అన్వేషించండి

Gupta Nidhulu: వరంగల్‌లో గుప్త నిధులు, 1000 బంగారు నాణెల కేసులో 8 మంది అరెస్ట్.. ఎన్నో ట్విస్టులు

వరంగల్ జిల్లాలో గుప్త‌నిధుల త‌వ్వ‌కాల కేసులో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

Gupta Nidhulu In Warangal District: వ‌రంగ‌ల్ జిల్లా గీసుగొండ మండ‌లం గంగ‌దేవిప‌ల్లిలో గుప్త‌నిధుల త‌వ్వ‌కాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. త‌వ్వ‌కాల‌కు పాల్ప‌డిన 8మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో గంగ‌దేవిప‌ల్లి గ్రామానికి చెందిన యార‌ మల్లారెడ్డి, మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరుకు చెందిన‌ పంజరబోయిన శ్రీనివాస్, గంగ‌దేవిప‌ల్లికి చెందిన‌ మేడిద కృష్ణ, నెక్కొండ మండ‌లం అమీన్‌పేట‌కు చెందిన పూజారి యాత పూర్ణ చందర్‌లు ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. అరెయార రమణయ్య , యార రాజయ్య, యార కుమారస్వామి, గీసుగొండ రాజిరెడ్డిలు ప‌రారీలో ఉన్నారని చెప్పారు. తవ్వకాలలో బయటపడిన  30 రాగి నాణెలతో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్న‌ట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభ‌వ్ గైక్వాడ్ పేర్కొన్నారు.

డీసీపీ వైభ‌వ్ గైక్వాడ్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. యార మల్లారెడ్డికి గంగాదేవి గ్రామంలో స‌ర్వే నెంబ‌ర్ 375లో 1.8 ఎకరాల భూమి ఉంది. త‌న పంట భూమిలో గుప్త నిధులున్న‌ట్లుగా తెలుసుకున్నాడు. రెవెన్యూ అధికారుల‌కు, పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల్సి ఉన్నా అలా చేయ‌లేదు. గుప్త నిధులు వెలికి తీయాల‌ని నిర్ణ‌యించుకున్న మ‌ల్లారెడ్డి గ‌త నెల 23న అదే గ్రామానికే చెందిన‌ పంజ‌ర‌బోయిన శ్రీనివాస్‌, మేడిద కృష్ణ‌, యాట పూర్ణచందర్‌లతో కలిసి త‌వ్వ‌కాలు జ‌రిపాడు. ఈ త‌వ్వ‌కాల్లో 1818 నాటి 30 పాత రాగి నాణేలను బయటపడ్డాయి. తర్వాత మహేష్ సహాయంతో హైదరాబాద్‌లో వాటిని విక్రయించేందుకు మ‌రుస‌టి రోజు నుంచే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు.

టాస్క్‌ఫోర్స్ అధికారుల‌కు సమాచారం తెలియ‌డంతో నిందితుల‌పై నిఘా పెట్టారు. హైద‌రాబాద్‌లో అమ్మేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా వ‌రంగ‌ల్ క‌మిష‌న‌రేట్ టాస్క్‌ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు నిందితుల‌ను గీసుగొండ పీఎస్‌లో అప్ప‌గించిన‌ట్లు తెలిపారు.
గంగ‌దేవిప‌ల్లి యార మల్లారెడ్డి  జ‌రిపిన త‌వ్వ‌కాల్లో పెద్ద ఎత్తున బంగారం ల‌భ్య‌మైన‌ట్లుగా గ్రామ‌స్తుల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతోంది. రాగి నాణెల‌తో పాటు దాదాపు 1000 బంగారు నాణెలు ల‌భ్యమైన విష‌యం వారం రోజుల క్రితం గ్రామస్తులకు తెలిసిన‌ట్లు స‌మాచారం. దాదాపు రెండున్న‌ర కిలోల వ‌ర‌కు ఉండొచ్చ‌ని స్థానికంగా మాట్లాడుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే విష‌యం బ‌య‌ట‌కు తెలిస్తే అస‌లుకే మోసం వ‌స్తుంద‌నే ఉద్దేశంతోనే బంగారం విష‌యం వెలుగులోకి రాకుండా రాగి నాణెల దొరికిన‌ట్లుగా సీన్ క్రియేట్ చేసిన‌ట్లుగా గ్రామ‌స్తులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా కేసును పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేద‌ని వాపోతున్నారు.

గంగ‌దేవిప‌ల్లిలో జ‌రిగిన గుప్త నిధుల త‌వ్వ‌కాల్లో భారీ ఎత్తున బంగారం ల‌భ్య‌మైన విష‌యం ఓ ఇద్ద‌రు పెద్ద నేతలకు తెలియ‌డంతో విష‌యం ఆరా తీసి వాటాలు కోరుతున్న‌ట్లుగా నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం జ‌రుగుతోంది. కేసును నీరుగార్చేందుకు, నిందితులను ఈ కేసు నుంచి ర‌క్షించేందుకు బేరసారాలు జ‌రుగుతున్నట్లుగా విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. త‌న భూమిలో గుప్త‌నిధులున్న‌ట్లు యార మల్లారెడ్డికి ఎలా తెలిసింది..? పెద్ద‌గా విలువ‌లేని రాగి నాణెల విష‌యాన్ని రెవెన్యూ, పోలీసుల‌కు చెప్ప‌కుండా ఎందుకు దాయాల్సి వ‌చ్చింది…? పూజారీని కూడా స‌మ‌కూర్చుకోవ‌డం వెనుక మ‌ల్లారెడ్డి ప‌క్కా ప్లానింగ్ తో గుప్త‌నిధుల త‌వ్వ‌కాల‌కు పాల్ప‌డిన‌ట్లుగా స్ప‌ష్టంగా తెలుస్తోంది. మ‌రి నేరం స్ప‌ష్ట‌మైన నేప‌థ్యంలో పోలీసులు త‌ర్వాత ద‌ర్యాప్తును ఏవిధంగా తీసుకెళ్తారో వేచి చూడాల్సి ఉంది.

Also Read: India Corona Cases: దేశంలో లక్ష దిగువకు పాజిటివ్ కేసులు, తాజాగా కొవిడ్‌తో 895 మంది మృతి

Also Read: Nizamabad News: ఇందూరు జిల్లా నిజామాబాద్‌‌ ఎలా అయ్యింది, పేరు మార్చడానికి కారణం ఇదే 

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget