అన్వేషించండి

Google Safety Centre: దేశంలోనే తొలి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభం, వేలాది యువతకు ఉద్యోగాలు

Telangana News | దేశంలోనే తొలి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైటెక్ సిటీలో గూగుల్ సేఫ్టీ సెంటర్ ప్రారంభించారు.

Google Safety Engineering Centres | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC) ప్రారంభించారు. ఇది భారతదేశంలో మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇదే మొదటి సెంటర్ కావడం విశేషం. ఈ సేఫ్టీ సెంటర్ సైబర్‌ సెక్యూరిటీ, ఆన్‌లైన్ భద్రత, AI-ఆధారిత భద్రతా పరిష్కారాలపై పరిశోధన చేస్తుంది. ఇది తెలంగాణ, భారతదేశ డిజిటల్ భద్రతను పెంపొందించడంతోపాటు, వేలాది యువతకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయని.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి ఈ ప్రాజెక్ట్‌ను హైదరాబాద్‌కు తేవడంలో కీలక పాత్ర పోషించారు. ఈ కేంద్రం భారతదేశానికి సంబంధించిన సైబర్‌ సెక్యూరిటీ సవాళ్లకు పరిష్కారాలను అందిస్తుంది. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి భద్రతా హబ్‌గా తీర్చిదిద్దుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది. రేవంత్ రెడ్డి గూగుల్‌తో ఈ భాగస్వామ్యం తెలంగాణ యువతకు, ఇంజనీర్‌లకు, భద్రతా నిపుణులకు విశేష అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు.


Google Safety Centre: దేశంలోనే తొలి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభం, వేలాది యువతకు ఉద్యోగాలు

సైబర్ భద్రత, ఆన్‌లైన్ సెక్యూరిటీ: ఈ కేంద్రం సైబర్‌ సెక్యూరిటీ, ఆన్‌లైన్ భద్రత, AI-ఆధారిత భద్రతా పరిష్కారాలపై పరిశోధన చేస్తుంది. ఇది భారతదేశం, తెలంగాణకు అవసరమైన సైబర్ భద్రతా సవాళ్లకు పరిష్కారాలను అందిస్తుంది. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి భద్రతా హబ్‌గా మార్చడంలో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుంది.

ఉద్యోగ అవకాశాలు

 ఈ కేంద్రం వల్ల యువతకు, ఇంజనీర్‌లకు, భద్రతా నిపుణులకు వేలాది ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ భద్రత, సాంకేతిక వికాసం, ఇన్నోవేషన్‌లను పెంపొందిస్తుంది. గూగుల్‌తో భాగస్వామ్యం వల్ల తెలంగాణకు ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం మరియు మార్కెట్ ఎక్స్పోజర్ లభిస్తుంది

గూగుల్ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం మారిపోయింది. నేడు, మన జీవితాలు పూర్తిగా డిజిటల్ మారాయి. మనం గోప్యత, భద్రత గురించి నేడు ఆందోళన చెందుతున్నాం. మన ఆర్థిక వ్యవస్థ, మన ప్రభుత్వం, మన జీవితాలు డిజిటల్ గా మారాయి. డిజిటల్ సురక్షితంగా ఉంటే, మనం మరింత అభివృద్ధి చెందుతాం.  అధునాతన సైబర్ సెక్యూరిటీ , భద్రతా పరిష్కారాల కోసం గూగుల్ ఈ సైబర్-సెక్యూరిటీ హబ్‌ను ఉపయోగిస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇది నైపుణ్య అభివృద్ధి పై దృష్టి పెడుతుంది. ఉపాధిని సృష్టించడం తో పాటు  దేశం  సైబర్ భద్రతా సామర్థ్యాన్ని పెంచుతుంది. చెడు చేయవద్దన్నది గూగుల్ సంస్థ సిద్ధాంతం ..ఈ విధానాన్ని నేను ఇష్టపడుతున్నాను.


Google Safety Centre: దేశంలోనే తొలి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభం, వేలాది యువతకు ఉద్యోగాలు

ఇదే తెలంగాణ రైజింగ్
గూగుల్ లాగా, నా ప్రభుత్వం కూడా మంచిని మాత్రమే చేస్తుందని నమ్ముతున్నాను. ఈ విధానం వల్ల ప్రయోజనాలు కొంత నెమ్మదిగా కనిపిస్తాయి.. అయితే మనం దీర్ఘకాలికంగా దృష్టి పెట్టి పని చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు ఉత్తమ పెట్టుబడి అనుకూల రాష్ట్రం కోసం శోధిస్తే దానికి సమాధానం తెలంగాణ అని వస్తుంది. మీకు సెర్చ్ లో మొదటి లింక్ హైదరాబాద్ వస్తుంది. దీనిని మేము తెలంగాణ రైజింగ్ అని పిలుస్తాము.

1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు

2035 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. మేము 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను  చేయాలనుకుంటున్నాం. గూగుల్ ఆఫీస్ పక్క ని రెండున్నర ఎకరాల్లో స్వయం సహాయక సంఘాల మహిళ ల కోసం స్టాల్స్ ఏర్పాటు చేశా మేము మా రైతులను సంపన్నులుగా తయారు చేయడంతో పాటు సంతోషంగా ఉంచాలనుకుంటున్నాం.  మా యువతలో నైపుణ్యాలు పెంచడంతో పాటు  వారికి ఉపాధి కల్పించాలనుకుంటున్నాం. వీటన్నిటికీ, నాకు మీ మద్దతు అవసరం. తెలంగాణ రైజింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా కావాలని కోరుకుంటున్న. 

 

గూగుల్ , హైదరాబాద్ పాత స్నేహితులు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గూగుల్ తన మొదటి కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది. దాదాపు 7,000 మంది గూగుల్ ఉద్యోగులు నేడు హైదరాబాద్‌ను తమ ఇల్లుగా భావిస్తున్నారు. విద్య, భద్రత, మ్యాప్‌లు, ట్రాఫిక్, స్టార్టప్‌లు, ఆరోగ్యం ఇలా  అనేక రంగాలలో గూగుల్ తో కలిసి మేం పనిచేస్తున్నాం. గూగుల్  ఒక వినూత్న సంస్థ, మాది ఒక వినూత్న ప్రభుత్వం. మా ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాన్స్‌జెండర్‌లను నియమించాం. GHMC కూడా వివిధ పనుల కోసం ట్రాన్స్‌జెండర్‌లను నియమిస్తుంది. 

నాణ్యమైన విద్య మా లక్ష్యం.. ఇందుకోసం యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను తీసుకువస్తున్నాం. తెలంగాణ లో ప్రతి సంవత్సరం 1.10 లక్షల ఇంజనీర్స్ కాలేజ్ ల నుంచి వస్తున్నారు. చాలా మంది విద్యార్థులకు నైపుణ్యం ఉండడం లేదు. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. పబ్లిక్,ప్రైవేట్ భాగస్వామ్యం లో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నా అందరికీ ఆరోగ్యం మా లక్ష్యం. ఇవే నా ప్రధాన ఆవిష్కరణలు..

 గూగుల్ లాగానే, నా ప్రభుత్వంలో భాగస్వాములైన  మహిళలు, యువత, రైతులు, పేదలు, మధ్యతరగతి, సీనియర్ సిటిజన్లు, పిల్లలకు ఉన్నతమైన జీవన ప్రమాణాలు కల్పించాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్ లో మీ కొత్త సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు మరోసారి అభినందిస్తున్నాను. మేం గర్వపడేలా మీరు పనిచేస్తారని నమ్మకం ఉందన్నారు’ సీఎం రేవంత్ రెడ్డి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget