News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Congress Vijayabheri Sabha: తుక్కుగూడలో కాంగ్రెస్ సభకు పోలీసులు అనుమతి, 25 కండీషన్లు!

Congress Vijayabheri Sabha at Tukkuguda: తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించనున్న సభకు పోలీసుల అనుమతి లభించింది. సెప్టెంబర్ 17న కాంగ్రెస్ నేతలు రంగారెడ్డి తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు.

FOLLOW US: 
Share:

Congress Vijayabheri Sabha at Tukkuguda: 

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించనున్న సభకు పోలీసుల అనుమతి లభించింది. సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నేతలు రంగారెడ్డి తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఈ సభకు పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు హాజరు కానున్నారని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 9 గంటలకు వరకు సభ నిర్వహించుకునేందుకు అనుమతి లభించింది. 

కాంగ్రెస్ విజయభేరి సభకు పోలీసులు అనుమతి రాకున్నా పార్టీ శ్రేణులు తుక్కుగూడలో సభ నిర్వహణకు ఏర్పాట్లు కొనసాగించాయి. ఈ క్రమంలో తుక్కుగూడలో సభ నిర్వహణకు రాచకొండ పోలీసులు అనుమతి ఇచ్చారు. మొత్తం 25 కండీషన్లతో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభకు అనుమతి ఇచ్చారు. మరోవైపు సభకు 10 వేలకు మించి మంది పాల్గొనకూడదని పోలీసులు షరతులు విధించారు. కానీ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం లక్షల్లో నేతలు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొనేలా సభకు ఏర్పాట్లు చేస్తోంది. 

తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన సోనియా గాంధీకి నాలుగున్నర కోట్ల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపేందుకు సభ అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సెప్టెంబర్ 17న మహేశ్వరం నియోజకవర్గం, తుక్కుగుడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో "విజయ భేరి" మోగిద్దాం అంటూ పిలుపునిచ్చారు.

Published at : 13 Sep 2023 11:53 PM (IST) Tags: CONGRESS Revanth Reddy Tukkuguda Sonia Gandhi Rahul Gandhi

ఇవి కూడా చూడండి

PGECET Seats: పీజీఈసెట్‌ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 3592 మందికి ప్రవేశాలు

PGECET Seats: పీజీఈసెట్‌ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 3592 మందికి ప్రవేశాలు

తెలంగాణలో కాంగ్రెస్ జాబితా మరింత ఆలస్యం, ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్

తెలంగాణలో కాంగ్రెస్ జాబితా మరింత ఆలస్యం, ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్

Bandi sanjay on BRS: ప్రధాని టూర్‌తో ప్రగతిభవన్‌లో ప్రకంపనలు- బీఆర్ఎస్‌లో చీలిక ఖాయమన్న బండి సంజయ్‌

Bandi sanjay on BRS: ప్రధాని టూర్‌తో ప్రగతిభవన్‌లో ప్రకంపనలు- బీఆర్ఎస్‌లో చీలిక ఖాయమన్న బండి సంజయ్‌

Mega Dairy Project: పాడి రంగంలో మెగా ప్రాజెక్టు, రేపు కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం

Mega Dairy Project: పాడి రంగంలో మెగా ప్రాజెక్టు, రేపు కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం

Inter Admissions: ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఇక ఇదే చివరి అవకాశం!

Inter Admissions: ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఇక ఇదే చివరి అవకాశం!

టాప్ స్టోరీస్

విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ మూసివేత

విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ మూసివేత

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

Devil Movie Sequel : కళ్యాణ్ రామ్ 'డెవిల్'కు సీక్వెల్ - డైరెక్షన్ కాంట్రవర్సీకి చెక్ పెట్టడం కోసమా?

Devil Movie Sequel : కళ్యాణ్ రామ్ 'డెవిల్'కు సీక్వెల్ - డైరెక్షన్ కాంట్రవర్సీకి చెక్ పెట్టడం కోసమా?

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ... 

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ...