Revanth Reddy: ‘మంత్రి గారూ.. అందులో మీ వాటా ఎంత?’ రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్
అక్రమ భవన కట్టడాల్లో మీ వాటా ఎంత అని మంత్రి కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఓ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
![Revanth Reddy: ‘మంత్రి గారూ.. అందులో మీ వాటా ఎంత?’ రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్ Revanth reddy asks Minister KTR over Illegal buldings construction in Boduppal Revanth Reddy: ‘మంత్రి గారూ.. అందులో మీ వాటా ఎంత?’ రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/14/3f772594b731f29160fca81383a9bfa8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీటర్ వేదికగా పలు ఆరోపణలు చేశారు. ఓ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా రేవంత్ రెడ్డి ఈ ట్వీట్ చేశారు. అక్రమ భవన కట్టడాల్లో మీ వాటా ఎంత అని మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. అక్రమార్కుల విషయంలో ఇప్పటికైనా సమాన చర్యలు తీసుకుంటారా అని మంత్రిని ఉద్దేశించి నిలదీశారు.
‘‘అధికారం ఉన్నదే దోచుకోవడానికి, కబ్జాలు చేయడానికి అని బరితెగించి… తెగబడుతోన్న టీఆర్ఎస్ నేతల అవినీతి పరాకాష్ఠకు చేరింది. మున్సిపల్ శాఖ మంత్రి గారూ... అక్రమ నిర్మాణాలలో మీ “వాటా” ఎంత...?! ఇప్పటికైనా అక్రమార్కులపై “సమాన” చర్యలు తీసుకుంటారా...?’’ అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
Also Read: Nellore: లేడీ కానిస్టేబుల్స్‌కి యూనిఫాం కొలతలు పురుషులతో..! వివాదాస్పదంగా పోలీసుల తీరు
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్‌లోని బోడుప్పల్, పీర్జాదీగూడ్ ప్రాంతాల్లో ఇష్టమొచ్చినట్లుగా అక్రమ నిర్మాణలు వెలుస్తున్నాయని, జవహార్ నగర్‌లో ఓ మంత్రికి చెందిన ఆస్పత్రి వెలిసిందని ఓ ప్రధాన పత్రికలో కథనం వచ్చింది. అంతేకాకుండా అనుమతుల్లేకుండా ఎత్తైన భవనాలు కడుతున్నారని.. అయినా జీహెచ్ఎంసీ అధికారులు ఆవైపు చూడడం లేదని అందులో ఉండి. అక్రమ నిర్మాణాల కూల్చివేత జాబితాలో కూడా కనీసం ఆ నిర్మాణాలను చేర్చలేదని ఆ వార్తలో వివరించారు.
దీంతో ఈ అంశంపై తెలంగాణ పీసీస అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఆ కథనానికి సంబంధించిన క్లిప్‌లను ట్విటర్‌లో జత చేస్తూ.. ‘‘అధికారం ఉన్నదే దోచుకోవడానికి,కబ్జాలు చేయడానికి అని బరితెగించి… తెగబడుతోన్న టీఆర్ఎస్ నేతల అవినీతి పరాకాష్ఠకు చేరింది. మున్సిపల్ శాఖ మంత్రి గారూ... అక్రమ నిర్మాణాలలో మీ “వాటా” ఎంత...?! ఇప్పటికైనా అక్రమార్కులపై “సమాన” చర్యలు తీసుకుంటారా...?’’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
Also Read: Bandi Sanjay: రాజ్యాంగం మార్చాలని కేసీఆర్ అందుకే అంటున్నడు.. బండి సంజయ్ వ్యాఖ్యలు
అధికారం ఉన్నదే దోచుకోవడానికి,కబ్జాలు చేయడానికి అని బరితెగించి… తెగబడుతోన్న టీఆర్ఎస్ నేతల అవినీతి పరాకాష్ఠకు చేరింది.
— Revanth Reddy (@revanth_anumula) February 7, 2022
మున్సిపల్ శాఖ మంత్రి గారూ...
అక్రమ నిర్మాణాలలో మీ “వాటా” ఎంత...?!
ఇప్పటికైనా అక్రమార్కులపై “సమాన” చర్యలు తీసుకుంటారా...?@TelanganaCMO @HMDA_Gov @KTRTRS pic.twitter.com/oob06n6UGk
Also Read: Gupta Nidhulu: వరంగల్‌లో గుప్త నిధులు, 1000 బంగారు నాణెల కేసులో 8 మంది అరెస్ట్.. ఎన్నో ట్విస్టులు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)