By: ABP Desam | Updated at : 14 Feb 2022 07:53 PM (IST)
డ్రోన్ వినియోగంపై జయశంకర్ యూనివర్శిటీ కోర్సు
డ్రోన్ల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న వేళ వాటి వినియోగంపై కూడా అవగాహన అవసరం అవుతుంది. అందుకే దీనిపై యువతకు అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతోంది ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీ( Professor Jayashankar Telangana State Agricultural University). డ్రోన్ వినియోగంపై సర్టిఫికేట్ కోర్సు(Certificate course on Drone Use) ప్రవేశ పెట్టే ఆలోచనలు ఉంది.
డ్రోన్లతో వ్యవసాయంలో అద్భుతాలు చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా డ్రోన్ల వినియోగం ఊపందుకోలేదు. అందుకే భవిష్యత్ అవసరాల దృష్ట్య యువతు అవగాహన కల్పించాలని భావిస్తోంది తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్శిటీ. ఇందులో ఎక్కువ ఉపాధికి అవకాశం ఉండటంతో ఎక్కువ మంది యువత దీనికి ఆకర్షితులవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లకు అవగాహన కల్పించడానికి ప్రముఖ ఏవియేషన్ సంస్థతో ఒప్పందం చేసుకొని సర్టిఫికేట్ కోర్సు తీసుకురానుంది.
వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి కోసం డ్రోన్‌లను ఉపయోగించుకోవడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇప్పటికే యూనివర్శిటీకి అనుమతిని ఇచ్చాయి. దేశంలోనే ఇలాంటి ఆమోదం పొందిన తొలి సంస్థ ఇదే.
PJTSAU తెలంగాణలోని పొలాల్లో మొక్కల సంరక్షణ, అగ్రి-స్ప్రేయింగ్, తెగుళ్లు, వ్యాధులను గుర్తించడం, నివారణ చర్యలపై పరిశోధనలు చేస్తుంటుంది. రాష్ట్రంలోని ఆరు ప్రధాన పంటలకు చేపట్టాల్సిన విధి విధానాలను ఖరారు చేసింది.
డ్రోన్ వినియోగంపై సర్టిఫికేట్ కోర్సుతో మెరుగైన కెరీర్ అవకాశాలు
"ఈ సర్టిఫికేట్ ద్వారా వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంలో సుశిక్షితులైన మానవ వనరులను రెడీ చేయనున్నారు. ఇది వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుందని భావిస్తోంది విశ్వవిద్యాలయం. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక డ్రోన్ పైలట్‌ను నియమిస్తామన్నారు. పీజేటీఎస్‌ఏయూ ఉపకులపతి డాక్టర్ వి ప్రవీణ్‌రావు మాట్లాడుతూ ఈ శిక్షణ గ్రామీణ యువతకు, యూనివర్సిటీ విద్యార్థులకు కూడా కెరీర్ అవకాశాలను కల్పిస్తుందన్నారు.
ఆర్గానిక్ ఫుడ్‌కు ప్రాధాన్యత పెరుగుతున్న వేళ ఈ సంవత్సరం MSC ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రోగ్రామ్‌ను అందించడానికి రెడీ అయింది యూనివర్శిటీ. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) ఆమోదించిన కోర్సు ఇది. సేంద్రీయ వ్యవసాయంలో రూ. 10 కోట్ల విలువైన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌ను రాష్ట్రీయ కృషి వికాస్ యోజన సంస్థ(Rashtriya Krishi Vikas Yojana) యూనివర్శిటీకి అందించింది.
"స్కిల్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్"పై ఆన్‌లైన్ కోర్సు రెండో బ్యాచ్‌ను స్టార్ట్ చేసింది. దీన్ని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్గానిక్ ఇండస్ట్రీతో కలిసి నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన శిక్షణ మార్చి 1 నుంచి ప్రారంభమవుతుంది. అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ కరికులమ్‌ను మార్చింది PJTSAU. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో కలిసి ఈ పీజీ కోర్సు సిలబస్ మార్చింది యూనివర్సిటీ.
What's App Calls Cheating : అందమైన అమ్మాయి వాట్సప్ వీడియో కాల్ చేస్తే, మీకు చిక్కులే!
TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల
Minister KTR : సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టండి, ఆడబిడ్డలకు కేటీఆర్ పిలుపు
TS Cabinet Meet : తెలంగాణ కేబినెట్ భేటీ, మునుగోడు ఉపఎన్నికపై చర్చ!
Hyderabad Crime : జీడిమెట్లలో దారుణం, బ్యూటిషన్ పై స్నేహితుడే అత్యాచారం!
Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?
Telangana Cabinet : ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !
కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌తో మెగా హీరో నిశ్చితార్థం!
టార్గెట్ లోకేష్ వ్యూహంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందా?