By: ABP Desam | Updated at : 06 Feb 2023 09:39 AM (IST)
ఇంటి నుంచి బయల్దేరుతున్నరేవంత్ రెడ్డి
నేటి నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలుకానుంది. హత్ సే హత్ జోడో అభియాన్ లో భాగంగా రేవంత్ పాదయాత్ర కొనసాగుతుంది. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం కానుండగా, ఉదయం 8 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్రకు బయలు దేరారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె నైనిషా రెడ్డి రేవంత్ రెడ్డికి హారతి ఇచ్చారు. తండ్రి నుదుటన బొట్టు పెట్టి పాదయాత్రకు పంపారు. తర్వాత వరంగల్ హైవే మీదుగా రేవంత్ రెడ్డి ములుగుకు బయలుదేరనున్నారు. ములుగులో గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఉదయం ములుగులో గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మ వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. 12 గంటలకు పాదయాత్ర ప్రారంభించనున్నారు. తొలుత మేడారం నుంచి కొత్తూరు, నార్లాపుర్, ప్రాజెక్ట్ నగర్ వరకు పాదయాత్ర చేస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 2.30 వరకు ప్రాజెక్ట్ నగర్ లో భోజన విరామం ఉంటుంది. ప్రాజెక్ట్ నగర్ నుంచి మధ్యాహ్నం 2:30 గంటలకు పాదయాత్ర మళ్లీ మొదలు అవుతుంది. సాయంత్రం 4:30 నుంచి 5 గంటలకు పస్రా గ్రామంలో టీ విరామం ఉంటుంది.
పస్రా జంక్షన్ లో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం 6 గంకలకు పస్రా నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేరుకుంటుంది. రాత్రికి రామప్ప గ్రామంలోనే రేవంత్ రెడ్డి బస చేయనున్నారు.
Hyderabad News : పెళ్లైన రెండేళ్లకే దారుణం, కుటుంబ కలహాలతో ట్రాన్స్ జెండర్లు ఆత్మహత్య!
ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ విచారణ మూడు వారాలకు వాయిదా
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ కేసులో మరో అరెస్టు, ఇప్పటిదాకా 15 మంది - అన్ని జిల్లాలకీ పాకిన క్వశ్చన్ పేపర్?
Modi Hyderabad Tour: మోదీ హైదరాబాద్ టూర్ డేట్ ఫిక్స్ - రెండో వందేభారత్ ట్రైన్ ప్రారంభించనున్న ప్రధాని
నేడు సుప్రీంలో విచారణకు కవిత పిటిషన్ - ఈడీపై కేసులో ఏం జరగబోతోంది?
KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత
Rapaka Varaprasad: నేను దొంగ ఓట్ల వల్లే గెలిచా, ఒక్కొక్కరు 10 దాకా ఫేక్ ఓట్లేశారు - ఎమ్మెల్యే రాపాక
Game Changer First Look: స్టైలిష్ లుక్ లో రామ్ చరణ్, ఇరగదీసిన ‘గేమ్ చేంజర్’ పోస్టర్
కన్నా విందు భేటీలో రాయపాటి ఫ్యామిలీ- మారుతున్న గుంటూరు రాజకీయం!