అన్వేషించండి

Shamshabad Airport: విమానం హైజాక్‌ చేస్తాం-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బెదిరింపు మెయిల్‌-ముగ్గురు అరెస్ట్‌

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మళ్లీ బెదిరింపు వచ్చింది. ఈసారి ఏకంగా విమానం హైజాక్‌ చేస్తామంటూ మెయిల్‌ పెట్టారు దుండగులు. అది ఫేక్‌ మెయిల్‌ అని నిర్ధారించిన పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్టు సమాచారం.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మరోసారి బెదిరింపు మెయిల్‌ వచ్చింది. హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్లే విమానాన్ని హైజాక్‌ చేయబోతున్నట్టు అర్థరాత్రి మెయిల్‌ పెట్టాడు  ఆగంతకుడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎయిర్‌పోర్టులోని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి ఈ మెయిల్ వచ్చింది. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.  ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్‌ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. ఆ తర్వాత ఆ విమాన సర్వీసును రద్దు చేశారు. ప్రయాణికులను  హోటల్‌కు తరలించారు. తనిఖీల్లో హైజాక్‌కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

విమానాన్ని హైజాక్‌ చేస్తామంటూ అర్థరాత్రి వచ్చిన మెయిల్‌ ఫేక్‌ అని నిర్ధారించుకున్నారు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు అధికారులు. అయితే... ఈ మెయిల్ ఎవరు చేశారనే దానిపై  విచారణ చేపడుతున్నారు. ఈమెయిల్‌ వచ్చిన ఐపీ అడ్రెస్‌ ఆధారంగా విచారణ చేపడుతున్నారు టెక్నికల్‌ సిబ్బంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు  అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. 

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బెదిరింపు మెయిల్‌ రావడం ఇది మొదటిసారేం కాదు. పలుమార్లు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్స్‌ చేశారు. మెయిల్‌ వచ్చిన ప్రతిసారి  భద్రతా సిబ్బంది పరుగులు పెట్టడం... తనిఖీలు చేయడం... అది ఫేక్‌ అని తేల్చడం... ఆ తర్వాత ఊపిరిపీల్చుకోవడం. ఇదే జరుగుతోంది. ఆగస్టులో కూడా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి... ఎయిర్‌పోర్టులో బాంబు ఉందని.. ఏ క్షణమైనా పేలొచ్చని చెప్పాడు. దీంతో ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బంది... తనిఖీలు చేపట్టి బాంబు లేదని నిర్ధారించారు. అది ఫేక్‌కాల్‌ అని స్పష్టం చేశారు. 

ఇప్పుడు ఏకంగా విమానమే హైజాక్‌ చేస్తామంటూ వచ్చిన మెయిల్‌తో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సిబ్బంది మరోసారి ఉలిక్కిపడ్డారు. ఎయిర్‌పోర్టులో భద్రతను మరింత పటిష్ఠం చేశారు. హైఅలర్ట్‌ విధించారు. హైజాగ్‌ చేస్తామని బెదరించిన దుబాయ్‌ విమానాన్నే కాదు.. ఎయిర్‌పోర్టు మొత్తం తనిఖీలు చేశారు భద్రతా సిబ్బంది. ఎయిర్‌పోర్టులో తనిఖీలతో ప్రయాణికులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఎయిర్‌పోర్టులో ఒక్క ఇంచి కూడా వదలకుండా డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు పోలీసులు. ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికులు భయపడిపోయారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget