అన్వేషించండి

Hyderabad Crime News: హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్

నల్గొండలో చోరీలకు పాల్పడిన నిందితుడు భూష్మి శ్రీకాంత్‌పై హైదరాబాద్‌ ORR వద్ద తప్పించుకోబోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు.

Hyderabad ORR | హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో మంగళవారం కాల్పులు కలకలం రేపాయి. నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఒక నిందితుడు హైదరాబాద్‌లో ఉన్నట్లు నల్గొండ సీసీఎస్‌ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల బృందం అతడిని పట్టుకునేందుకు మంగళవారం హైదరాబాద్‌కు చేరుకుంది.

ఆదిభట్ల పరిసరాల్లోని హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద నిందితుడిని పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో నిందితుడు వారిపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలోనే పోలీసులు ఆత్మరక్షణ కోసం అతడిపై కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో గాయపడిన నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భూష్మి శ్రీకాంత్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం వనస్థలిపురంలోని ఆసుపత్రికి తరలించారు.

నిందితుడి నేర చరిత్ర
పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో నిందితుడిపై నాలుగేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో ఒక పోలీస్ కానిస్టేబుల్‌ను హత్య చేసిన కేసులో ఇతడు ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. పదికి పైగా దొంగతనాల కేసులు ఉన్నట్లు తేలింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Sridhar Babu Morphed Videos: మంత్రి శ్రీధర్ బాబు దంపతులను సైతం వదలని సైబర్ నేరగాళ్లు! ఏఐ మార్ఫింగ్ వీడియోలపై ఫిర్యాదు 

పోలీసుల పై కత్తితో దాడికి యత్నం.. ఆత్మరక్షణ కోసం పోలీసుల కాల్పులు  
సోమవారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో శ్రీకాంత్ AP 39 VB 6640 నంబర్ గల డీసీఎం ఐషర్ వాహనంలో ఇబ్రహీంపట్నం నుంచి బొంగులూరు వైపు ఫస్ట్ సర్వీస్ రింగ్ రోడ్ మీదుగా వెళ్తున్నాడు. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సీసీఎస్ నల్గొండ పోలీసులు అనుమానంతో వాహనాన్ని ఆపి చెక్ చేయబోతే.. నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో పోలీసులపై దాడికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపగా, రెండు బుల్లెట్లు నిందితుడి కాళ్లకు తగిలాయని పోలీసులు తెలిపారు.

గాయపడిన శ్రీకాంత్‌ ను వెంటనే 108 అంబులెన్స్‌లో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి చేరుకున్న నల్గొండ సీసీఎస్ పోలీసులు నిందితుడిని నల్గొండకు తరలించినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించాక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై గతంలో ఉన్న ఆస్తి నేరాల కేసుల వివరాలు సేకరిస్తున్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget