India Corona Cases: దేశంలో లక్ష దిగువకు పాజిటివ్ కేసులు, తాజాగా కొవిడ్‌తో 895 మంది మృతి
India Corona Cases: దేశంలో కరోనా కేసుల వ్యాప్తి తగ్గింది. యాక్టివ్ కేసుల రేటు 2.62 శాతం ఉండగా, రికవరీ రేటు 96.19 శాతానికి పెరిగినట్లు తాజా బులెటిన్‌లో తెలిపారు.
Covid Cases In India: భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. తాజాగా పాజిటివ్ కేసులు లక్ష దిగువన నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 83,876 (83 వేల 876) మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో నిన్న ఒక్కరోజులో కరోనాతో పోరాడుతూ 895 మంది మరణించారు. వరుసగా అయిదోరోజులు కరోనా మరణాలు వెయ్యి పైగా నమోదు కాగా, తాజాగా మరణాలు వెయ్యి దిగువకు వచ్చాయి.
తాజా మరణాలతో కలిపితే భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 5,02,874 (5 లక్షల 2 వేల 874)కు చేరింది. నిన్న ఒక్కరోజులో 1,99,054 (1 లక్షా 99 వేల 54) మంది కరోనాను జయించారని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. తాజా రికవరీలతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దేశంలో ప్రస్తుతం 11,08,938 (11 లక్షల 8 వేల 938) మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఇక రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు రేటు 7.25కి దిగొచ్చింది.
భారత్‌లో కొవిడ్ డోసుల పంపిణీ 169.63 కోట్ల మైలురాయికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం డోసులు 169 కోట్ల 63 లక్షల 80 వేల 755 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా వద్ద 12 కోట్ల మేర వ్యాక్సిన్ డోసుల వరకు నిల్వ ఉన్నాయి. యాక్టివ్ కేసుల రేటు 2.62 శాతం ఉండగా, రికవరీ రేటు 96.19 శాతానికి పెరిగినట్లు తాజా బులెటిన్‌లో తెలిపారు.
Also Read: Nizamabad News: ఇందూరు జిల్లా నిజామాబాద్ ఎలా అయ్యింది, పేరు మార్చడానికి కారణం ఇదే