !
Ganesh Immersion: 250 మంది పోకిరీల అరెస్ట్, మందుబాబులూ మీరే ఆలోచించుకోవాలి - సీపీ ఆనంద్
Telangana CS: తెలంగాణ సీఎస్ శాంతి కుమారి కీలక భేటీ - ఆ అధికారులకు సహకరించాలని ఆదేశాలు
Breaking News Live Telugu Updates: ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు విచారణ వాయిదా
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
Disney Password Sharing: ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ - నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్న డిస్నీ!
Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?
CM Jagan: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం - దీంతో ప్రయోజనాలు ఇవే
/body>