అన్వేషించండి

Hyderabad Crime: హైదరాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్- విద్యార్థులే టార్గెట్‌గా సాగుతున్న వ్యాపారం

Crime News: విద్యార్థులు, యువతే టార్గెట్‌గా హైదరాబాద్‌లో దందాలు సాగుతున్నాయి. మొన్నటి వరకు గంజాయి చాకెట్లు విక్రయించారు. ఇప్పుడు ఐస్‌క్రీమ్‌లో కూడా మత్తుపదార్థాలు పెట్టి అమ్ముతున్నారు.

Hyderabad Police: హైదరాబాద్‌లో ఇప్పటి వరకు గంజాయితో చాక్లెట్లు తయారు చేసి పిల్లలకు మాదక ద్రవ్యాలు విక్రయించిన ముఠాలనే చూశాం. ఇప్పుడు మరో రకంగా పిల్లలకు యువతను పక్కదారి పట్టిస్తోంది. ఐస్క్‌క్రీమ్‌లో విస్కీ పెట్టి అమ్ముతున్న విషయం ఇప్పుడు వెలుకులోకి వచ్చింది. 

విస్కీ ఐస్‌క్రీమ్‌తో దందా

హైదరాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వన్‌ అండ్‌ ఫైవ్‌ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో సోదాలు చేసిన అధికారులు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చారు. చిన్నారులు, యువతే టార్గెట్‌గా వీటిని విక్రయిస్తున్నట్టు పోలీసులు విచారణలో తేలింది. 

యువత, చిన్నారులే టార్గెట్

అరవై గ్రాముల ఐస్‌క్రీమ్‌లో వెయ్యి మిల్లీ గ్రాములు విస్కీని కలుపుతూ విక్రయిస్తున్నారు. వీటిని యువతకు, పిల్లలకు అలవాటు చేయడానికే వీళ్లు ప్రయత్నిస్తున్నట్టు విచారణలో తేలింది. ఇలాంటి ఐస్‌క్రీమ్‌కు అలవాటు  పడిన పిల్లలు, యువత ఎగబడుతున్నట్టు  పోలీసులు గుర్తించారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. 

11 కిలోల ఐస్‌క్రీమ్ స్వాధీనం

పార్లర్‌పై దాడి చేసిన పోలీసులు 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్ స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లోని వన్ అండ్ ఫైవ్‌లో  హరికే కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది. ఇందులోనే ఈ విస్కీ ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు. ఒక కేజీ ఐస్ క్రీమ్‌లో 60ml 100 పేపర్ విస్కీని కలుపుతున్నారు. దాన్ని ఎక్కువ ధరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. 

Also Read: కేసీఆర్‌కు మరోసారి కోర్టు సమన్లు-వచ్చే నెల 17న హాజరుకావాలని ఆదేశం- ఏ కేసులో అంటే?

సోషల్ మీడియాలో ప్రచారం

యూత్‌ను టార్గెట్ చేసుకొని తయారు చేస్తున్న ఈ ఐస్‌క్రీమ్‌ సేల్స్ పెంచుకోవడానికి సోషల్ మీడియలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ యాడ్‌లు చూసిన యువత భారీగా వచ్చి ఐస్‌క్రీమ్ టేస్ట్ చేస్తున్నారు. ఒకసారి అలవాటు పడిన వారంతా వస్తూనే ఉన్నారు. 

ఇద్దరి అరెస్టు

ఆఫ్ కేజీ విస్కీ ఐస్ క్రీమ్ లను 23 పీసులు సీజ్ చేశారు అధికారులు. విస్కీతో ఐస్ క్రీమ్‌ తయారు చేసిన వ్యక్తుల్లో దయాకర్ రెడ్డి, శోభన్ ఉన్నారు. ఈ ఐస్ క్రీమ్ పార్లర్‌ను శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తి నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. 

Also Read: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక- విజయవాడ మార్గంలో 44 రైళ్లు రద్దు- దసరా దీపావళికి ప్రత్యేక ట్రైన్స్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Embed widget