అన్వేషించండి

CM Revanth Reddy: సిగాచి యాజమాన్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం, నిపుణులతో అధ్యయనం చేయాలని ఆదేశాలు

పాశమైలారంలో పేలుడు సంభవించిన సిగాచి పరిశ్రమకు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. అక్కడే అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించిన రేవంత్ కారణాలపై అధికారులను ఆరా తీశారు.

పాశమైలారం: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ప్రమాదం జరిగిన స్థలాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) మంగళవారం ఉదయం పరిశీలించారు. సోమవారం ఉదయం సిగాచి కెమికల్స్ లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 36కు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి అధికారులను ఘటనకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు.

ప్రమాదం జరిగిన సిగాచి పరిశ్రమలో గతంలో తనిఖీలు చేశారా, బాయిలర్లను తనిఖీ చేసి ప్రమాదానికి ఏమైనా కారణాలు గుర్తించారా అని ఆరా తీశారు. ఊహించి సమాధానాలు చెప్పకూడదని, ప్రమాదాలకు వాస్తవ కారణాలు గుర్తిస్తే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. పేలుడు స‌మ‌యంలో ఫ్యాక్ట‌రీలో 143మంది ఉండ‌గా... కేవ‌లం 58మందిని గుర్తించినట్లు తెలిపారు.

" సిగాచి ఇండస్ట్రీలో జరిగిన పేలుడు ఘటనకు బాధ్యులు ఎవరో మొదట గుర్తించండి. వారినే మనం బాధ్యులు చేస్తేనే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే రేపు నాకు సంబంధం లేదని ఆ వ్యక్తులు అంటారు. కంపెనీలో తనిఖీలు చేశారా. పేలిన బాయిలర్ తనిఖీ చేసి ఏమైనా సమస్యలు, లోపాలు గుర్తించారా? వాటికి సంబంధించి వివరాలు ఏమున్నాయి. గతంలో తనిఖీలు చేసి సమస్య ఉంటే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారా?. తనిఖీలు చేయడంతోనే సరిపోదు. లోపాలను సరిద్దడానికి కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకుంది. మృతదేహాలను గుర్తించడం ఓ సవాల్. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడటం మరో సవాల్. కంపెనీకి సంబంధించి బాధ్యుతల వివరాలు సేకరించండి. ఆ వ్యక్తి లేకపోతే ఎవరు బాధ్యతలు తీసుకుంటారు, ప్రభుత్వం ఎవరితో చర్చించాలన్న పూర్తి వివరాలు సేకరించండి "
-సీఎం రేవంత్ రెడ్డి

సిగాచి యాజమాన్యంపై చర్యలు

ఇంత పెద్ద ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా సిగాచి కెమికల్స్ ఇండస్ట్రీకి సంబంధించిన యాజమాన్యం ఒక్కరూ కూడా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రమాదంపై నిపుణులతో అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 

సీఎం వెంట మంత్రులు.. 

అంతకుముందు పాశమైలారం ఘటనాస్థలి వద్ద అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. సిగాచి కెమికల్స్ ఇండస్ట్రీలో ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యలు చేపట్టిన తీరుతో పాటు మృతుల వివరాలపై అధికారులతో సమీక్షించారు. ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో మానవతా కోణంలో చూడాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు వివేక్‌ వెంకట్ స్వామి, శ్రీధర్‌ బాబు, పొంగులేటి, దామోదర రాజనర్సింహ ఉన్నారు. 

పాశమైలారం ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి పటాన్ చెరులోని ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు. పాశమైలారం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 42కి చేరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారులు ఇంకా మృతుల సంఖ్య 36కు చేరినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై తమ ప్రభుత్వం ఫోకస్ చేసిందన్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget