గ్యాస్ సిలిండర్ పేలి వ్యక్తి మృతి, ఘటనా స్థలాన్ని పరిశీలించిన పద్మారావుగౌడ్
Secunderabad News: ఈరోజు సికింద్రాబాద్ చిలకలగూడలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
Secunderabad News: సికింద్రాబాద్ లోని చిలకలగూడ దూద్ బావిలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండ్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఏడుగురికి మందికి తీవ్ర గాయలు అయ్యాయి. పేలుడు కారణంగా ఇల్లంతా పూర్తిగా దగ్ధమైంది. అయితే విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. కానీ అప్పటికే ఇల్లంతా కాలిపోయింది. వీరితో పాటే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కూడా అదే ఆస్పత్రికి తరిలించారు.
అయితే విషయం తెలుసుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మారావ్ గౌడ్.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా కూడా అండగా ఉంటామని తెలిపారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా పరామర్శించారు. అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని మెరుగైన చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించబోతున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మారావ్ గౌడ్ వివరించారు. ప్రమాదంలో మొత్తం 8 మంది గాయపడగా అందులో నారాయణస్వామి వ్యక్తి చనిపోయారు. ఖలీమా బేగం, జాఫర్, నర్సింగరావు, శ్రీనివాస్‌ను యశోద ఆసుపత్రికి తరలిస్తున్నామని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. పేలుడుకు గల కారణాలు ఏంటో స్థానిక సీఐ నరేష్ ను అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ స్పీకర్ వెంట ఏసీపీ సుధీర్ కూడా ఉన్నారు.
భారీ శబ్ధంతో ఒక్కసారిగా బ్లాస్ట్..
మూడు నెలల క్రితం కూడా ఇలాంటి పేలుడు ఘటనే సంభవించింది. అది రాత్రి సమయం. రాత్రి 8 గంటలు అవుతోంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. డ్యూటీలు ముగించుకుని ఇళ్లకు చేరిన వారు.. వంటావార్పు పూర్తి చేసుకుని తిందామని కూర్చున్న వారు.. వారి పనులు చేసుకుంటున్నారు. అంతలోనే ఆ రాంరెడ్డి నగర్ ప్రాంతంలో ఉన్నట్టుండి భారీ శబ్ధం. ఏదో పేద్ద బాంబు పేలినట్టు. అక్కడ ఉన్న వారు అంత పెద్ద శబ్ధంతో ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందా అని ఇళ్ల నుండి బయటకు వచ్చారు. పక్కనున్న ఇంట్లో వారిని ఏమిటి ఆ శబ్ధం అని అడిగినా వారికీ తెలియదు అనే సమాధానమే. అంతలోనే కొందరు మరో వైపు పరుగులు పెట్టారు. ఏమిటా అని చూస్తే ఓ గదిలో సిలిండర్ పేలిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
బ్లాస్ట్ జరిగిన రూములో ఎంతమంది ఉంటున్నారు?
వాళ్లంతా బ్యాచ్ లర్స్.. జార్ఖండ్ రాష్ట్రం నుండి ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చారు. వాళ్లు మొత్తం 8 మంది ఆ గదిలో ఉంటున్నారు. అక్కడే ఉంటూ స్థానికం జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉండే పలు పరిశ్రమల్లో డైలీ లేబర్లుగా పని చేస్తున్నారు. ఉదయం జరిగిన గొడవ వీరి మధ్యే అరుపులు వినిపించింది ఈ రూము నుండే అని స్థానికులు చెప్పారు.
మంటలు, కూలిపోయిన గోడలు
సిలిండర్ బ్లాస్ట్ కావడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఆ పేలుడు ధాటికి ఇంటి గోడ కూలిపోయింది. మంటలు చెలరేగడంతో.. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను అదుపు చేశారు.
ఎంత మంది చనిపోయారు?
సిలిండర్ బ్లాస్ట్ లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతులను నబిబొద్దిన్, బిరేందర్ లుగా గుర్తించారు. ఆ గదిలో మరో 5 సిలిండర్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.
బ్లాస్ట్ ఎలా జరిగింది?
ప్రాథమిక దర్యాప్తు అనంతరం పూర్తి సమాచారం తెలుపుతామని బాలానగర్ ఏసిపి గంగారాం తెలిపారు. స్నేహితుల మధ్య జరిగిన గొడవలతో గ్యాస్ సిలిండర్ ను పేల్చినట్లు స్దానికులు భావిస్తున్నారు. ఇది హత్యా లేక ప్రమాదవశాత్తు జరిగిన ఘటననా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని జీడిమెట్ల పోలీసులు తెలిపారు.