ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో SIR ప్రక్రియ (ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం) ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇది పార్టీల గెలుపోటములను శాసిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Revanth Reddy Warning: SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
Revanth Reddy Warning: ఓటరు జాబితా సవరణలో నిర్లక్ష్యం వహించే నాయకుల సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పది రోజుల డెడ్‌లైన్ విధించారు.

- ఓటరు జాబితా సవరణపై నిర్లక్ష్యం వహిస్తే పదవులు పోతాయని రేవంత్ హెచ్చరిక.
- తెలంగాణలో గురువారం నుంచి SIR ప్రక్రియ, ఓటరు నమోదు ప్రారంభం.
- జూమ్ మీటింగ్‌లో మహేష్ గౌడ్ బీజేపీ వ్యూహాలపై ఆందోళన వ్యక్తం.
- బూత్ ఏజెంట్లు ఓటరు జాబితా పరిశీలించి, అర్హుల నమోదు చేయాలి.
Revanth Reddy Warning: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు SIR ప్రక్రియ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదని కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. పని చేసే వాడికే పదవి, నిర్లక్ష్యం చేసేవారిని ఇంటికి పంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడకుండా, కేవలం పదవులను అనుభవిస్తూ పార్టీకి నష్టం కలిగిస్తామంటే చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు.
ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు కాంగ్రెస్ క్యాడర్‌కు ఇచ్చిన అల్టిమేట్ డెడ్ లైన్. కేవలం పది రోజులు సమయం ఇస్తున్నామని, ఈ లోపు గ్రౌండ్ లెవల్‌లో మార్పు రాకపోతే వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తామని సీఎం స్పష్టం చేయడం ఇప్పుడు గాంధీభవన్ వర్గాల్లో హీట్ పెంచింది. ఓటరు జాబితా సవరణ విషయంలో ఏ మాత్రం ఏమరుపాటు ఉన్నా అది భవిష్యత్ ఎన్నికలపై ఇంపాక్ట్ చూపిస్తుందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణలో గురువారం నుంచి SIR ప్రక్రియ ప్రారంభం
తెలంగాణలో గురువారం నుంచి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రారంభంకానుంది. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్లు నమోదు వంటి కీలక ప్రక్రియలు ఇందులో జరుగుతాయి. ప్రజాస్వామ్యంలో ఓటరు జాబితానే పార్టీల గెలుపోటములను శాసిస్తుంది. అందుకే, దీనిని లైట్ తీసుకోవద్దని రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లోని సర్పంచ్‌లను యాక్టివేట్ చేసి, ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు.
జూమ్ మీటింగ్‌లో వార్ రూమ్ సీన్
ఈ విషయంలో పార్టీ అప్రమత్తం చేసేందుకు ఒక హై లెవల్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వంటి దిగ్గజాలు పాల్గొన్నారు. ఈ మీటింగ్‌లో రేవంత్ రెడ్డి మాటలు తూటాల్లా పేలాయి. పని చేయని నాయకుల వల్ల పార్టీకి నష్టం కలిగితే చూస్తూ ఊరుకోంని ఆయన స్ట్రాంగ్ మెసేజ్ పంపారు.
మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీజేపీ రాజకీయ వ్యూహాలపై సీరియస్ కామెంట్స్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల నిర్వహణలో జరిగిన పరిణామాలను ఉదాహరణగా చూపిస్తూ, తెలంగాణలోనూ అలాంటి కుట్రలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. లౌకికవాద ఓట్లను టార్గెట్ చేసి, జాబితా నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రతి అర్హత కలిగిన ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లపై ఉందన్నారు.
బూత్ లెవల్ ఏజెంట్‌దే కీలక పాత్ర
పార్టీ యంత్రాంగంలో అత్యంత కీలకమైన బూత్ లెవ్ ఏజెంట్ అప్రమత్తంగా ఉండాలని నేతలు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ఓటరు జాబితాను నిశితంగా పరిశీలించి, అనర్హుల ఓట్లు తొలగించడం, అర్హులకు చోటు కల్పించడం వంటి పనులు వార్ ఫుటింగ్ మీద జరగాలని సూచించారు. ఎన్నికల వ్యూహాల్లో ఓటరు జాబితా సవరణ అనేది అత్యంత టెక్నికల్, టాక్టిక్ అంశమని, ఇక్కడ దెబ్బ తింటే అసలుకే ఎసరు వస్తుందని హెచ్చరించారు.
Frequently Asked Questions
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశం ఏమిటి?
కాంగ్రెస్ నాయకులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హెచ్చరిక ఏమిటి?
SIR ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పని చేసే వారికే పదవి, నిర్లక్ష్యం చేసే వారిని ఇంటికి పంపేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణలో SIR ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది? దాని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?
తెలంగాణలో గురువారం నుంచి SIR ప్రక్రియ ప్రారంభంకానుంది. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు వంటి కీలక ప్రక్రియలు ఇందులో జరుగుతాయి.
ఓటరు జాబితా సవరణ ఎందుకు ముఖ్యమని రేవంత్ రెడ్డి అన్నారు?
ఓటరు జాబితా సవరణలో ఏమరుపాటు భవిష్యత్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటరు జాబితానే పార్టీల గెలుపోటములను శాసిస్తుందని ఆయన సూచించారు.
ట్రెండింగ్ వార్తలు






















