అన్వేషించండి

KTR vs Ponguleti: కేటీఆర్ ను మంత్రి పొంగులేటి ఎందుకు టార్గెట్ చేశారు? కారణాలు ఇవేనా!

ఓనాడు కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు కేటీఆర్ అరెస్టు ఖాయమం అంటూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు.

Telangana News | ఓనాడు కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్టు ఖాయమంటూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు.  ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది.  ఇది కేవలం రాజీకీయ శతృత్వమా లేక వ్యక్తిగతంగా పొంగులేటి బీఆర్ఎస్ నేత కేటీఆర్ ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో అటం బాంబులు పేలనున్నాయని, కేటీఆర్ త్వరలో జైలుకెళ్లడం ఖాయమని మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  పదే పదే వ్యాఖ్యనిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఏ సమావేశంలో పొంగులేటి పాల్గొన్నా, మీడియా సమావేశంలో పాల్గొన్నా కేటీఆర్ అరెస్ట్ ప్రస్తావన తెస్తూనే ఉన్నారు.  

 నాడు సన్నిహితులు, నేడు రాజకీయ శత్రువులు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తొలుత కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా తన ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత  2013లో వైకాపాలో చేరి 2014 ఎన్నికల్లో ఖమ్మం నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచారు.  తెలంగాణ ఉద్యమంలో ను పాల్గొన్నారు. వైకాపా తెలంగాణ వ్యతిరేక స్టాండ్ తీసుకోవడంతో పొంగులేటి టీఆర్ఎస్ చేరారు. అప్పటి నుండి టీఆర్ఎస్ లో  కేటీఆర్  తో అత్యంత సన్నిహితంగా  ఉన్నారు. అయితే 2018 ఎన్నికల్లో   ఎమ్మెల్యే టికెట్, 2019 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ టికెట్ ను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పొంగులేటికి ఇవ్వలేదు. దీంతో  క్రమ క్రమంగా పొంగులేటికి, గులాబీ పార్టీకి మధ్య దూరం పెరిగింది. పదేళ్ల కాలంలో   ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తారన్న  ఆశతో పొంగులేటి  ఉన్నారని పదే పదే ఈ విషయంలో కేటీఆర్ తో చర్చలు జరిగాయని  అయితే కేసీఆర్  ఇందుకు సముఖత వ్యక్తం చేయలేదని ఇటు గులాబీ నేతలు, అటు పొంగులేటి వర్గీయులు చెబుతారు. అలా కేసీఆర్ కు పొంగులేటికి మధ్య దూరం పెరిగిపోయంది.

చాలా ఇంటర్వ్యూల్లో సైతం తనకు రాజకీయంగా కేటీఆర్ మాట ఇచ్చారని, కేసీఆర్ తో  ఏం లేదని బహిరంగంగానే  చెప్పడం విశేషం. కాంగ్రెస్ లో చేరే ముందు కూడా పొంగులేటి కేసీఆర్  నే టార్గెట్ చేసి విమర్శలు చేశారు.  కేటీఆర్ తనకు సన్నిహితుడని చెప్పుకొచ్చారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ పొంగులేటిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి  గెలిచిన పొంగులేటి మంత్రి అయ్యారు. ఈ క్రమంలో ఒకప్పడు సన్నిహితంగా మెగిలిన కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ పొంగులేటి మాట్లాడటం ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది.

 రాజకీయ శత్రుత్వమా... వ్యక్తిగత వైరమా...

2018 ఎన్నికల్లో  పాలేరు నుంచి  తుమ్మల నాగేశ్వరరావును బీఆర్ఎస్ అభ్యర్థిగా నెలబెట్టింది. ఆ ఎన్నికల్లో తుమ్మల కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.  ఈ ఓటమికి కారణం పొంగులేటి అన్న ప్రచారం విరివిగా సాగింది. దీనిపై  బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సైతం పొంగులేటి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 లో  సిట్టింగ్ ఎంపీగా ఉన్న  పొంగులేటిని కాదని పార్టీలో చేరిన నామానాగేశ్వరరావుకు  కేసీఆర్ టికెట్ ఇచ్చారు.  అప్పటి నుండి 2023 వరకు పొంగులేటికి కేసీఆర్ ఏ పదవి ఇవ్వలేదు. అయితే పదే పదే తాను కేటీఆర్ తో మంతనాలు జరిపిన తర్వాతే  బీఆర్ఎస్ లో చేరారని, తనకు కేటీఆర్ న్యాయం చేస్తారని పొంగులేటి నాడు తన సన్నిహితుల వద్ద కొన్ని సార్లు మీడియా ముఖంగానే వ్యాఖ్యలు చేశారు.  మరోవైపు  ఖమ్మంలో  పువ్వాడ అజయ్ కి మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించడం, తనను  పట్టించుకోకపోవడం కూడా పొంగులేటికి ఆగ్రహం తెప్పించినట్లు ఆయన వర్గీయులు చెబుతారు. అదే క్రమంలో కేటీఆర్  తన పరపతి ఉపయోగించి తనకు ఏం చేయలేకపోయారని, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ తో మాట్లాడి  రాజకీయంగా న్యాయం చేయడంలో కేటీఆర్ విఫలం అయ్యారన్న  అసంతృప్తి పొంగులేటి ఉన్నట్లు చెబుతారు.  

ఈ క్రమంలో కాంగ్రెస్ లో చేరి మంత్రి అయిన పొంగులేటి ఇప్పుడు  కేటీఆర్ కు చుక్కలు చూపెడుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.  తనను పార్టీలో నిర్లక్ష్యం చేసినందుకు  తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్న రీతిలో  కేటీఆర్ టార్గెట్ గా  పొంగులేటి  కామెంట్స్ చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.  రాజకీయ వైరం అయితే  క్యాబినెట్ లో అందరు మంత్రులు ఫార్ములా ఈ రేస్ వ్యవహారం లో మాట్లాడాల్సి ఉండగా, కేవలం పదే పదే పొంగులేటి మాట్లాడటం  ఇందులో భాగమేనా అన్న  ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

 పొంగులేటికి కేటీఆర్ రిటర్న్ పంచులు..

తన అరెస్టు మీద మాట్లాడుతున్న  పొంగులేటిపైన కేటీఆర్  తన దైన శైలిలో రిటర్న్ పంచులు ఇస్తున్నారు.  మంత్రి పొంగులేటి  డీజీపీనా, హోం మంత్రినా... బీఆర్ఎస్ నేతల  అరెస్టులు కోసం ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఆ తర్వాత జైలుకు వెళ్లడానికి తాను రడిగానే ఉన్నానని చెప్పారు.  ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో  అక్రమాలు జరిగాయని, అందుకు కేటీఆర్ బాధ్యుడని మంత్రి పొంగులేటి తెలిపారు. కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతిని ఏసీబీ కోరిందని, గవర్నర్ నుండి అనుమతి రాగానే  అరెస్టు చేయడం ఖాయమని మరో దఫా పొంగులేటి చెప్పడం విశేషం.  ఈ విషయం తెలిసే  ఢిల్లీ పెద్దలను కలిసేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని  చెప్పారు.

ఎమ్మెల్సీ కవితకు బైయిల్ ఎలా వచ్చిందో తమ వద్ద ఆధారాలున్నాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అయితే దీనిపై స్పందించిన కేటీఆర్ తాను ఇప్పుడే ఢిల్లీలో అడుగుపెట్టానని దీనిపై అప్పుడే రూమర్లు సృష్టిస్తున్నారని  కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.  ఇదంతా చూస్తుంటే క్యాబినెట్ మంత్రుల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రమే పదే పదే కేటీఆర్ టార్గెట్ గా మాట్లాడటం ఇప్పుడు అందరిలో ఆసక్తి కలుగజేస్తోంది. దీంతో పాటు ఈడీ కేసుల్లో పొంగులేటి జైలుకు వెళ్లడం ఖాయమని  కేటీఆర్ సైతం ధీటుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు గులాబీ పార్టీలో సన్నిహితులుగా ఉన్న కేటీఆర్, పొంగులేటి మధ్య  ఈ రాజకీయ వైరం ఎక్కడి దాకా పోనుందో వేచి చూడాల్సిందే. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
BSNL Broadband Plan: బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Embed widget